For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

Navy Day 2021 :ఇండియన్ నేవీ దినోత్సవాన్ని ఈరోజే ఎందుకు జరుపుకుంటారో తెలుసా...

|

మన దేశంలో త్రివిధ దళాలకు ఎంతో ప్రాధాన్యత ఉంది. వీటిలో నావిక దళానికి ఉండే ప్రత్యేకతే వేరు. సరిగ్గా ఐదు దశాబ్దాల క్రితం అంటే 1971 సంవత్సరంలో పాకిస్థాన్ తో జరిగిన యుద్ధంలో ఆపరేషన్ ట్రైడెంట్ లో భాగంగా PNS ఖైబర్ సహా నాలుగు పాక్ నౌకలపై భారత నేవీ దాడులు చేసింది.

ఈ ఆపరేషన్లో పాకిస్థాన్ దుండుగలను మనోళ్లు చిత్తు చిత్తు చేశారు. అంతేకాదు బంగాళాఖాతంలోని ప్రాదేశిక జలాలన్నీ ఇండియన్ నేవీ తన స్వాధీనంలోకి తెచ్చుకుంది. మరోవైపు వైమానిక సైతం పాకిస్థాన్ వైమానిక స్థావరాలపై దాడి చేసి ముప్పుతిప్పలు పెట్టింది.

ఈ విజయాలకు గుర్తుగా డిసెంబర్ నాలుగో తేదీన దేశవ్యాప్తంగా నావికా దళ దినోత్సవం జరుపుకుంటున్నారు. అప్పటినుండి ప్రతి సంవత్సరం నేవీ డే సందర్భంగా నావికా దళ కమాండర్లు ప్రత్యేక కవాతులు నిర్వహిస్తారు. ఈ నేపథ్యంలోనే తీర ప్రాంత భద్రతలో నేవీ పాత్ర అత్యంత కీలకంగా మారింది. ఈ సందర్భంగా భారత నావికా దళం గురించి కొన్ని ఆసక్తికరమైన విషయాలను తెలుసుకుందాం...

సక్సెస్ ఫుల్ ఆపరేషన్..

సక్సెస్ ఫుల్ ఆపరేషన్..

1971వ సంవత్సరంలో ఇండియన్ నేవీ అత్యంత విజయవంతమైన ‘ఆపరేషన్ ట్రైడెంట్' నిర్వహించింది. ఈ ఆపరేషన్లో మన భారత నావికా దళానికి ఎలాంటి నష్టం కలగలేదు. ఆ సమయంలో కరాచీలో మైన్ స్వీపర్, డిస్ట్రాయర్, మందుగుండు సామాగ్రిని తీసుకెళ్తున్న కార్గో నౌక, ఫ్యూయెల్ స్టోరేజ్ ట్యాంకులపై ఇండియన్ నావికా దళం పక్కా ప్రణాళికను రచించి దాడులు చేసి, వారికి భారీ నష్టాన్ని మిగిల్చారు.

అంచనాలకు మించి..

అంచనాలకు మించి..

మన నావికా దళం ముందుగా గుజరాత్ లోని ఓకా పోర్ట్ ద్వారా పాకిస్థాన్ జలాల్లోకి ప్రవేశించారు. మైన్ స్వీపర్ PNS ముహఫీజ్ పై దాడి చేసి, కరాచీలోని పాకిస్థాన్ నేవీ హెడ్ క్వార్టర్స్ కు సిగ్నల్ పంపకుండా షిప్ ను నాశనం చేశారు. అదే సమయంలో ఆ ఆపరేషన్లో భారత నావికా దళం తొలిసారిగా యాంటీ షిప్ మిస్సైల్ ను వాడింది. INS నిపాత్, INS నిర్ఘాత్, INS వీర్ యుద్ధ నౌకలు ఆపరేషన్లో పాల్గొని, అనుకున్న లక్ష్యాన్ని విజయవంతంగా పూర్తి చేశారు.

చిత్తు చిత్తయిన పాక్..

చిత్తు చిత్తయిన పాక్..

భారత వైమానిక దళం దాదాపు నాలుగు వేల యుద్ధ వాహనాలతో పాకిస్థాన్ ఎయిర్ ఫోర్స్ ను చిత్తు చిత్తు చేసింది. భారత సైన్యం ముందు పాక్ ఎత్తులు నిలవలేక 15 రోజుల్లోనే డిసెంబర్ 16వ తేదీన పూర్తిగా భారత దళాలకు లొంగిపోయింది. ఈ యుద్ధంలో పాకిస్థాన్ జలాంతర్గామి ఘాజీని విశాఖ తూర్పు నౌకాదళం సమీపంలో భారత దళాలు ముంచేశాయి. ఉపఖండానికి చెందిన సముద్ర జలాల్లో మొదటి జలాంతర్గమి వినాశనం ఇదే తొలిసారి. అదే సమయంలో అరేబియా మహా సముద్రంలో భారత్ ఫ్రిగేడ్ INS ఖుక్రీను ముంచినప్పుడు 18 మంది అధికారులు, 176 మంది సైనికులు సైతం అమరులయ్యారు. ఈ యుద్ధంలో భారత నౌకాదళానికి జరిగిన అతి పెద్ద నష్టం ఇదే.

నౌకాదళ సేవలు..

నౌకాదళ సేవలు..

తీర ప్రాంతాల సరిహద్దులను రక్షించడం, అంతర్జాతీయ సంబంధాలను విస్తరింపజేయడం, సంయుక్త సైనిక విన్యాసాల నిర్వహణ, ప్రక్రుతి వైపరీత్యాలు, ఇతర ప్రమాదకర పరిస్థితులను మన నౌకాదళ సేవలు ముఖ్యపాత్ర పోషిస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే నేవీ డే విజయానికి గుర్తుగా నేవీ బ్యాండ్ గ్రూప్ కల్చరల్ ప్రోగ్రామ్స్ నిర్వహిస్తారు. నేవీ డే సందర్భంగా విశాఖపట్నంలోని ఆర్కే బీచ్ లో ప్రతి ఏటా ప్రత్యేక విన్యాసాలు నిర్వహిస్తుంటారు. విశాఖతో పాటు ముంబైలోని గేట్ వే ఆఫ్ ఇండియా వద్ద బీటింగ్ రిట్రీట్ వేడుకలను నిర్వహిస్తారు.

ఇండియన్ నేవీ ఎప్పుడు జరుపుకుంటారు?

భారత నావికా దళ దినోత్సవం ప్రతి సంవత్సరం డిసెంబర్ నాలుగో తేదీన జరుపుకుంటారు.

English summary

Navy Day 2021 : Interesting facts about Indian Navy in Telugu

Here we are talking about the navy day 2021:Interesting facts about indian navy in Telugu. Have a look
Story first published: Saturday, December 4, 2021, 8:00 [IST]