For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

Gandhi Jayanti-2023 భారత కరెన్సీ నోట్లపై కేవలం గాంధీ బొమ్మ ఎందుకు ఉంటుందో తెలుసా..

|

Gandhi Jayanti-2023 పచ్చ నోటు ఉంటే మన జీవితంలో ఏ పని అయినా నడిచేది. బతుకుబండిని నడిపే ఆ పచ్చ నోటు లేకుంటే మనం జీవించలేం. ఒకరి జేబులు నుండి మరొకరికి జేబులు లేదా గల్లా పెట్టేలో చేరే పచ్చనోట్లతో మన దేశంలో ఎలాంటి పని అయినా ఇట్టే జరిగిపోతుంది.

Mahatma Gandhi

మనం ఉదయం లేచి ఛాయ్ తాగడం నుండి నిద్రపోయే ముందు తినే పండు లేదా ఇతర ఏ ఆహార పదార్థాలైనా తినడానికి, కొనడానికి పచ్చనోట్లపైనే ఆధారపడతాం. అంతటి ప్రాధాన్యత ఉన్న పచ్చ నోటులో గాంధీ బొమ్మ ఎందుకుంటుందో తెలుసా.. గాంధీజీకి మన దేశంలో ఇప్పటికీ ఎందుకంత విలువ ఇస్తారో, గాంధీ ఫోటోతో కరెన్సీ ఎప్పుడు ప్రారంభమైందో ఈ స్టోరీలో తెలుసుకుందాం.

కరెన్సీ ఫొటోలో గాంధీజీ..

కరెన్సీ ఫొటోలో గాంధీజీ..

మన దేశంలో గాంధీజీ ఫొటోను కరెన్సీపై తొలిసారి 1969లో ముద్రించారు. గాంధీజీ 100వ జయంతి సందర్భంగా అప్పటి ప్రభుత్వం రిజర్వు బ్యాంకు గాంధీ ముఖచిత్రంతో ఉన్న ఫొటోను విడుదల చేసింది. అప్పటి నుండి కరెన్సీ నోట్లపై గాంధీ ఫొటో కొనసాగుతూ వస్తోంది.

తొలినాళ్లలో..

తొలినాళ్లలో..

మన దేశానికి స్వాతంత్య్రం వచ్చిన తొలినాళ్లలో అంటే 1947 ఆగస్టు 15వ తేదీ నుండి బ్రిటీష్ రాజవంశపు వ్యక్తుల ఫొటోలతో ఉన్న కరెన్సీ నోట్లు చలామణిలో ఉండేవి. వాటిని మార్చాలని అప్పటి భారత ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. వెంటనే ఆ నిర్ణయాన్ని ఆచరణలో పెట్టింది.

మొదట సింహాల బొమ్మతో..

మొదట సింహాల బొమ్మతో..

మొదట సారనాథ్ స్తూపంలోని సింహాల బొమ్మతో కొత్త నోట్లను ముద్రించారు. తర్వాత 1969లో రిజర్వు బ్యాంకు గాంధీ ముఖచిత్రం, వెనుక సేవాగ్రామ్ ఆశ్రమంతో కూడిన వంద రూపాయల నోటు విడుదల చేసింది. 1987లో ప్రారంభించిన నాటి నుండి గాంధీ నవ్వుతున్న ఫొటో కరెన్సీలో వచ్చి చేరింది. కానీ ఇటీవల దాదాపు మూడేళ్ల క్రితం పాత 500, 1000 నోట్లను రద్దు చేసి, వాటి స్థానంలో కొత్త 500 నోటును, 2 వేల నోటును తెచ్చిన సంగతి కూడా అందరికీ తెలిసిందే. తాజాగా 200 నోటును కొత్తగా రిజర్వు బ్యాంకు విడుదల చేసింది. కాకపోతే వీటిలో చాలా మార్పులు చేసింది. గాంధీజీతో పాటు చంద్రయాన్, హంపి శిల్పాలు, వివిధ కోటల బొమ్మలు, కోణార్క్ సూర్య దేవాలయ చిత్రాలతో కూడిన కొత్త నోట్లను విడుదల చేసింది.

1996 నుండి..

1996 నుండి..

1996 సంవత్సరం నుండి గాంధీ బొమ్మతో కూడిన కరెన్సీ నోట్లు చలామణిలోకి వచ్చాయి. అంతకుముందు మన దేశ కరెన్సీపై అశోక స్తంభాన్ని ముద్రించేవారు. రిజర్వు బ్యాంకు ఆఫ్ ఇండియా నోట్లను మార్పు చేయాలని భావించింది. అప్పటి నుండి 5 రూపాయల నోటు మొదలుకొని వెయ్యి రూపాయల వరకు గాంధీ చిత్రాన్ని ప్రతి కరెన్సీపై ముద్రించడం ప్రారంభించింది. అప్పటినుండి ఇప్పటివరకు అంటే కొత్త నోట్లపై కూడా గాంధీజీ చిత్రం ముద్రించబడుతూనే ఉంది.

గాంధీ నవ్వుతున్న ఫొటోనే ఎందుకంటే..

గాంధీ నవ్వుతున్న ఫొటోనే ఎందుకంటే..

సింహాలు, అశోక స్తంభం ఉన్న ఫొటోలను తొలగించి గాంధీజీ నవ్వుతున్న ఫొటో ఉన్న కరెన్సీని ఎందుకు ముద్రించారనే విషయాన్ని ఆర్ బిఐ తెలిపింది. అందుకు గల కారణమేమంటే గాంధీజీ నవ్వుతూ ఉండే ఫొటోను ఫోర్జరీ చేయడం అంత సులభం కాదని, సింహాలు, అశోక స్తంభం ఉన్న ఫొటోలను ఫోర్జరీ చేయడం చాలా సులభమని ప్రకటించింది. అప్పటి నుండి గాంధీ నవ్వుతున్న ఫొటో మినహా మిగతా ఏ నాయకుల ఫోటోలను ముద్రించకూడదని నిర్ణయం తీసుకుంది. అలాగే మనదేశంలోని భిన్నత్వంలోని ఏకత్వానికి ప్రతీకగా వివిధ చిత్రాల కరెన్సీ నోట్లను ముద్రించేందుకు నిర్ణయం తీసుకుంది. అప్పటి నుండి ఇప్పటివరకు అలాగే అమలు చేస్తోంది.

PC : Image Curtosy

English summary

Gandhi Jayanti-2023 Story Behind The Picture Of Mahatma Gandhi’s Face On India’s Currency Notes

There is a history to it and here we bring to you the actual details behind the history of this particular picture of Mahatma Gandhi's that is used in the Indian currency notes.
Desktop Bottom Promotion