For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

National Doctor’s Day 2022: డాక్టర్స్ డే ఎందుకు జరుపుకుంటారో తెలుసా...

డాక్టర్స్ డే ను ఎందుకు జరుపుకుంటారు.. దీని వెనుక ఉన్న కథ ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం..

|

డాక్టర్ కరోనా ఫైటర్..
డాక్టర్ తో కోవిద్-19కు ప్రెజర్..
డాక్టర్ అంటే రోగానికి డర్..
డాక్టర్ దగ్గరికి వెళ్తే భయమంతా బే హుజుర్..
ఏ వ్యాధి గురించైనా చెప్పే బ్రౌజర్..
ఒక్క మాటలో చెప్పాలంటే ఈ భూమి మీద నిజమైన హీరో ఒక్క డాక్టర్..

https://telugu.boldsky.com/insync/life/national-doctor-s-day-2020-how-family-and-friends-can-help-maintain-mental-health-of-doctors-023893.html

ఈ భూమి మీద ప్రతి ఒక్క రంగానికి ఓ సమయం.. సందర్భం అనేది కచ్చితంగా ఉంటుంది. ప్రతి ఒక్కరు తమ పని వేళల్లో హాయిగా పని చేసుకుంటారు. కానీ కొందరికి మాత్రం సమయం అనేది ప్రత్యేకంగా ఏమీ ఉండదు. అలాంటి వైద్య రంగం ముందంజలో ఉంటుంది.

https://telugu.boldsky.com/insync/life/national-doctor-s-day-2020-how-family-and-friends-can-help-maintain-mental-health-of-doctors-023893.html

మనకు ఏ చిన్న ఆరోగ్య సమస్య వచ్చినా వెంటనే డాక్టర్ దగ్గరికి వెళ్తాం. అలాంటి సమయంలో డాక్టర్స్ మన రోగాలను వారు కచ్చితంగా నయం చేస్తారు.

https://telugu.boldsky.com/insync/life/national-doctor-s-day-2020-how-family-and-friends-can-help-maintain-mental-health-of-doctors-023893.html

అయితే వైద్యులు మన ప్రాణాల్ని నిలబెట్టడమే కాదు.. అంతకన్నా ఎక్కువ పనే చేస్తారు. ముందుగా రోగి యొక్క మానసిక స్థితిని బట్టి, మన ప్రవర్తనకు తగ్గట్టు వ్యవహరిస్తారు.

https://telugu.boldsky.com/insync/life/national-doctor-s-day-2020-how-family-and-friends-can-help-maintain-mental-health-of-doctors-023893.html

మనకు ఎలాంటి బాధ కలగకుండా మనకు చికిత్స అందించేందుకు శతవిధాలా ప్రయత్నిస్తారు. మనం వ్యాధి నుండి త్వరగా కోలుకునేలా చేస్తారు.

https://telugu.boldsky.com/insync/life/national-doctor-s-day-2020-how-family-and-friends-can-help-maintain-mental-health-of-doctors-023893.html

ఒకవేళ మనం వ్యాధి నుండి బయటపడలేని స్థితిలో ఉంటే, మిగిలిన జీవితాన్ని హాయిగా గడిపేందుకు వారి వంతు ప్రయత్నం చేస్తారు. అలాంటి వైద్యులందరికీ మనం డాక్టర్స్ డే రోజున ధన్యవాదాలు తెలుపుకుందాం...

https://telugu.boldsky.com/insync/life/national-doctor-s-day-2020-how-family-and-friends-can-help-maintain-mental-health-of-doctors-023893.html

అయితే ఈ డాక్టర్స్ డే ఎందుకు జరుపుకుంటారు? దీని వెనుక ఉన్న చరిత్ర ఏమిటి? ఈ వేడుకలను జులై 1వ తేదీన ఎందుకు ఘనం జరుపుకుంటారనే విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం...

జాతీయ వైద్యుల దినోత్సవం : వైద్యులు మానసిక ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి ఫ్యామిలి అందించే టిప్స్జాతీయ వైద్యుల దినోత్సవం : వైద్యులు మానసిక ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి ఫ్యామిలి అందించే టిప్స్

నేషనల్ డాక్టర్స్ డే చరిత్ర..

