Latest Updates
-
బిర్యానీ రుచిని తలదన్నే కొబ్బరి పాల మటన్ పులావ్.. సండే స్పెషల్ అదిరిపోవాల్సిందే.! -
మూత్రంలో మంటతో పాటు విపరీతమైన జ్వరం.. నిర్లక్ష్యం చేస్తే ఈ పార్ట్‌కి ముప్పు తప్పదు.! -
'పోషకాల నిధి' పొట్టు మినప్పప్పు ఆవిరి కుడుములు.. ఒక్కటి తిన్నా రోజంతా ఎనర్జీ.! -
విపరీత రాజయోగం: అక్టోబర్ 31 వరకు ఈ రాశుల వారిపై గురు కటాక్షంతో ఎనలేని కీర్తి, సంపద.! -
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్‌కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.! -
రసం, సాంబార్ రుచిని మరిపించే కేరళ స్టైల్ ఉల్లిపాయ పులుసు.. అన్నంలోకి అదరహో.! -
పుస్తక జ్ఞానం ఒక్కటే కాదు.. గురువుల నుంచి నేర్చుకోవాల్సిన జీవిత పాఠాలు ఇవే.! -
గర్భిణీలకు బలాన్ని ఇచ్చే ఫుడ్.. మధ్యాహ్నం హడావుడి లేకుండా ఈజీగా చేసుకునే టేస్టీ డిష్.! -
పూరీ, చపాతీలోకి అదుర్స్ అనిపించే నీలగిరి వెజ్ కుర్మా..అమృతం తిన్న ఫీలింగ్!
Hill Stations AP: భాగస్వామితో రొమాంటిక్‌గా గడపాలనుందా, ఏపీలోని ఈ హిల్ స్టేషన్లకు వెళ్లండి
మీరు మీ భాగస్వామిని ఏదైనా మంచి ప్రకృతి పర్యాటక ప్రాంతానికి వెళ్లాలనుకుంటే ఆంధ్రప్రదేశ్ లోని ఈ హిల్ స్టేషన్లకు వెళ్లండి. ఏకాంతంగా, మీ మనసులో ఉన్న వారికి చాలా దగ్గరగా గడపొచ్చు.
భాగస్వామితో రొమాంటిక్ గా గడపాలని ప్రతి ఒక్కరికీ ఉంటుంది. ఎప్పుడు ఇంట్లోనే ఉంటే రొమాంటిక్ గా ఏముంటుంది. అందుకే అప్పుడప్పుడు అలా బయటకు వెళ్తే మజాగా ఉంటుంది. భాగస్వామితో కలిసి ప్రకృతిని ఆస్వాదించేలా జనసంచారం లేని చోటుకు వెళ్తే బాగుంటుంది.

మీరు మీ భాగస్వామిని ఏదైనా మంచి ప్రకృతి పర్యాటక ప్రాంతానికి వెళ్లాలనుకుంటే ఆంధ్రప్రదేశ్ లోని ఈ హిల్ స్టేషన్లకు వెళ్లండి. ఏకాంతంగా, మీ మనసులో ఉన్న వారికి చాలా దగ్గరగా గడపొచ్చు.

1. అరకు లోయ
ఆంధ్రప్రదేశ్ లోని ప్రముఖ సందర్శనీయ ప్రాంతం. ఈ పర్యాటక ప్రదేశాన్ని చూసేందుకు వివిధ ప్రాంతాల నుండి పర్యాటకులు వస్తుంటారు. విశాఖపట్నం నుండి 120 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది అరకు లోయ. జలపాతాలు, లోయలు, ఘాట్ రోడ్లు ఇక్కడ ప్రకృతి రమణీయత కట్టిపడేస్తుంది.

2. హార్సిలీ హిల్స్
రాష్ట్రంలో పేరు పొందిన మరో హిల్ స్టేషన్ హార్సిలీ హిల్స్. సముద్ర మట్టానికి 1260 మీటర్ల ఎత్తులో ఉంటుంది. చిత్తూరు జిల్లాలో ఉండే హార్సిలీ హిల్స్ పర్యాటకులకు, ప్రకృతి ప్రేమికులకు, వైల్డ్ లైఫ్ ను ఆస్వాదించేవారికి గొప్ప పర్యాటక ప్రాంతం.

