For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

National Parent's Day 2021: నేషనల్ పేరేంట్స్ డే ఎప్పుడు.. ఈ దినోత్సవాన్ని ఎందుకు జరుపుకుంటారో తెలుసా...

నేషనల్ పేరేంట్స్ డే ఎప్పుడు.. ఎందుకు జరుపుకుంటారో తెలుసా...

|

ఈ ప్రపంచంలో ప్రతి ఒక్క సంవత్సరం.. ప్రతి నెలలో.. ప్రతి రోజుకు ఏదో ఒక ప్రత్యేకత ఉంటుంది. ప్రపంచమంతా ఒక ఎత్తు అయితే.. మన దేశంలో మరో ఎత్తు.. భారతదేశంలో భిన్న మతాలు, విభిన్న సంప్రదాయలు, ఆచారాల గురించి మనందరికీ తెలిసిందే.

National Parents Day 2021: When Is It and Why Do We Celebrate This Day

ఈ నేపథ్యంలోనే మన దేశంలో ప్రతి సంవత్సరాలు జులై మాసంలో చివరి ఆదివారం రోజున జాతీయ తల్లిదండ్రుల దినోత్సవం జరుపుకుంటారు. సాధారణంగా జూన్ 1వ తేదీన గ్లోబల్ పేరేంట్స్ డే జరుపుకుంటారు. ఈ సందర్భంగా 2021 సంవత్సరంలో నేషనల్ పేరేంట్స్ డే ఎప్పుడొచ్చింది.. ఈ దినోత్సవాన్ని ఎందుకు జరుపుకుంటారనే ఆసక్తికరమైన విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం...

'నా భర్త గురించి నాతో నెగిటివ్ గా చెబుతోంది... నమ్మాలా వద్దా'?'నా భర్త గురించి నాతో నెగిటివ్ గా చెబుతోంది... నమ్మాలా వద్దా'?

తొలిసారిగా..

తొలిసారిగా..

మనందరికీ మదర్స్ డే, ఫాదర్స్ డే గురించి బాగా తెలుసు. గ్లోబల్ పేరేంట్స్ గురించి చాలా మందికి తెలుసు. అయితే జాతీయ తల్లిదండ్రుల దినోత్సవం గురించి అతి తక్కువ మందికే మాత్రమే తెలుసు. నేషనల్ పేరేంట్స్ డేను 1973 సంవత్సరంలో మే మాసంలోని 8వ తేదీన దక్షిణ కొరియాలో జరుపుకున్నారు.

1994లో..

1994లో..

మదర్స్ డే.. ఫాదర్స్ డేకి బదులుగా ఈ పేరేంట్స్ ని భిన్నంగా ప్రారంభించారు. 1994 సంవత్సరంలో తల్లిదండ్రుల దినోత్సవాన్ని ఆ దేశంలో అధికారికంగా ప్రకటించారు. ఆ తర్వాత ఈ సంప్రదాయం అమెరికాకు పాకింది. అప్పటి నుండి అమెరికాలో కూడా తొలిసారిగా జులై నాలుగో ఆదివారం తల్లిదండ్రుల దినోత్సవాన్ని జరుపుకున్నారు.

ఎందుకు జరుపుకుంటారంటే..

ఎందుకు జరుపుకుంటారంటే..

జాతీయ తల్లిదండ్రుల దినోత్సవాన్ని ఎందుకు జరుపుకుంటారంటే.. ఈ రోజున తల్లిదండ్రుల పట్ల గౌరవం చూపించడం.. వారికి ఎప్పుడూ రుణపడి ఉంటామని తెలిపేందుకు.. ఈరోజున పిల్లలు బహుమతులు ఇవ్వడం ద్వారా తల్లిదండ్రులను సంతోషపరుస్తారు. ఈరోజున ప్రతి ఒక్కరూ తమ తల్లిదండ్రులను తమదైన శైలిలో హ్యాపీగా ఉంచేందుకు ఈ దినోత్సవాన్ని జరుపుకుంటారు.

జులై నాలుగో వారం..

జులై నాలుగో వారం..

అమెరికా మరియు భారతదేశంలో తల్లిదండ్రుల దినోత్సవాన్ని ప్రతి సంవత్సరం జులై నాలుగో ఆదివారం రోజున జరుపుకుంటారు. 2021 సంవత్సరంలో జులై 25వ తేదీన ఈ దినోత్సవం వచ్చింది. ఫిలిప్పిన్స్ లో డిసెంబర్ మొదటి సోమవారం నేషనల్ పేరేంట్స్ డేని జరుపుకుంటారు. చాలా దేశాలలో ఈ దినోత్సవాన్ని జూన్ మాసంలోనే జరుపుకుంటారు.

పేరేంట్స్ ప్రాముఖ్యత..

పేరేంట్స్ ప్రాముఖ్యత..

భారతీయ సంప్రదాయంతో పాటు తల్లిదండ్రులకు ప్రపంచవ్యాప్తంగా దేవుడి హోదా ఇవ్వబడింది. తల్లిని మమతల తల్లి అని, సాగరమని పిలుస్తారు. తండ్రిని ఆనందాల పొదరిల్లుగా పరిగణిస్తారు. పిల్లల కోసం తల్లిదండ్రులు ఎంతో క్రుషి చేస్తారు. అందుకే తల్లిదండ్రులను దేవుని యొక్క ప్రతిరూపం అని పిలుస్తారు. నేషనల్ పేరేంట్స్ డే సందర్భంగా ప్రపంచవ్యాప్తంగా వివిధ కార్యక్రమాలు నిర్వహించబడతాయి. ప్రస్తుతం కరోనా మహమ్మారి కారణంగా బహిరంగ కార్యక్రమాలు పరిమిత సంఖ్యలో జరుగుతున్నాయి. ఈ వేడుకల్లో వేలాది మంది పాల్గొనడం లేదు.

English summary

National Parent's Day 2021: When Is It and Why Do We Celebrate This Day

Here we are talking about the national parent's day 2021: When is it and why do we celebrate this day. Read on
Story first published:Friday, July 23, 2021, 15:47 [IST]
Desktop Bottom Promotion