For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

Republic Day 2022:చరిత్ర తిరగరాసిన నారీమణులు.. ఫ్లై పాస్ట్ ను లీడ్ చేసిన ఫస్ట్ లేడీ పైలట్ స్వాతి రాథోడ్

రిపబ్లిక్ డే 2022 సందర్భంగా తొలి ఐఎఎఫ్ పైల్ స్వాతి రాథోడ్ గురించి ఆసక్తికరమైరమైన విషయాలను తెలుసుకుందాం.

|

జనవరి 26వ తేదీ అంటే గణతంత్ర దినోత్సవ(Republic Day) వేడుకలు జరుపుకునే రోజు అని మనందరికీ తెలుసు. ఇదే ప్రత్యేకమైన విషయం అంటే.. అంతకంటే ప్రత్యేకంగా ఎప్పుడూ గుర్తుంచుకునేలా ఈరోజును మార్చేందుకు ప్రయత్నం చేస్తున్నారు మన మహిళా పైలట్లు, జవాన్లు.

Republic Day 2021: IAF Pilot Swati Rathore All Set To Lead The Flypast

చరిత్రలోనే తొలిసారిగా రిపబ్లిక్ డే వేడుకల సందర్భంగా భారత వైమానిక దళం(IAF)లో పనిచేస్తున్న ఫ్లైట్ లెఫ్టినెంట్ స్వాతి రాథోడ్ ఫ్లైపాస్ట్ కు నాయకత్వం వహించారు. ఇలా నాయకత్వం వహించిన వారిలో తొలి మహిళా పైలట్ గా స్వాతి రాథోడ్ చరిత్రలో నిలిచిపోయారు. ఇది మహిళలందరికీ స్ఫూర్తినివ్వడమే కాదు.. వారి సామర్థ్యాన్ని, ప్రతిభను కూడా గుర్తించినట్లు అవుతుంది. స్వాతి రాథోడ్ ఈ స్థాయికి చేరడానికి తన తండ్రి చేయించిన సాధన.. ఆ సాధనతోనే తాను ఎంతగానో ప్రేరణ పొందినట్లు స్వాతి చెబుతున్నారు.

Republic Day 2021: IAF Pilot Swati Rathore All Set To Lead The Flypast

ఈ సందర్భంగా స్వాతి రాథోడ్ తండ్రి మాట్లాడుతూ 'నా కుమార్తె ఈరోజు నన్ను తల ఎత్తుకునేలా చేసింది. తను కన్న కలలు సాకారం కావడంతో నాకు చాలా ఆనందంగా ఉంది. ఆనందంతో నేను ఉబ్బితబ్బిబ్బవుతున్నాను. నాకు మాటలు రావడం లేదు, నాకు చాలా గర్వంగా ఉందని' స్వాతి తండ్రి భావ్నాని సింగ్ రాథోడ్ అన్నారు.

స్వాతి గురించి చెబుతూ.. తను రాజస్థాన్ రాష్ట్రంలోని నాగ్ పూర్ జిల్లాలో జన్మించిందని.. రాజస్థాన్ లోని అజ్మీర్ పాఠశాలలో తన విద్యను పూర్తి చేసినట్లు తెలిపారు. తన చిన్నతనం నుండే గొప్ప దేశభక్తురాలు. అప్పట్లో పాఠశాలలో నిర్వహించిన పెయింటింగ్ పోటీల్లో, ఆమె జాతీయ జెండాను గీసి, భారతదేశంపై ఉన్న తన ప్రేమను చాటుకుందని గుర్తు చేశారు.

స్వాతి రాథోడ్ సాధించిన ఈ ఘనతను చూసి మేము చాలా గర్వపడుతున్నాం. స్వాతి సాధించిన ఈ విజయం వల్ల దేశంలోని ఇతర మహిళలకు సాధికారత సాధించేందుకు ప్రేరణగా నిలుస్తుందని తాము ఆశిస్తున్నామని స్వాతి పేరేంట్స్ చెప్పారు.

FAQ's
  • రిపబ్లిక్ డే వేడుకల్లో భారత వైమానిక దళానికి నాయకత్వం వహించిన తొలి మహిళ ఎవరు?

    చరిత్రలోనే తొలిసారిగా రిపబ్లిక్ డే వేడుకల సందర్భంగా భారత వైమానిక దళం(IAF)లో పనిచేస్తున్న ఫ్లైట్ లెఫ్టినెంట్ స్వాతి రాథోడ్ ఫ్లైపాస్ట్ కు నాయకత్వం వహించారు. ఇలా నాయకత్వం వహించిన వారిలో తొలి మహిళా పైలట్ గా స్వాతి రాథోడ్ చరిత్రలో నిలిచిపోయారు. ఇది మహిళలందరికీ స్ఫూర్తినివ్వడమే కాదు.. వారి సామర్థ్యాన్ని, ప్రతిభను కూడా గుర్తించినట్లు అవుతుంది. స్వాతి రాథోడ్ ఈ స్థాయికి చేరడానికి తన తండ్రి చేయించిన సాధన.. ఆ సాధనతోనే తాను ఎంతగానో ప్రేరణ పొందినట్లు స్వాతి చెబుతున్నారు.

English summary

Republic Day: IAF Pilot Swati Rathore All Set To Lead The Flypast

Every year India observes 26 January as the Republic Day to commemorate the day when the Constitution of India came under effect in 1950. This year the celebration is going to be historic as IAF Pilot Swati Rathore is all set to lead the flypast at the parade.
Desktop Bottom Promotion