For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

Mother's Day 2022:మనందరి తొలి గురువు అయిన తల్లికి మరచిపోలేని బహుమతిలిచ్చేయండి...

|

'అమ్మ త్యాగం తన కంటే కోటి రెట్లు ఎక్కువని.. భూదేవిని అడిగినా చెబుతుంది.. అమ్మ అంటేనే ఓర్పు అని.. ఓర్పు అంటేనే అమ్మ అని.. అందుకే ఈ సృష్టిలో అమ్మే గొప్పది.. అమ్మను మించిన యోధులు ఈ ప్రపంచంలో ఎవ్వరూ లేరు' అని కొందరు కవులు, మేధావులు చెబుతుంటారు.

అయితే అమ్మ గురించి మనం ఎంత మాట్లాడినా తక్కువే అవుతుంది. అంత కమ్మనిది అమ్మ ప్రేమ.కడుపులో నలుసు పడిన నాటి నుండి తొమ్మిది నెలల పాటు ఎంతో సహనంతో.. ఎన్నో అడ్డంకులను ఎదుర్కొని తన రక్త మాంసాలు పంచి పునర్జన్మనెత్తుకుంటుంది.

అయితే అప్పటివరకు పడిన పురిటినొప్పులను కాస్త.. బిడ్డ ఒడిలో పడిన వెంటనే మరచిపోతుంది. అందుకే ప్రతి ఒక్కరి లైఫ్ లో అమ్మ ఎంతో ప్రత్యేకం. అలాంటి అద్భుతమైన అమ్మ ప్రేమను సెలబ్రేట్ చేసుకునే రోజే మదర్స్ డే. ఈ మదర్స్ డే సందర్భంగా అదిరిపోయే కానుకలను అమ్మకు అందించండి.. అయితే ఎప్పుడూ ఇచ్చే గిఫ్టులను కాకుండా.. ఈసారి కాస్త స్పెషల్ గిఫ్టులు ఇచ్చే ప్రయత్నం చేయండి. మీరిచ్చే బహుమతుల్లోనే మీ ప్రేమను పూర్తిగా నింపేసి తనకు ఇస్తే అమ్మ ఎంతో సంతోషిస్తుంది. అవి విలువైనవి కాకపోయినా.. వారిపై మీకెంత ప్రేమ ఉందో తెలిసేలా చేయండి చాలు... ఈ సందర్భంగా అమ్మను ఆశ్చర్యపరిచే బహుమతులు ఎన్నో ఇవ్వొచ్చు. అవేంటో మీరూ చూసెయ్యండి మరి...

Mother's Day 2022: అమ్మను మించిన దైవం లేదు... ఆమె జీవితం అందరికీ ఆదర్శం..

బ్యూటిఫుల్ శారీ..

బ్యూటిఫుల్ శారీ..

చీరలంటే ఎవరికిష్టముండదు చెప్పండి? మహిళలందరికీ చీరలంటే చాలా ఇష్టం. ఈ మదర్స్ డే సందర్భంగా మీ అమ్మకు ఇష్టమైన ఓ మంచి పట్టు లేదా కంచి, ధర్మవరం, మధురై, బనారస్, కలకత్తా జరీ చీరల్లో ఏదో ఒకటి బహుమతిగా ఇవ్వండి. మీకు చీరల గురించి పెద్దగా ఐడియా లేకపోతే.. తననే తీసుకెళ్లి మరీ కొనుగోలు చేయండి. లేదా ఎవరికైనా చెప్పి మంచి చీరను సెలెక్ట్ చేసి.. అమ్మను సర్ ప్రైజ్ చేయండి.. ఆ సమయంలో తను కచ్చితంగా సంతోషిస్తుంది.

జ్యువెలరీ..

జ్యువెలరీ..

మీ తొలి గురువుకు ఆభరణాలంటే ఇష్టమా? అయితే మంచి బంగారాన్ని బహుమతిగా ఇవ్వడంతో పాటు వాటిని పెట్టుకునేందుకు మంచి జ్యువెలరీ బాక్సును కూడా అందించండి.

ఫీలింగ్స్ తెలిపే ఫొటోలు..

ఫీలింగ్స్ తెలిపే ఫొటోలు..

