Latest Updates
-
మూత్రంలో మంటతో పాటు విపరీతమైన జ్వరం.. నిర్లక్ష్యం చేస్తే ఈ పార్ట్‌కి ముప్పు తప్పదు.! -
'పోషకాల నిధి' పొట్టు మినప్పప్పు ఆవిరి కుడుములు.. ఒక్కటి తిన్నా రోజంతా ఎనర్జీ.! -
విపరీత రాజయోగం: అక్టోబర్ 31 వరకు ఈ రాశుల వారిపై గురు కటాక్షంతో ఎనలేని కీర్తి, సంపద.! -
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్‌కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.! -
రసం, సాంబార్ రుచిని మరిపించే కేరళ స్టైల్ ఉల్లిపాయ పులుసు.. అన్నంలోకి అదరహో.! -
పుస్తక జ్ఞానం ఒక్కటే కాదు.. గురువుల నుంచి నేర్చుకోవాల్సిన జీవిత పాఠాలు ఇవే.! -
గర్భిణీలకు బలాన్ని ఇచ్చే ఫుడ్.. మధ్యాహ్నం హడావుడి లేకుండా ఈజీగా చేసుకునే టేస్టీ డిష్.! -
పూరీ, చపాతీలోకి అదుర్స్ అనిపించే నీలగిరి వెజ్ కుర్మా..అమృతం తిన్న ఫీలింగ్! -
గుండెను పదిలంగా ఉంచడంతో పాటు పొట్ట ఆరోగ్యాన్ని కాపాడే ఫ్రూట్.. మీ భోజనంలో తప్పనిసరి.!
National Girl Child Day 2021:‘దేన్నైనా పుట్టించే శక్తి వారికే ఉంది’.. అందుకే వారు ఎప్పుడూ ప్రత్యేకమే...
జాతీయ బాలికా దినోత్సవం యొక్క చరిత్ర మరియు ప్రాముఖ్యత గురించి తెలుసుకుందాం.
'దేన్నైనా పుట్టించే శక్తి కేవలం ఆడవాళ్లకే ఉంది' అనే సినిమా డైలాగ్ అందరికీ గుర్తుండే ఉంటుంది. ఈ మాటలు అక్షరాలా నిజం. అందుకే మన దేశంలో ఆడపిల్లల విషయంలో మార్పు నెమ్మదిగా వస్తోంది.

ఒకప్పుడు కేవలం అబ్బాయిలు కావాలనుకున్న తల్లిదండ్రులు.. ఇప్పుడు మాత్రం మాకు మహాలక్ష్మీ లాంటి అమ్మాయి కావాలని కోరుకుంటున్నారు. మరికొందరైతే తమకు అమ్మాయే పుట్టాలని దేవుడిని ప్రార్థిస్తున్నారు. ఎవరి ఇంట్లో అయితే పుడుతుందో వారి ఇంట మహాలక్ష్మీ అడుగుపెట్టినట్టుగా భావిస్తున్నారు.

ఆడపిల్ల పుడితేనే భవిష్యత్తుపై ఆశలు పెంచుకుంటున్నారు. తమ బంగారు తల్లి ఫ్యూచర్ ను ఊహించుకుంటూ బతికేస్తున్నారు పేరెంట్స్. అందుకే ఇళ్లలో ఎంతమంది అబ్బాయిలు ఉన్నా.. ఆడపిల్లలు మాత్రం ఎప్పుడూ ప్రత్యేకం. జాతీయ బాలికా దినోత్సవం సందర్భంగా మనందరి జీవితాల్లో ఆడపిల్లలు (Girl Child) ఎంతటి ఆనందాన్ని పంచుతారో.. వారెందుకు ప్రత్యేకమో.. అసలు జాతీయ బాలిక దినోత్సవాన్ని ఎందుకు జరుపుకుంటారు.. ఈ రోజు యొక్క ప్రాముఖ్యత ఏంటి అనే ఆసక్తికరమైన విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం...

