Just In
- 4 hrs ago
ఓ అందమైన వెన్నెల పున్నమి రాత్రి వేళ ఆమె గురించే ఆలోచిస్తున్న అతనికి ఓ అద్భుతం జరిగింది... అదేంటంటే..
- 4 hrs ago
గుండెపోటుకు ప్రథమ చికిత్స (ఫస్ట్ ఎయిడ్) ఎలా పొందాలి?
- 5 hrs ago
నమ్మలేని నిజం ! ఆ ఆలయంలో దేవతల విగ్రహాలు ప్రతిరోజూ మాట్లాడతాయని మీకు తెలుసా...!
- 6 hrs ago
చలికాలంలో పొడి దగ్గుతో బాధపడుతున్నారా? ఈ ఇంటి చిట్కాలతో త్వరగా తగ్గుతుంది!
Don't Miss
- News
జర్మనీ యూనివర్శిటీలో కేరళ విద్యార్థిని: అనుమానస్పద స్థితిలో..చివరి ఫోన్ కాల్.. !
- Movies
గొల్లపూడి మరణం : ఆయన రాసిన ఆ నాటిక ఇష్టం.. సినీ పరిశ్రమకు తీరని లోటు.. కోట శ్రీనివాస్ కామెంట్స్
- Finance
నవంబర్ నెలలో 3 ఏళ్ల గరిష్టానికి రిటైల్ ద్రవ్యోల్భణం
- Technology
రెడ్మి కె30 4జీ vs రెడ్మి కె20, ఫీచర్లపై ఓ లుక్కేయండి
- Automobiles
2019 లో 10 టాప్ మోస్ట్ గూగిల్డ్ కార్స్
- Sports
లాలిగా బ్రాండ్ అంబాసిడర్గా రోహిత్: తొలి నాన్ పుట్బాలర్గా అరుదైన ఘనత
- Travel
అక్బర్ కామాగ్నికి బలి అయిన మాళ్వా సంగీతకారిణి రూపమతి ప్యాలెస్
భారతదేశంలో విద్యాభివృద్ధికి బాటలు వేసిన తొలి బాటసారి : అబుల్ కలాం ఆజాద్
మన దేశంలో విద్య అభివృద్ధికి బాటలు వేసిన తొలి బాటసారి అబుల్ కలాం ఆజాదే. ఆయన భారతదేశ మొదటి విద్యాశాఖ మంత్రిగా పని చేశారు. నవంబర్ 11న ఆయన జన్మదినం సందర్భంగా మన దేశంలో జాతీయ విద్యా దినోత్సవాన్ని జరుపుకుంటారు. 1888 నవంబర్ లో జన్మించిన మౌలానా 1947 ఆగస్టు 15 నుండి అంటే స్వాతంత్య్రం వచ్చిన నాటి నుండి 1958 ఫిబ్రవరి 2 వరకు కేంద్ర విద్యా శాఖ మంత్రిగా సేవలు అందించారు.
ఈయన సేవలను గుర్తించిన భారత ప్రభుత్వం ఈయనకు భారతరత్న అవార్డు సైతం ఇచ్చింది. అంతేకాదు ఈయన పేరిట పలు విద్యాసంస్థలు కూడా నెలకొల్పబడ్డాయి. ఈ సందర్భంగా అబుల్ కలాం ఆజాద్ గురించి కొన్ని ఆసక్తికవరమైన విషయాలను తెలుసుకుందాం.

జాతీయ విద్యా దినోత్సవం..
అబుల్ కలాం మంత్రిగా ఉన్న సమయంలో ఢిల్లీలోని ప్రసిద్ధ జామియా మిలియా ఇస్లామియా విశ్వవిద్యాలయం సహా భారతదేశం అంతటా వివిధ కళాశాలలు మరియు విశ్వవిద్యాలయాలు స్థాపించబడ్డాయి. ఈయన సేవలకు గుర్తుగా 2008లో భారత ప్రభుత్వం ఆయన పుట్టినరోజును జాతీయ విద్యా దినోత్సవంగా నిర్ణయించింది.

అబుల్ కలామ్ అసలు పేరు ఏంటంటే..
స్వాతంత్య్ర సమర యోధుడిగా, భారతదేశ తొలి విద్యా శాఖ మంత్రిగా పనిచేసిన అబుల్ కలాం ఆజాద్ అసలు పేరు ‘మొహియుద్దీన్ అహ్మద్‘, ‘అబుల్ కలామ్‘ అనేది బిరుదు.. ‘ఆజాద్‘ అనేది ఆయన కలం పేరు. ఆయన అరబిక్, ఇంగ్లీష్, ఉర్దూ, హిందీ, పర్షియన్, బెంగాలీ తదితర భాషలలో మంచి ప్రావీణ్యత సంపాదించాడు. స్వయంగా సాహితీవేత్త అయిన ఆయన ‘ఇండియా విన్స్ ఫ్రీడమ్‘ను రాశారు.