మన భావాలను పదాల్లో వ్యక్తీకరించకపోయినా.. ఒక ఫొటోతో మన ఫీలింగ్స్ తెలిపే చిత్రాలెన్నో ఉంటాయి. అందులో అమ్మతో కలిసి దిగిన ఫొటోలు ఎన్నో ఉంటాయి. అందుకే చాలా మంది అమ్మతో దిగిన ఫొటోలను ఫ్రేమ్ కట్టించి పెట్టడం వంటివి మనం రెగ్యులర్ గా చూస్తుంటాం. కానీ ఇలా ఫ్రేమ్ చేయించినా.. కొన్ని రోజులే అందంగా ఉంటాయి. తర్వాత అవి చెడిపోతాయి. అందుకే దీనికి బదులుగా మీరు ఒక మంచి ఉడెన్ ఫ్రేమ్ పై మీ ఇద్దరి చిత్రాలను గీస్తే ఎంతో అందంగా ఉంటుంది. కాబట్టి ఈ మదర్స్ డే ఇలాంటివి ట్రై చేయండి.

అమ్మకు ఒక్కరోజేనా? కాదు... ప్రతి రోజూ ఆమెదే.. అందుకే అమ్మను మనసారా హత్తుకునే కోట్స్ ను షేర్ చేయండి..

బొన్సాయి గార్డెన్..

బొన్సాయి గార్డెన్..

మీ అమ్మకు మొక్కలన్నా.. పూలన్నా ఇష్టమా.. అయితే తన కోసం ఒక మంచి తోటను ఇంటి వద్దే ఏర్పాటు చేయండి. మీ ఇంటి ఆవరణంలో అంత పెద్ద స్థలం లేదని ఆలోచిస్తున్నారా? మీకు స్థలం తక్కువగా ఉంటే.. దాబాపై లేదా బాల్కనీలో మంచి బొన్సాయి గార్డెన్ ఏర్పాటు చేయండి. ఇలాంటివి కుదరకపోతే మీ కుండీల్లో అమ్మకు ఇష్టమైన పూల మొక్కలను ఉంచి అందించండి. తక్కువ స్థలంలోనే ఎక్కువ మొక్కలను అందంగా పెంచేందుకు తగిన ఏర్పాట్లు చేసేయ్యండి.

మరింత అందంగా..

మరింత అందంగా..

మనలో చాలా మంది తల్లులు మేకప్ అంటే పెద్దగా ఇష్టపడరు. ఎప్పుడూ సహజంగా ఉండాలని కోరుకుంటారు. అయితే లైట్ గా కనిపించే మేకప్ వారి లుక్ ని మరింత అందంగా మారుస్తుంది. అందుకే చాలా మంది మహిళలు ఇటీవలి కాలంలో మేకప్ పట్ల ఎక్కువ శ్రద్ధ చూపుతున్నారు. ఈ నేపథ్యంలో మీరు కూడా నో మేకప్ లుక్ కి సంబంధించిన వస్తువులను కొని.. దాన్ని అందమైన మేకప్ బాక్సు లో ఉంచి తనకు గిఫ్ట్ గా ఇవ్వండి.

ప్రతిరోజూ అమ్మదే..

ప్రతిరోజూ అమ్మదే..

అయితే అమ్మకు కేవలం ఈ ఒక్కరోజు మాత్రమే కాదని గుర్తుంచుకోండి. ప్రతి రోజూ అమ్మదే. అన్ని రోజులూ మీరు అమ్మకు ప్రేమను అందిస్తేనే.. మదర్స్ డేకు మీరు సరైన ప్రియారిటీ ఇచ్చి అమ్మను ప్రేమించినట్లు అవుతుంది. ఈ ఒక్క రోజు మాత్రమే అమ్మకు విషెస్ చెప్పి.. అమ్మతో ఫొటోలు దిగి.. స్టేటస్ పెట్టుకోవడం.. ఎఫ్ బి, ఇన్ స్టాలో పోస్టు చేయడం వంటివి చేస్తే.. మీరు చేసిందంతా వ్యర్థమే అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఈ ప్రపంచంలో అమ్మను మించిన యోధులు ఎవ్వరూ లేరు.

English summary

Mother's Day Gift Ideas in Telugu

Here are the Mother's Day Gift Ideas in Telugu. Have a look
Story first published: Tuesday, May 3, 2022, 14:04 [IST]
Desktop Bottom Promotion