For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

PV Sindhu :మరోసారి సత్తా చాటిన సింధు.. తన సక్సెస్ వెనుక ఎన్ని త్యాగాలున్నాయో తెలుసా...

|

పివి సింధు.. టోక్యో ఒలింపిక్స్ లో తొలి గేమ్ నుండే టాప్ గేర్లో దూసుకెళ్లింది..
పసిడి కోసం తీవ్ర ప్రయత్నం చేసింది..
కానీ కాంస్యం గెలిచి భారతావని మనసు గెలుచుకుంది.
ఇది వరకే రియో ఒలింపిక్స్ లో ఓ మెడల్ గెలుచుకుని ఓ వెలుగు వెలిగింది.
అందరి అంచనాలను నిజం చేస్తూ తాను అనుకున్నది.. తన కోచ్ కలను సాకారం చేసింది..


PC :Twitter
బ్యాడ్మింటన్ ఛాంపియన్ షిప్ లో వరుసగా రెండుసార్లు పాల్గొనింది.. పాల్గొనడమే కాదు.. రెండు పతకాలు సాధించింది.. ఇదివరకే ఐదుసార్లు ప్రయత్నించింది.. అయితే మొక్కవోని ధైర్యంతో..పట్టు వదలని విక్రమార్కుడిలో బ్యాడ్మింటన్ కోర్టులో పోరాడింది.
PC :Twitter
చివరికి తన లక్ష్యాన్ని పూర్తి చేసింది. సింధు సాధారణంగా తన అటాకింగ్ గేమ్ తో ప్రత్యర్థులను ముప్పుతిప్పలు పెట్టేస్తుంది. కానీ కొన్ని సిందర్భాల్లో డిఫెన్స్ లో తేలిపోతూ ఉండేది..
pc :Twitter
అయితే ఈ ఒలింపిక్స్ లో మాత్రం డిఫెన్స్ లో అద్భుతంగా రాణించి అందరినీ ఆశ్చర్యపరిచింది. ఈ సందర్భంగా సింధు సక్సెస్ వెనుక కొన్ని ఆసక్తికరమైన విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం...
\

తొలి భారత మహిళగా..

తొలి భారత మహిళగా..

మన తెలుగమ్మాయి పివి సింధు మరోసారి ప్రపంచ స్థాయి వేదికపై సత్తా చాటింది. టోక్యో ఒలింపిక్స్ లో అందరి అంచనాలను నిజం చేస్తూ మరో మెడల్ తన ఖాతాలో వేసుకుంది. అంతేకాదు వరుసగా రెండు ఒలింపిక్స్ లో పాల్గొనడమే కాదు.. రెండింట్లోనూ పతకాలు గెలిచి మన దేశానికి గర్వకారణంగా నిలిచింది. ఇలా వరుసగా రెండుసార్లు పతకాలు గెలుచుకున్న తొలి భారతీయ మహిళగా సింధు కొత్త రికార్డు నెలకొల్పింది. అంతేకాదు మన దేశానికి గర్వకారణంగా నిలిచింది. తన విజయాన్ని అభినందిస్తూ రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్, ఏపీ సీఎం జగన్, మాజీ సీఎం చంద్రబాబు, మెగాస్టార్ చిరంజీవితో సహా ప్రముఖులు ప్రశంసల జల్లు కురిపిస్తున్నారు.

విశ్వ విజేతగా..

విశ్వ విజేతగా..

స్వర్ణం సాధించిన తొలి భారత మహిళగా రికార్డు.. విశ్వవిజేతగా నిలవడమే కాకుండా భారతదేశం తరపున రికార్డు సాధించిన తొలి మహిళగా పివి సింధు చరిత్ర సృష్టించింది. తన కోచ్ పుల్లెల గోపిచంద్ కూడా అందుకోలేని అరుదైన అవకాశాన్ని ఆమె అందిపుచ్చుకుంది. వరల్డ్ బ్యాడ్మింటన్ ఛాంపియన్ షిప్ లో తొలిసారి స్వర్ణం సాధించి మన త్రివర్ణ పతాకాన్ని రెపరెపలాడేలా చేసింది.

14 ఏళ్ల కఠోర శ్రమ..

14 ఏళ్ల కఠోర శ్రమ..

