For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

National Doctors’ Day 2022 :వైద్య రంగానికి జీవితాన్ని అంకితం చేసిన బిదన్ చంద్ర రాయ్ గురించి నమ్మలేని నిజాలు..

|

డాక్టర్ రోగాల గురించి తెలిపే బ్రౌజర్..
డాక్టర్ తో వైరస్ కి ఫికర్..
మనకు అక్కర్లేదు డర్..
ఎందుకంటే తను కరోనా ఫైటర్..
అందుకే డాక్టర్ ఎప్పటికీ బెటర్..
ఒక్క మాటలో చెప్పాలంటే ఈ భూమి మీద డాక్టరే మొదటి వారియర్.. అని చెప్పడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు..

మనం భూమి మీద రావడానికి ముందే డాక్టర్ సహాయం అవసరమవుతుంది. మనం పుట్టి, పెరిగి పెద్దయ్యాక కూడా వైద్యుని సహకరాం కచ్చితంగా ఉంటుంది. అందుకే వైద్యోనారాయణ హరి అని అంటుంటారు పెద్దలు.. మనకు ఏ చిన్న రోగమొచ్చినా దాన్ని చిటికెలో నయం చేసే అత్యాధునిక పద్దతులన్నీ వైద్యులకే తెలుసు.

మనలో ఎవరికైనా ప్రాణాపాయం కలిగినప్పుడు మన ప్రాణాల్ని కాపాడేందుకు శాయశక్తులా కాపాడేందుకు తీవ్రంగా ప్రయత్నిస్తారు. అంతేకాదు మనలోని మానసిక స్థితిని బట్టి, మన ప్రవర్తనకు తగ్గట్టు వ్యవహరిస్తారు. మనకు ఎలాంటి బాధ కలగకుండా మనకు చికిత్స చేసేందుకు ప్రయత్నం చేస్తారు. మనం వ్యాధి నుండి త్వరగా కోలుకునేలా చేస్తారు. ఒకవేళ మనం వ్యాధి నుండి బయటపడలేని స్థితిలో ఉంటే, మిగిలిన జీవితాన్ని హాయిగా గడిపేందుకు వారి వంతు ప్రయత్నం చేస్తారు. ఇంతటి గొప్ప యోధులని గుర్తు చేసుకునేందుకే డాక్టర్స్ డే జరుపుకుంటారు. అయితే ఈ వైద్య దినోత్సవాన్ని డాక్టర్ బిధన్ చంద్ర రాయ్ జయంతి రోజునే ఎందుకు జరుపుకుంటారు? ఇంతకీ ఈయన ఎవరు? తన గురించి కొన్ని ఆసక్తికరమైన విషయాలన ఇప్పుడు తెలుసుకుందాం...

పశ్చిమ బెంగాల్ కు చెందిన మాజీ ముఖ్యమంత్రి, డాక్టర్ బిధన్ చంద్ర రాయ్ ను స్మరించుకునేందుకు జులై 1వ తేదీన జాతీయ వైద్యుల దినోత్సవం(National Doctor's Day)గా జరుపుకోవాలని, 1991 సంవత్సరంలో కేంద్రం నిర్ణయించింది. ఆయన ఒక గొప్ప వైద్యుడు, విద్యావేత్త మరియు స్వాతంత్ర్య ఉద్యమంలో పాల్గొన్న సమరయోధుడు. శాసన ఉల్లంఘన ఉద్యమంలో కూడా ఆయన కీలక పాత్ర పోషించారు.

డాక్టర్ బిదన్ చంద్ర రాయ్, పశ్చిమ బెంగాల్ రాష్ట్రానికి రెండో ముఖ్యమంత్రిగా కూడా పని చేశారు. వైద్య రంగంలో ఎన్ని మార్పులకు శ్రీకారం చుట్టారు. తన జీవితాన్ని వైద్య రంగానికి అంకితమిచ్చారు.

జులై ఒకటో తేదీన ఆయన జన్మించారు.. అయితే అదే రోజున ఆయన మరణించడం విశేషం. అందుకే మన దేశంలో ఆయన జ్ణాపకార్థం జాతీయ వైద్యుల దినోత్సవాన్ని జరుపుకుంటారు. ఆయన వైద్య రంగంలోనే కాదు, రాజకీయాల్లో చాలా కీలక పాత్ర పోషించారు. 1947 సంవత్సరంలో ఉత్తరప్రదేశ్ గవర్నర్ గా కూడా పని చేశారు. 1948 సంవత్సరంలో జనవరి 23వ తేదీన పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టారు.

సామాన్య ప్రజలకు సైతం వైద్యం అందుబాటులో ఉండేందుకు ఆయన ఎంతగానో కృషి చేశారు. కలకత్తాలో అనేక మెడికల్ కళాశాలలను ఏర్పాటు చేశారు. అంతేకాదు తను కలకత్తా కార్పొరేషన్ మేయర్ గా ఉన్న సమయంలో ఉచిత విద్య, ఉచిత వైద్య సేవలు, మంచి రోడ్లు, విద్యుత్ దీపాలు, నీటి సరఫరా సక్రమంగా జరిగేలా చూశారు.
తను ముఖ్యమంత్రి అయ్యాక లా అండ్ ఆర్డర్ పై కూడా పూర్తిగా పట్టు సాధించారు.
1961లో తన ఇంటిని కూడా పేద ప్రజల కోసం విరాళంగా ఇచ్చేశారు.
అదే ఏడాది అంటే 1961 ఫిబ్రవరి 4వ తేదీన భారత ప్రభుత్వం తనకు భారత రత్న అవార్డును ప్రకటించింది.

English summary

National Doctors’ Day 2022 : Interesting Facts about Dr Bidhan Chandra Roy in Telugu

Here we are talking about the National Doctor's Day 2022:Interesting facts about Dr.Bidhan Chandra Roy in Telugu. Read on
Desktop Bottom Promotion