Latest Updates
-
ఇడ్లీ, దోసెల్లోకి ఈసారి వంకాయ చట్నీ రుచి చూడండి..లెక్కపెట్టకుండా తినేస్తారు -
హైదరాబాద్ స్పెషల్ ఇరానీ ఛాయ్.. ఇంట్లోనే ఈజీగా ఇలా చేసుకోండి! -
చపాతీ, పూరీ, పులావ్ లలోకి అదిరిపోయే మీల్ మేకర్ మసాలా గ్రేవీ.. నాన్ వెజ్ కూడా దీని ముందు దిగదుడుపే! -
ఒకే రకమైన మందులు.. వేర్వేరు ఫలితాలు..లివర్ డ్యామేజ్ వెనుక ఉన్న రహస్యం ఇదే! -
హ్యాపీ హోలీ 2026..మీ బంధుమిత్రులకు పంపడానికి బెస్ట్ హోలీ విషెస్, వాట్సాప్ స్టేటస్ లు ఇవే! -
ఈ హోలీకి అదిరిపోయే స్నాక్..అతిథులను మెప్పించే కరకరలాడే హెల్దీ రైస్ కుర్కురే..ఎలా చేసుకోవాలంటే.. -
హోలీ స్పెషల్..తాగేకొద్దీ తాగాలనిపించే చల్లని థాండాయ్..ఎలా చేసుకోవాలంటే.. -
వేసవి తాపాన్ని క్షణాల్లో తగ్గించే అద్భుతమైన సోంపు షర్బత్..ఇంట్లోనే ఇలా ఈజీగా చేసుకోండి! -
Holi 2026: ఇంట్లోనే సహజసిద్ధమైన హోలీ రంగులు..తయారు చేసుకోండిలా! -
Lunar Eclipse 2026: ఈ ఏడాది తొలి చంద్ర గ్రహణం..మీ రాశిపై ఎలాంటి ఫ్రభావం ఉంటుందో చూడండి!
November Born People: నవంబరులో పుట్టిన వారి వ్యక్తిత్వం, లక్షణాలు ఎలా ఉంటాయో తెలుసా...!
నవంబరు నెలలో పుట్టిన వారి లక్షణాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.personality-traits-of-people-born-in-november-
ఈ లోకంలో ఉన్న ప్రతి వస్తువు.. పుట్టిన ప్రతి జీవి కొంత భిన్నంగా ఉంటుంది. ఇక మనుషుల విషయానికొస్తే వారి తెలివితేటలు, వారి లక్షణాలు, వారి ప్రవర్తన మిగతా జీవులన్నింటికీ సమానం కాదు.

ఎందుకంటే ఈ భూమి మీద పుట్టిన ఏ ఒక్క మనిషికి తమ గుణం, వైఖరి, ప్రవర్తన, లక్షణాలు అనేవి సమానంగా ఉండవు. ఇదిలా ఉండగా జ్యోతిష్యశాస్త్రం ప్రకారం నక్షత్రాలు మరియు రాశులను బట్టి వ్యక్తుల ప్రవర్తన మరియు వారి లక్షణలను తెలుసుకోవచ్చు.

ఈ నేపథ్యంలో నవంబరు నెలలో జన్మించిన వ్యక్తులు ఎలాంటి లక్షణాలు కలిగి ఉంటారు.. వీరి అందరిలా కాకుండా విభిన్నమైన లక్షణాలేమైనా కలిగి ఉంటారా? వీరి ప్రవర్తన ఏమైనా ప్రత్యేకంగా ఉంటుందా అనే వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం...

ఒంటరిగా గడిపేందుకు..
నవంబరు మాసంలో పుట్టిన వ్యక్తులు ఎక్కువగా ఒంటరిగా గడిపేందుకు ఇష్టపడతారు. వీరి వ్యక్తిగత ఆలోచనలను ఎవ్వరితోనూ పంచుకోవడానికి ఇష్టపడరు. వీరు ఎవ్వరినీ అంత త్వరగా విశ్వసించరు. వీరు తమ సొంత కాళ్లపై నిలబడేందుకు ప్రయత్నిస్తారు. వీరు చాలా నిజాయితీగా ఉంటారు.

వీరిని అర్థం చేసుకోవడం కష్టం..
వీరు ఎక్కువగా ఒంటరిగా ఉండేందుకు ఇష్టపడతారు కాబట్టి.. వీరిని అర్థం చేసుకోవడం అంత సులభం కాదు. వీరు చాలా మృదువైన మరియు హృదయంలో సున్నితమైన మనసు కలవారు. వీరు ఉద్దేశపూర్వకంగా ఎవరినీ బాధించరు. కానీ వీరి జోలికి ఎవరైనా వస్తే మాత్రం విడిచిపెట్టరు.

