Samanta Birthday Special : ఆకా‘సమంత‘ అందం ఆమె సొంతం..

ఆమె నటన గగనమంతా.. పేరు మాత్రం సమంత. నటితో పాటు అక్కినేని వారి కోడలిగా.. నాగ చైతన్యకు భార్యగా పలు బాధ్యతలు మోస్తున్న చెన్నయ్ బ్యూటీ పుట్టినరోజు ఈరోజు (ఏప్రిల్ 28).

సినిమా అనే రంగుల ప్రపంచంలో ఎన్నో కథలు.. ఆ కథల్లో అందాలు ఆరబోసే ఎందరో నాయికలు.. ఆ అందాల తారలతో ఆడిపాడి ప్రేక్షకులను అలరించే కథా నాయకులు.. కాసింత ప్రేమ.. అప్పుడప్పుడు ఆలింగనాలు.. అదిరిపోయేలా గాఢ చుంబనాలు.. మరికొన్ని ప్రేమ గీతాలు.. ఇంకా ఎంతో రమణీయ, కమనీయ ప్రపంచాన్ని మనముందుకు తెస్తుంది సినిమా. వీటన్నింటి సంగతి పక్కనపెడితే.. అలాంటి సినిమాల్లో అందరికీ గుర్తింపు అనేది అంత సులభంగా దక్కదు.

Unknown Facts about Samanta Akkinenei

అందుకు చాలా ప్రతిభ ఉండాలి. అలాంటి వారిలో సమంత అక్కినేని ఒకరు. తన కనుసైగతో.. చిన్ని చిరునవ్వుతో.. నడకే నర్తనంగా.. పలుకే కీర్తనంగా మలచే మహా మంత్రగత్తెలా థియేటర్లలో ప్రేక్షకులను కవ్వించడంలో సమంత తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది.అంతేకాదు నాగ చైతన్యను ప్రేమ పెళ్లి చేసుకున్న తర్వాత కూడా తన వ్యక్తిగత జీవితంలో సాధారణ అమ్మాయిలా కాకుండా ఎల్లప్పుడూ ట్రెండీగా కనిపిస్తూ సోషల్ మీడియాలో యాక్టివ్ గా చెన్నయ్ సుందరి పుట్టినరోజు ఈరోజు(ఏప్రిల్ 28). ఈ సందర్భంగా ఆమె గురించి మనం కొన్ని నమ్మలేని నిజాలను తెలుసుకుందాం...

సమంత జననం..

సమంత జననం..

సమంత 1987లో చెన్నై సిటీలోని పల్లవరంలో ఏప్రిల్ 28న జన్మించింది. ఈమె తల్లిదండ్రులు నన్నెట్టి ప్రభు, జోసెఫ్ ప్రభు. ఈమె తండ్రి తెలుగు వారు. తల్లి కేరళకు రాష్ట్రానికి చెందిన మళయాళీ. సమంతకు ఇద్దరు సోదరులు జొనాధన్, డేవిడ్ ఉన్నారు. సమంతనే వారి ఇంట్లో మూడో సంతానం.

సమంత సురుకు..

సమంత సురుకు..

సమంత చిన్నప్పటి నుండే చాలా చురుకుగా ఉండేదట. ఈ తమిళ బ్యూటీ సెయింట్ స్టీవెన్స్ మెట్రిక్యూలేషన్ స్కూలు, చెన్నై హోలీ ఏంజెల్స్, ఆంగ్లో ఇండియన్ సెకండరీ స్కూళ్లలో చదువుకుంది. తర్వాత చెన్నైలోని స్టెల్లా మేరీ కాలేజీ నుండి డిగ్రీ (బీకాం) పట్టా పొందింది. చదువుకునే సమయంలోనే ఆమె డ్యాన్స్ లు చేయడం, అందరితో కలివిడిగా ఉండటం చేసేది. డిగ్రీ చివర్లో మోడలింగ్ లోకి అడుగుపెట్టి, ఫిల్మ్ మేకర్ రవి వర్మను ఆకర్షించింది. ఆ తర్వాత సినిమాల్లో అడుగుపెట్టింది.

జెస్సిగా తెలుగులో..

జెస్సిగా తెలుగులో..

గౌతమ్ మేనన్ డైరెక్షన్ లో వచ్చిన ‘ఏ మాయ చేసావే‘ సినిమాతో తెలుగులో అడుగుపెట్టిన సమంత ‘జెస్సి‘గా నటించిన ఈ చెన్నయ్ సుందరి.. తెలుగులో తొలి సినిమాతోనే మంచి మార్కులు కొట్టేసింది. ఈ సినిమాలో హీరో నాగ చైతన్య కంటే సమంత నటనకే అభిమానులు ఫిదా అయిపోయారు. ఆ తర్వాత తెలుగు సినిమాల్లో సమంత ‘దూకుడు‘ కొనసాగించింది.

