For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

Virat Birthday Special : పరుగుల యంత్రానికి అభినందనల వెల్లువ..

విరాట్ కోహ్లీ పుట్టిన రోజు సందర్భంగా ట్విట్టర్, ఫేస్ బుక్, ఇన్ స్టా గ్రామ్ తో పాటు సోషల్ మీడియాలో బర్త్ డే విషెస్ వరద ప్రవాహంలా కొనసాగుతోంది.

|

టీమిండియాకు ఎల్లప్పుడు ఆపద్భాందువు.. ఛేజింగులో బౌలర్లను చితక్కొట్టే రారాజు.. ఎలాంటి టీమ్ తో మ్యాచ్ అయినా సరే, ఎంతటి క్లిష్ట పరిస్థితుల్లో ఉన్నా చివరి వరకు.. భారత క్రికెట్ జట్టు గెలుపొందే వరకు అలుపెరగని పోరాటం చేసే కింగ్ కోహ్లీ నేడు నవంబర్ 5వ తేదీన 33వ వసంతంలోని అడుగు పెట్టాడు.

సెంచరీల సామ్రాట్ గా, పరుగుల యంత్రంగా, విజయాల పరంపరలో విలువైన భాగస్వామిగా, గంగూలీ, ధోనీ తర్వాత అత్యంత విజయవంతమైన కెప్టెన్ గా ఎన్నో రికార్డులను నెలకొల్పుతూ.. మరెన్నో రికార్డులను తిరగరాస్తూ.. తన దూకుడైన ఆటతీరుతో ప్రపంచ వ్యాప్తంగా అభిమానులను సంపాదించుకున్నాడు.

అంతేకాదు మన దాయాదీ దేశం పాకిస్థాన్ లో సైతం కోహ్లీకి వీరాభిమానులు ఉన్నారు. ట్విట్టర్లోనూ, స్టేడియాల్లోనూ పాకిస్థాన్ కు చెందిన కోహ్లీ అభిమానులు తమకు ఇలాంటి ఆటగాడు ఒక్కడుంటే చాలు తమ దేశం కూడా ఎన్నో విజయాలను సాధిస్తుందని బహిరంగంగానే చెప్పారు.

కోహ్లీకి నెటిజన్ల అభినందనల వెల్లువ..

కోహ్లీకి నెటిజన్ల అభినందనల వెల్లువ..

Image curtosy

విరాట్ కోహ్లీ పుట్టిన రోజు సందర్భంగా ట్విట్టర్, ఫేస్ బుక్, ఇన్ స్టా గ్రామ్ తో పాటు సోషల్ మీడియాలో బర్త్ డే విషెస్ వరద ప్రవాహంలా కొనసాగుతోంది. ఒక్కో అభిమాని ఒక్కోలా అభినందిస్తున్నారు. కొందరు కోహ్లీ సాధించిన రికార్డులను ట్విట్టర్లో వీడియోల రూపంలో షేర్ చేస్తే.. మరికొందరు కోహ్లీ సాధించిన సెంచరీలను.. ఇంకొందరు కోహ్లీ క్లిష్ట సమయాల్లో ఆదుకున్న వీడియోలను, అంతర్జాతీయ క్రికెట్ లో ఆరంగేట్రం చేసిన వీడియోలను ఫొటోలను షేర్ చేశారు. దీంతో ట్విట్టర్ టాప్ ట్రెండ్, సెకండ్ టాప్ ట్రెండ్ రెండూ విరాట్ కోహ్లీతోనే నిండిపోయాయి.

కింగ్ కోహ్లీదే టాప్ ట్రెండ్..

కింగ్ కోహ్లీదే టాప్ ట్రెండ్..

Image curtosy

ట్విట్టర్లో ఈరోజు ఇప్పటికే 21 వేల ట్వీట్లు ఉండగా.. సెకండ్ ట్రెండ్ అయిన కోహ్లీకి బర్త్ విషేస్ కే 17 వేలకు పైగా ట్వీట్లు ఉండటంతో పాటు అవి క్షణక్షణం అంతకంతకూ పెరుగుతూ పోతున్నాయి. ప్రతిసారీ పుట్టినరోజు సమయంలో ఫ్యామిలీకి దూరంగా ఉండే కింగ్ కోహ్లీ ఈసారి మాత్రం కుటుంబ సమేతంగా వేడుకలు జరుపుకోవడం విశేషం.

భూటాన్ లో విరుష్క జంట..

భూటాన్ లో విరుష్క జంట..

photo curtosy

ప్రస్తుతం టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ, తన భార్య అనుష్క శర్మతో కలిసి భూటాన్ పర్యటనలో ఉన్నాడు. సౌతాఫ్రికాతో టెస్టు సిరీస్ తర్వాత విరాట్ కు సెలెక్టర్లు విశ్రాంతి ఇచ్చిన సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా భూటాన్ లో విరుష్క జంట అలరిస్తోంది. ఇందుకు సంబంధించిన ఫొటోలను అనుష్క శర్మ సోషల్ మీడియాతో షేర్ చేసుకుంది. ఈ ఫొటోలు కూడా చాలా వైరల్ గా మారాయి. అక్కడ సంఘటనలు చూసి తనకు చిన్ననాటి తీపిగుర్తులు గుర్తుకు వచ్చాయని అనుష్క పేర్కొంది. సేంద్రీయ కూరగాయల మార్కెట్, దేవాలయాలను సందర్శించినట్లు వివరించింది.

దేవుడికి ధన్యవాదాలు తెలిపిన అనుష్క..