నేషనల్ డాక్టర్స్ డే చరిత్ర..

పశ్చిమ బెంగాల్ కు చెందిన మాజీ ముఖ్యమంత్రి, డాక్టర్ బిధన్ చంద్ర రాయ్ జ్ణాపకార్థం జులై 1వ తేదీన జాతీయ వైద్యుల దినోత్సవం(National Doctor's Day)గా జరుపుకోవాలని, 1991 సంవత్సరంలో కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఆయన ఒక గొప్ప వైద్యుడు, విద్యావేత్త మరియు స్వాతంత్ర్య ఉద్యమంలో పాల్గొన్న సమరయోధుడు. శాసనోల్లంఘన ఉద్యమంలో కూడా ఆయన కీలక పాత్ర పోషించారు. ఆయనను ప్రతి స్మరించేందుకు గుర్తుగా, జాతీయ వైద్యుల దినోత్సవంగా పాటించాలని ఆ రాష్ట్ర ప్రభుత్వం కేంద్రాన్ని కోరింది. అప్పటి నుండి ప్రతి ఏటా జులై 1వ తేదీన జాతీయ వైద్యుల దినోత్సవంగా పాటిస్తారు.

నేషనల్ డాక్టర్స్ డే థీమ్..

నేషనల్ డాక్టర్స్ డే థీమ్..

ఈ నేషనల్ డాక్టర్స్ డే దినోత్సవాన్ని అంతర్జాతీయ వైద్య సంఘం(IMA) నిర్వహిస్తుంది. ప్రతి సంవత్సరం జాతీయ వైద్యుల దినోత్సవం ఒక థీమ్ ను నిర్ణయించుకుంటుంది. ఈ సంవత్సరానికి ‘COVID-19' మరణాలను తగ్గించండి. కోవిద్-19 కు సంబంధించిన థీమ్ ను నిర్ణయించారు. గత సంవత్సరం ‘వైద్యులు మరియు క్లినికల్ సంస్థలపై హింసను జీరో టాలరెన్స్'గా నిర్ణయించారు.

కరోనాపై అలుపెరగకుండా పోరాటం కొనసాగిస్తున్న వైద్యులకు ఇలా విషెస్ చెబుదాం...కరోనాపై అలుపెరగకుండా పోరాటం కొనసాగిస్తున్న వైద్యులకు ఇలా విషెస్ చెబుదాం...

నేషనల్ డాక్టర్స్ డే ప్రాముఖ్యత..

నేషనల్ డాక్టర్స్ డే ప్రాముఖ్యత..

  • సమాజంలో వైద్యుల సహకారాన్ని గుర్తించడం మరియు వారికి గౌరవం ఇవ్వడం ప్రస్తుతం మన ముందు ఉన్న లక్ష్యం.
  • దీని వల్ల వైద్యులు మరియు ఇతర ఆరోగ్య సంరక్షణ కార్యకర్తలు క్లిష్ట పరిస్థితుల్లో పోరాటానికి ప్రోత్సాహం లభిస్తుంది.
  • వైద్య నిపుణులు తమ బాధ్యతలను అంకితభావంతో నెరవేర్చడానికి ప్రోత్సాహం లభిస్తుంది.
  • ఈ రోజున ప్రజలలో వైద్యులపై మరింత అవగాహన పెంచడానికి అనేక కార్యక్రమాలు నిర్వహిస్తారు.
  • ఈరోజు చాలా చోట్ల ఉచిత వైద్య శిబిరాలు కూడా నిర్వహించబడతాయి.
  • ఈ సంవత్సరం COVID-19 ఉండటం వల్ల, ఈరోజు ప్రతి ఏటా ఉండే కార్యక్రమాలు ఉండకపోవచ్చు.
  • అయితే డాక్టర్స్ డే సందర్భంగా వర్చువల్ సమావేశాలు నిర్వహించబడతాయి. అలాగే వెబ్ నార్లు కూడా జరుగుతాయి.

English summary

National Doctor’s Day 2022: Why we celebrate it, theme and history

In India, 1 July is observed as the National Doctor’s Day, in the memory of Dr. Bidhan Chandra Roy, a great doctor, freedom fighter and educationist. This day highlights the importance and contribution of doctors in our society.
Desktop Bottom Promotion