Just In
- 3 hrs ago
ఉపవాసం ఉండే వారు పద్ధతులు తప్పనిసరిగా పాటించాలి.. లేదంటే కోరికలు నెరవేరట...!
- 4 hrs ago
ఆల్కహాల్ వల్ల బ్లడ్ షుగర్ లో వచ్చే మార్పును ఎలా ఎదుర్కోవాలో మీకు తెలుసా? ఇక్కడ తెలుసుకోండి!
- 4 hrs ago
Carbide Free Mangoes:మామిడిలో కార్బైడ్ కలిసిందా లేదా అనేది ఇలా కనిపెట్టండి.. ఆరోగ్యాన్ని కాపాడుకోండి...
- 5 hrs ago
మీ భర్తలోని 'ఈ' లక్షణాల వల్ల మీరు సమస్యల్లో చిక్కుకోవచ్చు...!
Don't Miss
- News
కిన్నెర మొగులయ్య మనస్థాపం: పద్మ శ్రీ వెనక్కి ఇచ్చేస్తా, బీజేపీ నేతలు బదనాం చేస్తున్నారు..
- Sports
బ్యాటింగ్ ఎంచుకోవడానికి కారణమేంటో చెప్పిన హార్దిక్.. ఆర్సీబీ టీం నుంచి సిరాజ్ ఔట్
- Movies
RC15 : రామ్ చరణ్ మరో న్యూ లుక్ వైరల్.. శంకర్ ప్లాన్ మామూలుగా లేదు!
- Technology
ఈ కోడ్ల సాయంతో మీ మొబైల్‌ను ఎవరు ట్రాక్ చేస్తున్నారో కనుగొనవచ్చు
- Automobiles
హ్యుందాయ్ వెన్యూలో చాలా వేరియంట్స్ డిస్కంటిన్యూ.. కొత్త మోడల్ లాంచ్ కోసమేనా..?
- Finance
ఒక్కరోజులో రూ.7 లక్షల కోట్ల సంపద హుష్‌కాకి, ఎల్ఐసీ స్టాక్ మరింత డౌన్
- Travel
కర్ణాటక జూన్ 1 నుండి ఈ ఆధ్యాత్మిక ప్రదేశాలను తెరవనుంది..
Netaji Birth Anniversary:‘పరాక్రమ్ దివాస్’ఎవరి జ్ణాపకార్థం జరుపుకుంటారంటే...!
'మీరు నాకు రక్తం ఇస్తే.. నేను మీకు స్వేచ్ఛ ఇస్తాను' అనే నినాదం భారతదేశంలోని అత్యంత గౌరవనీయమైన నినాదాల్లో ఒక ప్రముఖమైన దానిని నేతాజీ సుభాష్ చంద్రబోస్ మనకు అందించారు. ఈయన ఆలిండియా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా రెండుసార్లు మరియు భారత జాతీయ సైన్యం నాయకుడిగా కూడా పని చేశారు. అంతేకాదు ఈయన 'ఆజాద్ హిందూ ఫౌజ్' అనే సంస్థను ఏర్పాటు చేసి బ్రిటీష్ వారికి వ్యతిరేకంగా పోరాటం చేశారు. ఒడిశాలోని కటక్ లో 1897, జనవరి 23వ తేదీన జన్మించిన ఈయన అతి తక్కువ కాలంలో అత్యంత ఉన్నత శిఖరాలకు ఎదిగారు.
అదే సమయంలో గాంధీజీతో విభేదించారు. బ్రిటీష్ వారి నుండి భారతదేశానికి విముక్తి కలగాలంటే శాంతి, అహింస మార్గాలే కాదు.. సాయుధ పోరాటం కూడా చేయాలన్నారు. అప్పుడే మనకు స్వాతంత్య్రం వస్తుందని బలంగా నమ్మిన వ్యక్తి. రామక్రిష్ణ పరమహంస, స్వామి వివేకానందుల మార్గంలో పయనించి సన్యాసం తీసుకోవడానికి తీర్మానించారు.
'మానవసేవే మాధవసేవ' అనే నినాదం, రామక్రిష్ణ ఉపదేశించిన దేశాభిమానంతో ముందుకు సాగారు. జాతీయ కాంగ్రెస్ పార్టీలో చేరిన తర్వాత భారతదేశ స్వాతంత్ర్యం పోరాటంలో పాల్గొన్నారు. శ్రీ ఆర్యా పత్రికలో ఆయన సంపాదకులుగా రాసిన వ్యాసాలు స్వాతంత్య్ర సమరంలో పాల్గొనే వీరుల్లో మంచి ఉత్సాహాన్ని నింపాయి.
తను డిగ్రీ పూర్తి చేసి ఇంగ్లండ్ కు వెళ్లిన సమయంలోనే జలియన్ వాలా బాగ్ ఉదంతం చోటు చేసుకుంది. అదే సందర్భంలో యువతలో ఉత్సాహాన్ని రేకెత్తించే మరియు మనకు స్ఫూర్తినిచ్చే సందేశాలు. నినాదాలను ఎన్నో ఇచ్చారు. నేతాజీ సుభాష్ చంద్రబోస్ జయంతి వార్షికోత్సవం సందర్భంగా ఆయన నినాదాలను, మాటలను మరోసారి గుర్తు చేసుకుందాం...
Netaji
Birth
Anniversary
:
మనలో
పోరాట
పటిమను
పెంచే
నేతాజీ
సుభాష్
చంద్ర
బోస్
సందేశాలివే...