అగ్ర హీరోలందరితో..

అగ్ర హీరోలందరితో..

సమంత తెలుగు చిత్ర పరిశ్రమలో అడుగుపెట్టిన అతికొద్ది కాలంలోనే ఎన్టీఆర్, మహేష్, అల్లుఅర్జున్ వంటి టాప్ హీరోలందరి సరసన నటించే అవకాశాన్ని కొట్టేసింది. ఆమె నటించిన సినిమాలన్నీ దాదాపు సూపర్ హిట్ అయ్యాయి. ఈమె నటించిన సినిమాల్లో పాత్ర ఎక్కువగా లేకపోయినా ఎంతో అందంగా ఉందని ప్రశంసలు లభించాయి.

సమంత వివాహం..

సమంత వివాహం..

ఓవైపు సమంత సినిమాల్లో బిజీగా ఉన్న సమయంలోనే ప్రముఖ హీరో నాగచైతన్యతో ప్రేమాయణం నడిపింది. ఆ ప్రేమ ప్రస్థానం కాస్త పెళ్లి ప్రయాణంగా మారిపోయింది. 2017లో హీరో, మామ నాగార్జున సమక్షంలో అక్టోబర్ 6న అంగరంగ హిందూ సంప్రదాయంలో.. అదే విధంగా 2017లో అక్టోబర్ 7వ తేదీన క్రైస్తవ సంప్రదాయం ప్రకారం నాగచైతన్యతో వివాహం జరిగింది.

సమంతకు మరో పేరు..

సమంతకు మరో పేరు..

సమంత స్నేహితులు ఆమెను సాం అని పిలిచేవారు. ఇప్పుడేమో ఆ పేరులోకి ఇంకో అక్షరం వచ్చి చేరింది. ఆ పేరేంటో ఇప్పటికే మీకు గుర్తు వచ్చింటుంది. అదేనండి ‘‘చైసాం‘‘. చైతన్య పెళ్లి తర్వాత వీరి చైసామ్ గా మారిపోయింది.

సేవలో ముందుండే సమంత..

సేవలో ముందుండే సమంత..

సమంత సినిమాల్లో బిజీగా ఉన్నప్పటికీ.. తనలో మరో యాంగిల్ కూడా ఉంది. అదే సామాజిక సేవ. ఈ చెన్నయ్ చిన్నది సామాజిక సేవలో కూడా అందరికంటే ఒక అడుగు ముందే ఉంటానంటుంది. ఎండోర్స్ మెంట్స్, ఏవైనా ప్రారంభ కార్యక్రమాల నుండి వచ్చిన ఆదాయాన్ని తన ఛారిటబుల్ ట్రస్ట్ అయిన ‘ప్రత్యూష సపోర్ట్‘కు విరాళంగా ఇస్తుంటుంది.

తను అనారోగ్యానికి గురి కావడంతో..

తను అనారోగ్యానికి గురి కావడంతో..

2012లో తను కొన్ని అనారోగ్య సమస్యలను ఎదుర్కొంది. ఆ సమయంలోనే సమంత నాన్ గవర్నమెంటల్ ఆర్గనైజేషన్ ను స్థాపించాలని అనుకుందట. అంతే అదే సంవత్సరంలో ప్రత్యూష సపోర్ట్ ప్రారంభించి, దాని ద్వారా మహిళలకు, పిల్లలకు వైద్యం అందించడం మొదలుపెట్టింది.

సమంతకు అవంటే ఇష్టమట..

సమంతకు అవంటే ఇష్టమట..

సమంత మంచి భోజన ప్రియురాలు. ఈ తమిళ బ్యూటీకి పచ్చి మాంసం, కూరగాయలు కలిపి ఉడికించి చేసే వంటకం సూషీ, మిల్క్ చాక్లెట్లు, పాలకోవా అంటే చాలా ఇష్టమట.

సమంత పురస్కారాలు..

సమంత పురస్కారాలు..

సమంత కెరీర్ లో ఎన్నో పురస్కరాలు అందుకుంది. అందులో ‘మా‘ పురస్కరాలు, ఫిలిం ఫేర్ అవార్డులు, నంది అవార్డులు, వికటన్, విజయ్ తమిళనాడు రాష్ట్ర సినిమా అవార్డులు సంతోషం సినిమా పురస్కారాలు, ఐఫా ఉత్సవ అవార్డులు, టీవి9, జీ సినిమా తెలుగు పురస్కారాలను ఎన్నో అందుకుంది.

Desktop Bottom Promotion