అందరి కంటే భిన్నంగా..
ఈ నెలలో పుట్టిన వ్యక్తులు చాలా డైనమిక్ గా ఉంటారు. అంతేకాదు.. వీరు అందరికంటే చాలా భిన్నంగా ఉంటారు. ఎప్పటికప్పుడు కొత్తదనాన్ని కోరుకుంటారు. వీరికి అందరి కంటే భిన్నమైన ఆలోచనలు ఉంటాయి. వీరు నలుగురిలో ప్రత్యేకంగా కనిపించేందుకు భిన్నమైన పనులను చేస్తారు.

స్నేహితుల విషయంలో..
నవంబరులో జన్మించిన వారు విశ్వాసం మరియు విధేయతకు మారు పేరని చెప్పొచ్చు. వీరు ఒకరికొకరు విధేయత చూపిస్తే, వారు జీవితాంతం రక్షింపబడతారు. నవంబరులో జన్మించిన వ్యక్తులు వారి స్నేహితులను ఎప్పటికీ మోసం చేయరు. వీరు తమ స్నేహితులను రక్షించడానికి ఏమైనా చేస్తారు.

అన్యాయాన్ని సహించరు..
తమకు లేదా తమ స్నేహితులకు ఎలాంటి అన్యాయం జరిగిన వీరు అస్సలు సహించరు. అన్యాయానికి వ్యతిరేకంగా పోరాడతారు. ఏదైనా తప్పు జరిగితే తమ గళాన్ని వినిపిస్తారు. తమ అపార్థం ఉన్నప్పటికీ, తమ వ్యతిరేకతను వ్యక్తం చేయడానికి ఏ మాత్రం వెనుకాడరు.

ఆకర్షణీయంగా ఉంటారు..
నవంబరు నెలలో జన్మించిన వారు శారీరకంగా మంచి ఆకర్షణీయంగా ఉంటారు. అంతేకాదు వీరి వ్యక్తిత్వ లక్షణాలతోనూ ఇతరులను ఆకట్టుకుంటారు. దీని వల్ల ఈ నెలలో పుట్టిన వారి పట్ల చాలా మంది ఆకర్షితులవుతుంటారు. ఇంకా కొంతమందైతే అసూయ పడుతూ ఉంటారు. వీరికి లభించే ప్రజాదరణ మరియు లక్షణాలను చూసి ఇతరులు తట్టుకోలేరు.

ఎక్కువ శ్రమ చేస్తారు..
వీరు చేసే ఏ పని అయినా చాలా శ్రద్ధగా చేస్తారు. ఉద్యోగం చేసే వారు మంచి పరిజ్ఞానం కలిగి ఉంటారు. అందుకే వీరు మంచి ఫలితాలను పొందుతారు. వీరు వందకు వంద శాతం ఏ పని అయినా పూర్తి చేసేందుకు ప్రయత్నిస్తారు. ఏ మాత్రం సాకులు చెప్పరు. ఎంత కష్టమైనా సరే తమ పనిని సమయానికి పూర్తి చేసేందుకు ప్రయత్నిస్తారు.

కొత్తగా ప్రయత్నిస్తారు..
నవంబరు నెలలో పుట్టిన వారు తమదైన శైలిలో పనులు చేస్తుంటారు. ముఖ్యంగా ఎక్కువగా కొత్త విషయాలను కనిపెడుతూ ఉంటారు. వీరు పనిచేసే విధానం ఇతరులకు ఎంతో స్ఫూర్తినిస్తుంది. వీరు తమ పనిలో మునిగిపోయినా, అదే మౌనంతో ఇతరులకు స్ఫూర్తినిస్తారు.

బలహీనతల విషయంలో..
నవంబర్‌లో జన్మించిన వారికి కొన్ని బలహీనతలు కూడా ఉన్నాయి. ఏదైనా విషయంలో ఫలితం తమకు అనుకూలంగా రాకపోతే, అలాంటి సమయంలో వారి మనసు దెబ్బతింటుంది. అప్పుడు మానసికంగా వీరు చాలా బాధపడతారు. వీరు చాలా ఎమోషనల్ అయిపోతారు.

గొడవల విషయంలో..
మీరు పైన చదివినట్లుగా, నవంబర్‌లో జన్మించిన వారు తగాదాలకు,దూరంగా ఉంటారు. కానీ వారు మనస్తాపం చెందితే, వారు నిజంగా గొడవ పడతారు. వీరికి కోపం వస్తే.. వీరిని ఆపడం చాలా కష్టం.
నవంబరులో పుట్టిన వారి లక్షణాలు ఎలా ఉంటాయో చూశారు కదా.. మీ కుటుంబ సభ్యులు, స్నేహితులు, బంధువులు ఎవరైనా నవంబరులో జన్మించినట్లు తెలిస్తే.. ఈ విషయాలను వారితో షేర్ చేసుకోండి... వారికి ప్రత్యేక అనుభూతిని కలిగించండి.



Click it and Unblock the Notifications











