Latest Updates
-
అమ్మాయిలూ అలర్ట్.. నెలసరిలో తీవ్రంగా కడుపు నొప్పి, అలసట.. ఈ ఐదు తప్పులే కారణం.! -
సజ్జ రొట్టె చేయడం ఇంత ఈజీనా.. ఈ 3 టిప్స్‌తో చపాతీ కంటే సాఫ్ట్‌గా చేసేయొచ్చు.! -
చికెన్ లెగ్ పీస్‌లతో స్పైసీ కుష్కా.. ఇలా చేశారంటే లొట్టలేసుకుంటూ తినాల్సిందే.! -
ఆఫీస్ బ్యాగ్‌తో ఈ పొరపాట్లు.. మీ జేబును ఖాళీ చేస్తాయంటే నమ్ముతారా.? -
బిర్యానీ రుచిని తలదన్నే కొబ్బరి పాల మటన్ పులావ్.. సండే స్పెషల్ అదిరిపోవాల్సిందే.! -
మూత్రంలో మంటతో పాటు విపరీతమైన జ్వరం.. నిర్లక్ష్యం చేస్తే ఈ పార్ట్‌కి ముప్పు తప్పదు.! -
'పోషకాల నిధి' పొట్టు మినప్పప్పు ఆవిరి కుడుములు.. ఒక్కటి తిన్నా రోజంతా ఎనర్జీ.! -
విపరీత రాజయోగం: అక్టోబర్ 31 వరకు ఈ రాశుల వారిపై గురు కటాక్షంతో ఎనలేని కీర్తి, సంపద.! -
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్‌కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.!
ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన వంట.. తింటే ఎన్ని లాభాలో తెలుసా?
ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన వంటగా అల్మాస్ కేవియర్ అనే వంటకం నిలిచింది. ఈ వంటకం ధర సుమారు రూ.28 లక్షలకు పైమాటే. బంగారం కంటే 50 రెట్లు ఎక్కువ ధర ఉండే ఈ వంటకంలో ప్రత్యేకత ఏమిటి? దీనిని దేనితో తయారు చేస్తారు? ఈ ఆహారాన్ని తినడం వల్ల కలిగే ప్రయోజనాల గురించి సవివరంగా తెలుసుకుందాం.
అల్మాస్ కేవియర్ అంటే ఏమిటి?
కేవియర్ అంటే చేప గుడ్లు అందులో ప్రత్యేకత ఏముంది అని అనుకుంటున్నారా? అయితే ఇవి సాదా సీదా చేపల నుంచి వచ్చే గుడ్లు కాదు. స్టర్జన్ చేపల అండాశయాలలో కనిపించే గుడ్లు. నిజం చెప్పాలంటే అన్ని చేపల్లో కనిపించే గుడ్లను కేవియర్ అనరు.. కేవలం స్టర్జన్ చేప గుడ్లను మాత్రమే కేవియర్ అంటారు. ఈ కేవియర్ లో నాలుగు రకాలు ఉంటాయి. వాటిని అల్మాస్ కేవియర్, బెలూగా కేవియర్, ఎసియేటర్ కేవియర్, సెవ్రుగ కేవియర్ అని పిలుస్తారు. ప్రతి ఒక్కటికీ భిన్నమైన రుచి, భిన్నమైన రంగు ఉంటుంది. వీటిలో అల్మాస్ కేవియర్ ధర అత్యధికంగా రూ.28.74లక్షలు ఉంటుంది.

ఎందుకంత ధర?:
అల్మాస్ కేవియర్ ఇరానియన్ బెలూగా స్టర్జన్ నుంచి లభిస్తుంది. ఈ చేప అత్యంత పురాతనమైనది, అరుదైనది కూడా. ఇరాన్ సమీపంలోని కాస్పియన్ సముద్రంలో దీనిని కనుగొన్నారు. ఈ అల్మాస్ కేవియర్ ఉప్పగా, వగరుగా, ముత్యపు తెలుపు రంగులో ఉంటుంది. ఇందులో విటమిన్ సీ, ఈ, ఏలు పుష్కలంగా ఉంటాయి. ఇవి రోగ నిరోధక శక్తిని పెంచుతాయి. అలాగే అనేక రకాల రోగాలను మాయం చేసే శక్తి ఈ అల్మాస్ కేవియర్ లో ఉంటుంది.
అల్మాస్ కేవియర్ లాభాలు:
అల్మాస్ కేవియర్ లో పలు రకాల విటమిన్స్ తో పాటు. ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్స్ పుష్కలంగా ఉంటుంది. ఇది జ్ఞాపకశక్తిని పెంపొందిస్తాయి. ఇది యాంటీ ఏజింగ్ లక్షణాలను కలిగి ఉండడంతో చర్మాన్ని చాలాకాలం పాటు యవ్వనంగా, ఆరోగ్యంగా ఉంచుతుంది. అలాగే మహిళలకు గర్భ ధారణ సమయంలో చాలా ఉపయోగకరంగా ఉంటాయి.



Click it and Unblock the Notifications