విద్యా వ్యవస్థ పటిష్టతకు..
భారతదేశానికి స్వాతంత్య్రం వచ్చిన తర్వాత మన దేశంలో విద్యావ్యవస్థ పటిష్టతకు, విద్యా వ్యవస్థను మెరుగుపరిచేందుకు అంకిత భావంతో పనిచేశారు. చిన్నపిల్లల్లో ప్రాథమిక విద్యను ప్రోత్సహించడానికి పిల్లలను పాఠశాలల్లో చేర్పించడాన్ని ప్రోత్సహించారు. పాఠశాలలు, కళాశాలల నిర్మాాణానికి జాతీయ కార్యక్రమాన్ని ప్రణాళికను రూపొందించారు. 14 సంవత్సరాల వయస్సు వరకు పిల్లలకు ఉచిత మరియు నిర్బంధ విద్యను అందించే ఆలోచనను ఆయనే ముందుకు తెచ్చారు. అలాగే ‘‘ప్రతి ఒక్కరూ ప్రాథమిక విద్యను పొందడం వ్యక్తి జన్మహక్కుగా పరిగణించాలి. లేదంటే పౌరులుగా తమ విధులను పూర్తిగా నిర్వర్తించలేరు‘‘ అని అబుల్ కలామ్ ప్రాథమిక విద్య గురించి వివరించారు. అంతే కాదు, ఆడపిల్లలకు నాణ్యమైన విద్యను అందించడంలో అనేక పథకాలను తీసుకొచ్చారు.

అత్యున్నత విద్యాసంస్థలు..
ఈయన మార్గదర్శకత్వం మరియు నాయకత్వంలో విశ్వవిద్యాలయ గ్రాంట్ కమిషన్ (యుజిసి)ని విద్యా మంత్రిత్వ శాఖ 1953లో స్థాపించింది. అలాగే 1951లో అబుల్ నాయకత్వంలో మొదటి ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ స్థాపించబడింది. అతను ఒక దూరదృష్టిగల వ్యక్తి మరియు భవిష్యత్ సాంకేతిక నిపుణులను రూపొందించడంలో ఐఐటిల సామర్థ్యాన్ని నమ్ముతారు. "ఈ ఇన్స్టిట్యూట్ స్థాపన దేశంలో ఉన్నత సాంకేతిక విద్య మరియు పరిశోధనల పురోగతిలో ఒక మైలురాయిగా మారుతుందనడంలో నాకు ఎటువంటి సందేహం లేదు" అని మౌలానా ఆజాద్ పేర్కొన్నారు.ః

హిందూ-ముస్లింల సామరస్యానికి..
ఈయన కేవలం విద్యకు మాత్రమే ప్రాధాన్యత ఇవ్వలేదు. మన దేశంలో హిందూ మరియు ముస్లిం వర్గాలలో సామరస్యాన్ని పెంపొందించేందుకు వారిలో ఐక్యతను తీసుకొచ్చేందుకు చాలా కృషి చేశారు. అలాగే వివిధ మతాల ప్రజలు ప్రేమ మరియు సామరస్యంతో కలిసి జీవించగల దేశంగా భారతదేశం కలలు గన్నవారిలో అబుల్ కలామ్ ఆజాద్ కూడా ఒకరు.

భారతరత్న అవార్డు..
మౌలానా అబుల్ కలాం ఆజాద్ గౌరవార్థం మౌలానా ఆజాద్ నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ, మౌలానా ఆజాద్ మెడికల్ కాలేజ్, మౌలానా అబుల్ కలాం ఆజాద్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఏషియన్ స్టడీస్ వంటి వివిధ సంస్థలు ఏర్పడ్డాయి. ఈయన విద్యారంగానికి చేసిన సేవలకు గుర్తుగా 1992లో భారత ప్రభుత్వం ఆయనకు భారతదేశ అత్యున్నత పౌర పురస్కారమైన ‘భారత రత్న‘ ఇచ్చి గౌరవించింది. 1958 ఫిబ్రవరి 22న మౌలానా అబుల్ కలామ్ ఆజాది తుదిశ్వాస విడిచారు.

స్వాత్యంత్య్ర సమరయోధుడు ఆజాద్..
బ్రిటీష్ వారికి వ్యతిరేకంగా పోరాడిన స్వాతంత్య్ర సమరయోధులలో మౌలానా అబుల్ కలాం ఆజాద్ ఒకరు. 1920లో ఆయన ఖిలాఫత్ ఉద్యమంలో భాగమయ్యారు. అప్పుడే మన జాతిపిత మహాత్మగాంధీతో కలిసే అవకాశం వచ్చింది. ఆయన సారథ్యంలోని సహకారేతర ఉద్యమంలో సైతం పాల్గొన్నాడు. కొన్నేళ్లు జైలు శిక్ష సైతం అనుభవించారు.
ఈ స్వాతంత్య్ర సమరయోధుడు మరియు మన దేశంలో విద్యను ప్రోత్సహిండానికి ఎంతో సేవ చేసిన అబుల్ కలామ్ ఆజాద్ కు తెలుగు బోల్డ్ స్కై తరపున మా కృతజ్ఞతలు తెలుపుతున్నాము.