బాలికల రక్షణ కోసం..
బాలికల సంరక్షణ, సంపూర్ణ ఎదుగుదల కోసం కేంద్ర ప్రభుత్వం 2008 నుండి ప్రతి సంవత్సరం జనవరి 24వ తేదీన జాతీయ బాలికా దినోత్సవం నిర్వహిస్తోంది. సమాజంలో బాలికల హక్కులు, ఆరోగ్యం, విద్య, సామాజిక ఎదుగుదల అంశాలపై ఈరోజు అవగాహన కల్పిస్తోంది.

‘బేటీ బచావో.. బేటీ పడావో’
బాలికల సంరక్షణలో భాగంగా నరేంద్ర మోడీ ప్రభుత్వం ‘బేటీ బచావో.. బేటీ పడావో'పథకాన్ని తీసుకొచ్చారు. దీని వల్ల బాలికల చదువు, వారి పెంపకంపై మరిన్ని జాగ్రత్తలు తీసుకునేలా చర్యలు తీసుకున్నారు.

అమ్మాయిల సంఖ్య పెంచేందుకు..
మన దేశంలో దాదాపు ప్రతి వెయ్యి మంది అబ్బాయిలకు కేవలం 940 మంది అమ్మాయిలే ఉన్నారు. అంటే బాలికల సంఖ్య మరింత పెంచాలని, ఆ దిశగా ప్రయత్నాలు జరుగుతున్నాయి. అయితే ఫలితం మాత్రం కొంతవరకే వస్తోంది.

ఆడపిల్లల కోసం పథకాలు..
ఆడపిల్ల పుట్టుక పట్ల తల్లిదండ్రుల ఆలోచనా ధోరణి మారాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అందరినీ కోరుతున్నాయి. అమ్మాయిల రక్షణ కోసం కొన్ని రాష్ట్రాలు ప్రత్యేక పథకాలు కూడా పెట్టాయి. వాటిలో ముఖ్యమైనవి..
ధనలక్ష్మీ పథకం - కేంద్రం
బంగారు తల్లి - ఏపీ
కళ్యాణ లక్ష్మీ - తెలంగాణ
భాగ్యలక్ష్మీ -కర్నాటక
లాడ్లీ లక్ష్మీ యోజన - మధ్యప్రదేశ్
రాజ్య లక్ష్మీ - రాజస్థాన్
లాడ్లీ పథకం - ఢిల్లీ, హర్యానా
కన్యా సురక్ష యోజన -బీహార్
కన్యా వివాహ్ పథకం - బీహర్

ప్రేమించడంలో..
తల్లిదండ్రులను ప్రేమించడంలో ఆడపిల్లలను మించిన వారు ఇంకొకరు ఉండరంటే ఎలాంటి అతిశయోక్తి లేదనే చెప్పాలి. తనకు వివాహం జరిగి అత్తారింటికి వెళ్లిపోయినా సరే.. తల్లిదండ్రుల విషయంలో జాగ్రత్తలు తీసుకోవడం తను ఎప్పటికీ మరచిపోదు. అందుకే పెద్దలు ‘కొడుకు ప్రేమ కోడలు వచ్చే వరకూ.. కూతురి ప్రేమ జీవితాంతం' అని అంటూ ఉంటారు.

ఇంట్లో ఆడపిల్ల ఉంటే..
ఏ ఇంట్లో అయినా ఒక అమ్మాయి ఉంటే చాలు.. తన తోబుట్టువులకు మరో తల్లి ఉన్నట్టే. తను తన సోదరులను చాలా జాగ్రత్తగా చూసుకుంటుంది. జీవితాంతం వారికి అవసరమైన అండను అందిస్తూ అమ్మ కాని అమ్మగా మారుతుంది.
ఇవన్నీ అబ్బాయిలు చేయలేరా.. అంటే కొందరు చేయగలరేమో కానీ.. అమ్మాయిల్లా మాత్రం చేయలేరు. ఎందుకంటే తనెప్పుడూ తల్లిదండ్రుల గురించి ఆలోచిస్తూ.. వారి మంచినే కోరుకుంటుంది కాబట్టి..!



Click it and Unblock the Notifications