3. పాపి కొండలు
చుట్టూ కొండలు మధ్యలో నుండి పారే నదీ ఊహించుకుంటేనే ఎంతో అద్భుతంగా అనిపిస్తుంది కదూ. పాపి కొండల ప్రాంతాన్ని స్వయంగా వీక్షిస్తే మంచి అనుభూతి కలుగుతుంది. ఇక్కడ ట్రెక్కింగ్ మంచి మజాను అందిస్తుంది. ఇక్కడి అడవులు, నదులు, సెలయేళ్లు మంత్రముగ్దులను చేస్తాయి. ఇక్కడ మంచి టూరిస్టు ప్యాకేజీలు అందుబాటులో ఉంటాయి. అలాగే పాపి కొండలకు దగ్గర్లోనే భద్రాచలం శ్రీరాముని ఆలయం ఉంటుంది.

4. నగరి కొండలు
చిత్తూరులోని నగరి హిల్స్ మంచి పర్యాటక ప్రాంతం. ఈ హిల్ స్టేషన్ ట్రెక్కింగ్ కు గమ్యస్థానంగా మారింది. సముద్రమట్టానికి 835 మీటర్ల ఎత్తులో ఉంటుంది. ఇక్కడి కొండలు నిటారుగా ఉంటాయి. మనిషి ముక్కు ఆకారాన్ని పోలి ఉంటాయి. అందుకే ఈ హిల్ స్టేషన్ ను నగరి నోస్ అని కూడా పిలుస్తుంటారు. భాగస్వామితో కలిసి ట్రెక్కింగ్ కు వెళ్లడం మంచి అనుభూతిని ఇస్తుంది.

5. మారేడుమిల్లి
మారేడుమిల్లి హిల్ స్టేషన్ పర్యాటకులు ఎక్కువగా సందర్శించని, చాలా మందికి తెలియని గొప్ప పర్యాటక ప్రదేశం. ఇక్కడ సహజమైన నీటి ప్రవాహాలు, జలపాతాలు, వైల్డ్ లైఫ్ మనసును కట్టిపడేస్తాయి. అడ్వెంచర్ క్యాంపులు, హైకింగ్, ట్రెక్కింగ్ ఇష్టపడే వ్యక్తులకు ఈ ప్రాంతం అద్భుతంగా నచ్చుతుంది. వైజాగ్ నుండి 241 కిలోమీటర్ల దురంలో మారేడు మిల్లి హిల్ స్టేషన్ ఉంటుంది. ఇది భద్రాచలం - రాజమండ్రి హైవేపై ఉంటుంది. ఇక్కడ ఆంధ్రా ఫేమస్ బొంగు చికెన్ ఎక్కువగా లభిస్తుంది.

6. లంబసింగి
విశాఖపట్నం జిల్లాలో ఉంటుంది లంబసింగి. సముద్ర మట్టానికి 1000 మీటర్ల ఎత్తులో ఉంటుంది. లంబసింగి ప్రాంతాల్లో ఆంధ్ర కాశ్మీర్ గా పిలుస్తారు. ఇక్కడి వాతావరణం చాలా చల్లగా ఉంటుంది. హిల్ స్టేషన్ పైన మేఘాలు మనల్ని తాకుతూ వెళ్తాయి. ఆంధ్రప్రదేశ్ లోని హిల్ స్టేషన్లలో లంబసింగి చాలా ప్రాముఖ్యత సంపాదించుకుంది.

7. నల్లమల
తూర్పు కనుమల్లో నల్లమల అడవుల్లోని హిల్ స్టేషన్ అద్భుతంగా ఉంటుంది. ఇది రాష్ట్రంలోనే అతి పెద్ద హిల్ స్టేషన్. ఐదు జిల్లాల్లో విస్తరించి ఉంటుంది. తెలంగాణలోని పలు జిల్లాల్లోనూ నల్లమల విస్తరించి ఉంది. నల్లమల హిల్ స్టేషన్ దట్టమైన అడవులో రాతి కొండలు, సహజ సిద్ధంగా ఏర్పడ్డ సెలయేళ్లు, జలపాతాలు కనువిందు చేస్తాయి.



Click it and Unblock the Notifications