Latest Updates
-
రసం, సాంబార్ రుచిని మరిపించే కేరళ స్టైల్ ఉల్లిపాయ పులుసు.. అన్నంలోకి అదరహో.! -
పుస్తక జ్ఞానం ఒక్కటే కాదు.. గురువుల నుంచి నేర్చుకోవాల్సిన జీవిత పాఠాలు ఇవే.! -
గర్భిణీలకు బలాన్ని ఇచ్చే ఫుడ్.. మధ్యాహ్నం హడావుడి లేకుండా ఈజీగా చేసుకునే టేస్టీ డిష్.! -
పూరీ, చపాతీలోకి అదుర్స్ అనిపించే నీలగిరి వెజ్ కుర్మా..అమృతం తిన్న ఫీలింగ్! -
గుండెను పదిలంగా ఉంచడంతో పాటు పొట్ట ఆరోగ్యాన్ని కాపాడే ఫ్రూట్.. మీ భోజనంలో తప్పనిసరి.! -
తరాలు మారినా ఖ్యాతి మారదు.. పూర్వీకుల బలాన్ని ఇచ్చే ఉలవ చట్నీ.. ఇడ్లీ, దోశలోకి అమృతమే.! -
నీచ భంగ రాజయోగం: కర్కాటకంలోకి కుజ సంచారంతో ఈ రాశుల వారికి దరిద్రం వదిలిపోతుంది.! -
అమ్మ జన్మనిస్తే, గురువు జీవితాన్ని ఇస్తాడు.. టీచర్స్ డే స్పెషల్ వాట్సాప్ స్టేటస్, బెస్ట్ విషెస్ ఇవే! -
ఆ సమయంలోనే దంపతుల మధ్య ఎక్కువగా గొడవలు.. కారణాలేంటంటే.? -
ఈ పొడిని డైలీ అన్నం లేదా టిఫిన్లోకి తిన్నారంటే.. ఇక మందుల జోలికి వెళ్లాల్సిన పనిలేదు.!
Famous HYD Dishes: హైదరాబాద్ అంటే బిర్యానీ మాత్రమే కాదు, లొట్టలేసుకుంటూ తినే ఐటెమ్స్ చాలా ఉన్నాయి
హైదరాబాద్ లో బిర్యానీతో పాటు ఇంకా ఎన్నో రుచికరమైన, అద్భుతమైన, వాటి పేరు వినగానే నోట్లో నీళ్లూరే వంటకాలు చాలానే ఉన్నాయి.
హైదరాబాద్ అంటే ఘుమఘుమ లాడే బిర్యానీ గుర్తుకొస్తుంది చాలా మందికి. ఘాటైన మసాలాలతో చేసే అద్భుతమైన హైదరాబాదీ దమ్ బిర్యానీ అంటే వరల్డ్ ఫేమస్. కానీ హైదరాబాద్ లో బిర్యానీతో పాటు ఇంకా ఎన్నో రుచికరమైన, అద్భుతమైన, వాటి పేరు వినగానే నోట్లో నీళ్లూరే వంటకాలు చాలానే ఉన్నాయి.

ఒక ఇరానీ చాయ్ కావొచ్చు, హలీమ్ కావొచ్చు, మటన్ దాల్చా కావొచ్చు.. ఇలా హైదరాబాద్ లో బిర్యానీతో పాటు చాలా మంది ఇష్టంగా తినే ఫుడ్ ఐటెమ్స్ ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.

ఇరానీ చాయ్
ఇరానీ చాయ్, హైదరాబాదీ దమ్ చాయ్ అని కూడా పిలుస్తారు. హెవీ క్రీమ్ మరియు కండెన్స్‌డ్ మిల్క్ తో తయారు చేస్తారు. ఇరానీ చాయ్ అంటే పడిచచ్చే వాళ్లు ఎంతో మంది ఉంటారు. ఇతర చాయ్‌లతో పోలిస్తే ఇరానీ చాయ్ రుచి అమోఘం. అలాగే కొద్దిగా కడక్ ఉంటుంది. ఇరానీ చాయ్ ప్రత్యేకత అంతా దానిని చేసే విధానంలో ఉంటుంది. ఇరానీ చాయ్ చేయాలంటే ఎక్కువ సమయం పడుతుంది.

ఉస్మానియా బిస్కెట్
ఇరానీ చాయ్ విత్ ఉస్మానియా బిస్కెట్. చాలా మంది హైదరాబాదీలకు, తెలంగాణ వాసులకు నచ్చే క్రేజీ కాంబినేషన్. వేడి వేడి, పొగలు కక్కే ఇరానీ చాయ్ లో ఉస్మానియా బిస్కెట్ ముంచుకుని తింటే మామూలుగా ఉండదు. మంచి రుచికరమైన ఉస్మానియా బిస్కెట్లు కేవలం హైదరాబాద్ లోనే దొరుకుతాయి.

