For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

Sister's Day 2021: సిస్టర్స్ డే ఎప్పుడు? ఈరోజు ఎలా ప్రారంభమైందో తెలుసా...

సిస్టర్స్ డే 2021 చరిత్ర మరియు ప్రాముఖ్యత గురించి ఇప్పుడు తెలుసుకుందాం.

|

మన క్యాలెండర్లో ప్రతి సంవత్సరం.. ప్రతి నెలా.. ప్రతిరోజూ ఏదో ఒక ప్రత్యేకత అనేది సాధారణంగా ఉంటుంది. అందులో ఆగస్టు మాసానికి మరింత ప్రత్యేకత ఉంది.

Sisters Day 2021: Date, History, Significance in Telugu

ఈ మాసంలోనే ఫ్రెండ్ షిప్ డే, స్వాతంత్య్ర దినోత్సవం, హిందువులకు పవిత్రమైన శ్రావణ మాసం అన్నీ ప్రారంభమవుతాయి. ఇదిలా ఉండగా మనలో చాలా మందికి మదర్స్ డే, ఫాదర్స్ డే, ఉమెన్స్ డే, వాలెంటైన్స్ డే ఆఖరికి ఫ్రెండ్ షిప్ డే కూడా ఉందని బాగా తెలుసు.

Sisters Day 2021: Date, History, Significance in Telugu

అయితే సిస్టర్స్ డే కూడా ఉందని అతి తక్కువ మందికి మాత్రమే తెలుసు. ఈ సందర్భంగా సిస్టర్స్ డే ఎప్పుడు? ఎందుకని ఈరోజు జరుపుకుంటారు.. అసలు ఈరోజు ఎలా ప్రారంభమైందనే ఆసక్తికరమైన విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం...

International Tiger Day:పులి మన జాతీయ జంతువు ఎందుకయ్యిందో తెలుసా...International Tiger Day:పులి మన జాతీయ జంతువు ఎందుకయ్యిందో తెలుసా...

సిస్టర్స్ డే..

సిస్టర్స్ డే..

ఈ ప్రపంచంలో ఎన్ని బంధాలున్నప్పటికీ.. సోదర సోదరీల బంధం చాలా అందమైనది. ఒకే ఇంట్లో చిన్నప్పటి నుండి తిట్టుకుంటూ.. కొట్టుకుంటూ.. ఉండే సోదర సోదరీలు.. సోదరీమణులు పెద్దయ్యాక మాత్రం ఒక్కసారిగా మారిపోతారు. చాలా ప్రేమ, ఆప్యాయత, అనురాగాలను పంచుకుంటారు. అందుకే మదర్స్ డే, ఫాదర్స్ డే మాదిరిగా సిస్టర్స్ డే అనేది తోబుట్టువులకు అంకితం ఇవ్వబడింది.

సిస్టర్స్ డే చరిత్ర..

సిస్టర్స్ డే చరిత్ర..

మన దేశంలో ప్రతి ఏటా ఆగస్టు ఒకటో తేదీన సిస్టర్స్ డే జరుపుకుంటాం. అదే అమెరికాలో ప్రతి సంవత్సరం ఆగస్టు రెండో తేదీన సిస్టర్స్ డే జరుపుకుంటారు. ఈరోజున సోదరీమణులందరికీ ప్రత్యేక అభినందనలు తెలుపుతారు. ఈరోజున తమ జీవితంలో సోదరీమణులు ఎంత ముఖ్యమో వారికి చెప్పే ప్రయత్నం చేస్తారు. ఇలాంటివన్నీ చెప్పడానికి ఒక్కరోజు సరిపోకపోయినా.. ఈరోజు వారి కోసం ప్రత్యేకంగా ఏదైనా చేయడం ద్వారా వారిపై ఎంత ప్రేమ ఉందో వ్యక్తం చేస్తారు. ఈ సిస్టర్స్ డే వేడుకను తొలిసారిగా అమెరికాలో డెబోరా టాన్నెన్ ప్రారంభించారు. అయితే మీకు తోబుట్టువులు లేకపోతే మీరు సోదరితోనే కాకుండా.. కజిన్స్ తో కూడా ఈ వేడుకలను జరుపుకోవచ్చు.

International Friendship Day 2021: నిజమైన స్నేహితులు తోడుంటే.. ప్రపంచాన్నే జయించొచ్చు...!International Friendship Day 2021: నిజమైన స్నేహితులు తోడుంటే.. ప్రపంచాన్నే జయించొచ్చు...!

తోబుట్టువులకు అండగా..

తోబుట్టువులకు అండగా..

సిస్టర్స్ డే సందర్భంగా తోబుట్టువులందరితో పాటు ఇతర సోదరీమణులందరికీ తాము అండగా ఉంటామని ఈరోజున ప్రత్యేకంగా గుర్తు చేస్తారు. అందుకే సోదరీమణులతో ప్రతి ఒక్కరూ ఒక ప్రత్యేకమైన బంధాన్ని కలిగి ఉంటారు.

ఒకేలా ఉండరు..

ఒకేలా ఉండరు..

ఈ ప్రపంచంలో ఏ ఇద్దరు సోదరీమణులు ఒకేలా ఉండరు. వారి ఇష్టయిష్టాలు, అభిరుచులు, అలవాట్లు, ప్రేమ ఇతర విషయాలన్నింటిలో వారి ఆసక్తులు వేర్వేరుగా ఉంటాయి. అయినా కూడా ఒకరంటే ఒకరు బాగా ఇష్టపడతారు. తొలిరోజుల్లో బాగా కొట్టుకున్నప్పటికీ.. తర్వాత కలిసిపోతారు.

సిస్టర్స్ డే వేడుకలు..

సిస్టర్స్ డే వేడుకలు..

సిస్టర్స్ డే రోజున మీరు మీ సోదరీమణులతో లేదా తోబుట్టువులతో స్నేహంగా గడపండి. వీలైతే వారితో కలిసి లాంగ్ ట్రిప్ కు వెళ్లండి. ఇంకా ఏదైనా సినిమా హాలుకు లేదా షాపింగ్ మాల్ కు తీసుకెళ్లి వారికి నచ్చిన వాటిని కొనివ్వండి. మీ స్నేహితులను కూడా ఇలా చేయమని ప్రోత్సహించండి. #NationalSistersDay అనే హ్యాష్ ట్యాగ్ ఉపయోగించి మీకు దూరంగా సోదరీమణులకు సోషల్ మీడియా ద్వారా విషెస్ చెప్పండి.

English summary

Sister's Day 2021: Date, History, Significance in Telugu

Here we are talking about the sister's day 2021, date, history and significance in Telugu. Read on
Story first published:Thursday, July 29, 2021, 15:41 [IST]
Desktop Bottom Promotion