దేవుడికి ధన్యవాదాలు తెలిపిన అనుష్క..

photo curtosy

‘‘కోహ్లీని పుట్టించినందుకు దేవుడికి ధన్యవాదాలు‘ అని భావోద్వేగ పదాలను సోషల్ మీడియాతో షేర్ చేసుకుంది. అయితే గత ఏడాది విరుష్క జంట పుట్టినరోజు సందర్భంగా ప్రముఖ ఆధ్యాత్మిక క్షేత్రం హరిద్వార్ లో గడపడం.. ఇప్పుడు భూటాన్ లోని దేవాలయాలను సందర్శించడం విశేషం.

స్టార్ స్పోర్ట్స్ ‘వి‘ పేరిట..

స్టార్ స్పోర్ట్స్ ‘వి‘ పేరిట..

photo curtosy

కింగ్ కోహ్లీ పుట్టిన సందర్భంగా స్టార్ స్పోర్ట్స్ సూపర్ ‘వి‘ పేరిట ఈరోజు అంటే మంగళవారం మధ్యాహ్నం 3:30 గంటలకు ప్రత్యేక ఎపిసోడ్ ను ప్రసారం చేయనున్నట్లు ప్రకటించింది. ఇందులోనూ కోహ్లీకి సంబంధించిన విశేషాలను వివరించనుంది. కోహ్లీ 15 ఏళ్ల వయసులో పోటీ క్రికెట్ అడుగుపెట్టినప్పటి నుండి అంతర్జాతీయ క్రికెట్ లో అడుగు పెట్టి టీమిండియా కెప్టెన్ గా విజయవంతంగా జర్నీ చేస్తున్న కోహ్లీ గురించి పూర్తి వివరాలను ఈ ఎపిసోడ్ లో వివరించనున్నారు.

యువతకు ‘వి‘ స్ఫూర్తినిచ్చేలా..

యువతకు ‘వి‘ స్ఫూర్తినిచ్చేలా..

photo curtosy

కోహ్లీకి సంబంధించిన సూపర్ ‘వి‘ ఎపిసోడ్లను మొత్తం 12 విడతలుగా ప్రసారం చేయనున్నారు. కోహ్లీ చిన్నతనంలో తల్లిదండ్రులు, తన సోదరి, స్నేహితులు, టీచర్లతో విరాట్ సంబంధాలను కళ్లకు కట్టినట్టు చూపనున్నారు. మొత్తంగా దేశ యువతకు సూపర్ ‘వి‘ స్ఫూర్తినిచ్చేలా రూపొందించారు. మిగిలిన 11 ఎపిసోడ్ లను ప్రతి ఆదివారం ఉదయం 9 గంటల నుండి స్టార్ ప్లస్ , స్టార్ స్పోర్ట్స్, డిస్నీ, మార్వెల్ హెచ్ క్యూ, హాట్ స్టార్ లో ప్రసారం చేయనున్నారు.

క్రికెట్ ఆడే సమయంలోనే..

క్రికెట్ నే ప్రాణంగా భావించే కోహ్లీ తను దేశవాళీ మ్యాచ్ లో ఆడే సమయంలోనే తన తండ్రి మరణ వార్తను వినాల్సి వచ్చింది. అయినప్పటికీ క్రికెట్ ఆ మ్యాచ్ లో సెంచరీ చేసి దానిని తన తండ్రికి అంకితమిచ్చిన గొప్ప ఆటగాడు కోహ్లీ. అప్పటి నుండి అంతర్జాతీయ క్రికెట్ లో అడుగుపెట్టి సారథిగా మారి విజయవంతంగా అలుపెరుగని కృషి చేస్తున్నాడు.

ఫిట్ నెస్ కు ఎక్కువ ప్రాధాన్యత..

విరాట్ కోహ్లీ తన ఫిట్ నెస్ కు అత్యంత ఎక్కువగా ప్రాధాన్యత ఇస్తాడు. అతని బాడీని బట్టే మనం ఈ విషయాన్ని కన్ఫార్మ్ చేయవచ్చు. అంతేకాదు తను తాగే వాటర్ నుండి తీసుకునే ఆహారంలోనూ చాలా జాగ్రత్తలు తీసుకుంటాడు.

పదేళ్ల కాలంలో..

పదేళ్ల కాలంలో..

మన దేశంలో సచిన్ తర్వాత పదేళ్ల కాలంలో అంతర్జాతీయ క్రికెట్లో 20 వేల పరుగులు పూర్తి చేసిన రెండో ఆటగాడిగా రికార్డులు నెలకొల్పాడు. అంతేకాదు 2008లో అండర్-19 కెప్టెన్ గా కూడా టీమిండియాకు వరల్డ్ కప్ సాధించాడు.

FAQ's
  • విరాట్ కోహ్లీ బర్త్ డే ఎప్పుడు?

    టీమిండియా క్రికెట్ కెప్టెన్ కింగ్ కోహ్లీ 1988 సంవత్సరం నవంబర్ ఐదో తేదీన ఢిల్లీలో జన్మించారు. 2017లో బాలీవుడ్ అందాల భామ అనుష్క శర్మను వివాహం చేసుకున్నారు. వీరి ప్రేమకు గుర్తుగా 2021లో ఓ పాప పుట్టింది.

English summary

King Kohli turns 33, twitter floods birthday wishes

Virat kohli turns 31 today and birthday wishes are pouring in for the legendary India cricketer from all around in twitter. Read on
Desktop Bottom Promotion