సింధు విజయం అనంతరం పేరేంట్స్ మాట్లాడారు. "ఆమె 14 ఏళ్ల కఠోర శ్రమ ఫలించింది. ఎట్టకేలకు పసిడి పతకాన్ని సాధించింది. ఏ ఆటలో అయినా గెలుపు, ఓటములు సహజమే. కానీ ఎన్నో గాయాలు ఆమెను బాగా బాధపెట్టేవి. ఒక్కోసారి చిన్నచిన్న దెబ్బలే అనుకున్నా కనీసం ఏడాది పాటు విరామం తీసుకోవాల్సి వచ్చేంది. ఒలింపిక్స్ కు కొద్దిరోజుల ముందు ఆమె కాలుకు ఫ్రాక్చర్ అయ్యింది. దీంతో సుమారు ఎనిమిది నెలలు చక్రాల కుర్చీకే పరిమితమైంది. అయినా మొక్కవోని దీక్షతో సాధన చేసింది. అప్పుడు తల్లిగా నా మనసు చాలా తల్లడిల్లింది. ఎంత కష్టపడితే ఫలితం అంత తీయంగా ఉంటుందనడానికి ఆమె రియోలో సాధించిన రజత పతకమే ఉదాహరణ.

కఠినమైన శిక్షణ

కఠినమైన శిక్షణ

పివి సింధూ పేరేంట్స్ కూడా జాతీయ స్థాయి వాలీబాల్ క్రీడాకారులు. సింధూకి ఆటల పట్ల ఉన్న ఆసక్తిని చిన్నప్పటి నుండే వారు గమనించారు. అందుకే ఆమెకు ఇష్టమైన బ్యాడ్మింటన్లో తనకు పూర్తి ప్రోత్సాహం ఇచ్చారు. కోచ్ పుల్లెల గోపిచంద్ తో కఠినమైన శిక్షణ ఇచ్చారు. మరో విశేషమేమిటంటే.. సింధు తండ్రి రమణకు 2000 సంవత్సరంలో అర్జున అవార్డు కూడా లభించింది.

ఉదయం 3 గంటలకే..

ఉదయం 3 గంటలకే..

పివి సింధును ఆమె తండ్రి రమణ.. ప్రతిరోజూ ప్రాక్టీస్ నిమిత్తం ఉదయం 3 గంటలకే పుల్లెల గోపిచంద్ అకాడమీకి తీసుకెళ్లేవారు. ఆ స్టేడియానికి వెళ్లేందుకు వారు సుమారు 60 కిలోమీటర్లు ప్రయాణం చేయాల్సి వచ్చేది. ఇలా ప్రతిరోజూ 120 కిలోమీటర్ల ప్రయాణం చేసేవారు. దాదాపు 14 సంవత్సరాల పాటు సింధు ఇలా ప్రయాణం చేయడం గమనార్హం.

ఫోన్ కు దూరంగా..

ఫోన్ కు దూరంగా..

2016 రియో ఒలింపిక్స్ లో సింధు సిల్వర్ మెడల్ గెలిచింది. అప్పుడు బ్యాడ్మింటన్ ప్లేయర్ గా తాను మరింత మెరుగయ్యేందుకు.. ఒలింపిక్స్ పై పూర్తిగా శ్రద్ధ పెట్టేందుకు.. ఆమె దాదాపు 90 రోజుల పాటు ఫోన్ కి దూరంగా ఉంది. ఒలింపిక్స్ లో మెడల్ గెలిచిన తర్వాత తనకు ఫోన్ ఇచ్చానని ఆమె కోచ్ గోపిచంద్ చెప్పడం గమనార్హం.

ఖాళీ సమయాల్లో..

ఖాళీ సమయాల్లో..

బ్యాడ్మింటన్ ట్రైనింగ్ లేని సమయంలో పివి సింధు సరదాగా ఈత కొట్టడం.. యోగా చేయడం.. ధ్యానం చేస్తూ ఉంటుంది. స్విమ్మింగ్ చేస్తున్న ఫొటోలను ఆమె ఇదివరకే చాలాసార్లు ఇన్ స్టాగ్రామ్ లో షేర్ చేసుకుంది.

ఓటమి నుంచే..

ఓటమి నుంచే..

ఓటమి నుంచే పాఠాలు నేర్చుకోవాలని సింధుకు తొలి నుంచి అలవాటు చేశాం. అందుకే పొరపాట్లను అధిగమించడానికి సింధు ప్రణాళికలు వేసుకుంటుంది. అదే తనని విజయానికి దగ్గర చేశాయి. తన ఆట కోసం స్నేహితుల్ని, సరదాల్ని, అన్నీ వదులుకోవాల్సి వచ్చినా, అన్నీ ఇష్టంగానే వదులుకుంది. ఆమె త్యాగం ఊరికే పోలేదని చెప్పడానికి ఆమె ఇపుడు సాధించిన స్వర్ణమే సాక్ష్యం. " అని సింధు తల్లి చెప్పారు.

English summary

PV Sindhu :The Story of Sacrifices and Hardwork Behind Olympics two times Medalist

Here we are talking about PV Sindhu:The story of sacrifrices and hardwork behind olympics two times medalist. Have a look
Story first published: Monday, August 2, 2021, 12:23 [IST]