హలీమ్
హైదరాబాద్ లో హలీమ్ అత్యంత ప్రజాదరణ పొందిన వంటకం. రంజాన్ మాసంలో హలీమ్ ఎక్కువగా దొరుకుతుంది. రంజాన్ నెలలో ఏ వీధి చూసిన, ఏ రోడ్డు పైన అయినా హలీమ్ స్టాల్స్ వెలుస్తాయి. మటన్ బాగా ఉడికించి, మసాలాలు, మిర్చి లతో హలీమ్ తయారు చేస్తారు. డిఫ్రైడ్ ఆనియన్, కొద్దిగా నూనె, కొద్దిగా నిమ్మరసం వేసుకుని హలీమ్ తింటే.. మళ్లీ మళ్లీ కావాలంటారు.

మసాలా సోడా
(image:crazymasalafood)
మసాలా సోడా మంచి రిఫ్రెష్ డ్రింక్. ఇది ప్రధానంగా సమ్మర్ లో దొరుకుతుంది. కొన్ని మసాలాలు, సోడా నీరు కలిపి మసాలా సోడా తయారు చేస్తారు. మంచి హైదరాబాదీ దమ్ బిర్యానీ తిన్న తర్వాత ఒక గ్లాస్ మసాలా సోడా తాగితే గమ్మతుంటంది.

డబుల్ కా మీట
డబుల్ కా మీటాను షాహి తుక్రా అని కూడా పిలుస్తుంటారు. ఇది హైదరాబాద్ కు చెందిన డెజర్ట్. బ్రెడ్ ముక్కలు, చక్కెర, పాలు, నెయ్యి, యాలకులతో డబుల్ కా మీటా తయారు చేస్తారు. వివాహ వేడుకల్లో, పార్టీల్లో డబుల్ కా మీటా పెట్టడం చాలా రోజులుగా వస్తున్న సాంప్రదాయం.

పత్తర్ కా ఘోష్
మటన్ తో చేసే ఈ వంటకాన్ని చాలా మంది ఇష్టంగా తింటారు. ఒక్కసారి టేస్ట్ చేశారంటే మళ్లీ మళ్లీ తినాలించేలా ఉంటుంది. మటన్ ను రాళ్లపై కాలుస్తారు. మటన్ పీసులు మంచిగా కాలిన తర్వాత మసాలా వేస్తారు. పత్తర్ కా ఘోష్ పీసులను ఉల్లిపాయలతో పాటు తింటుంటే అద్భుతం.

మటన్ దాల్చా
పప్పు- మటన్ తో దీనిని తయారు చేస్తారు. మటన్, పప్పు, కూరగాయలు, మసాలాలతో తయారు చేసే మటన్ దాల్చా అంటే పడిచచ్చే వాళ్లు చాలా మంది ఉంటారు. అయితే మటన్ దాల్చాను ఒక్కొక్కరు ఒక్కోలా తయారు చేస్తుంటారు.

మలై పాయా
పాయా.. హైదరాబాద్ ఫేమస్ రెసిపీ. రోటీ లేదా తందూరితో పాటు పాయా సర్వ్ చేస్తారు. 'మలై పాయా విత్ డబుల్ రోటీ' హైదరాబాదీలు ఎంతో ఇష్టపడే ఆర్డర్. కొద్దిగా ఘాటుగా ఉంటుంది. అలా ఉంటేనే పాయా అసలు రుచి ఏంటో తెలుస్తుంది.

మొఘలాయ్ చికెన్
మొఘలాయ్ చికెన్ అంటే రాయల్ డిష్. దీనికి దాని రుచి వల్లే ఆ పేరు వచ్చింది. నాన్ వెజ్ ప్రియులను తన ఫ్యాన్స్ ను చేసేసుకుంటుంది ఈ మొఘలాయ్ చికెన్. హైదరాబాద్ లో తప్పక ట్రై చేయాల్సిన వంటకాల్లో ఇది కూడా ఒకటి.

బగారా రైస్
బగారా అన్నం లేదా బగారా రైస్. తెలంగాణలో తయారు చేసే ప్రత్యేక మసాలా రైస్. తెలంగాణలో ఏ పెళ్లి, ఏ శుభకార్యం జరిగినా బగారా రైస్ ఉండాల్సిందే. అసలు సిసలైన బగారా రైస్ తినాలంటే ఏదైనా తెలంగాణ పెళ్లికి వెళ్లాల్సిందే. ఇంట్లో ఎన్ని మసాలాలు కలిపి చేసినా బగారా రైస్ పెళ్లిళ్లలో వచ్చిన టేస్టు రాదంతే. మంచి మసాలా దట్టించి వండిన నాన్ వెజ్ లేదంటే వెజ్ కర్రీ వేసుకుని తింటే.. దాని రుచి అమోఘం.
మిర్చి కా సాలన్, బగారా భైంగన్, ఖుర్బానీ కా మీటా, చికెన్ బోటీ కెబాబ్, సాఫ్రాన్ జాజీ హల్వా, ముంత మసాలా, గార్లిక్ రైతా, దోసకాయ పప్పు, షవర్మా ఇవి కూడా హైదరాబాద్ లో బిర్యానీతో పాటు చాలా మంది ఇష్టంగా తినే వంటకాలు.



Click it and Unblock the Notifications