ఆంగ్లేయులపై పోరు..
సుభాష్ చంద్ర బోస్ ‘ఆజాద్ హింద్ ఫౌజ్' అనే సంస్థను స్థాపించి.. అందులో అనేక మందికి శిక్షణ ఇచ్చి.. బ్రిటిష్ వారికి వ్యతిరేకంగా పోరాడేందుకు సిద్ధమయ్యాడు. వారిపై యుద్ధం ప్రకటించి భారత స్వాతంత్య్ర సంగ్రామాన్ని మరో మలుపు తిప్పిన స్వాతంత్య్ర సమరయోధుడు.

స్వాతంత్య్ర పోరులో..
భారత స్వాతంత్య్ర పోరులో నేతాజీ పాత్ర చాలా కీలకం. ఆయన సొంతంగా ఆర్మీని ఏర్పాటు చేసి.. రష్యా, జపాన్ ఇంకా ఇతర దేశాల సహాయం తీసుకుని.. ఆంగ్లేయులను ఓడించేందుకు అనేక ప్రయత్నాలు చేశారు. కానీ అనూహ్య రీతిలో ఆయన కల నెరవేరలేదు.

విమాన ప్రమాదంలో..
మన దేశానికి స్వాతంత్య్రం రావడానికి అతి కొద్ది కాలం ముందే అంటే 1945 సంవత్సరంలో ఆగస్టు 18వ తేదీన తైపీలో జరిగిన విమాన ప్రమాదంలో మరణించినట్లు చాలా మంది చెబుతారు. అయినా తన మరణంపై నేటికీ మిస్టరీగానే మిగిలిపోయింది.

పరాక్రమ్ దివాస్..
ఆయన పోరాట పటిమను గుర్తించిన కేంద్ర ప్రభుత్వం తనకు అరుదైన గౌరవం కల్పించింది. ఆయన జన్మించిన జనవరి 23వ తేదీన ప్రతి సంవత్సరం ‘పరాక్రమ్ దివాస్' దినోత్సవాన్ని జరుపుకోవాలని నిర్ణయించింది. 2021లో నేతాజీ 125వ జయంతి దినోత్సవం సందర్భంగా ఈ నిర్ణయం తీసుకుంది.
సుభాష్ చంద్ర బోస్ ఒడిశాలోని కటక్ లో 1897, జనవరి 23వ తేదీన జన్మించిన ఈయన అతి తక్కువ కాలంలో అత్యంత ఉన్నత శిఖరాలకు ఎదిగారు. అదే సమయంలో గాంధీజీతో విభేదించారు. బ్రిటీష్ వారి నుండి భారతదేశానికి విముక్తి కలగాలంటే శాంతి, అహింస మార్గాలే కాదు.. సాయుధ పోరాటం కూడా చేయాలన్నారు. అప్పుడే మనకు స్వాతంత్య్రం వస్తుందని బలంగా నమ్మిన వ్యక్తి. రామక్రిష్ణ పరమహంస, స్వామి వివేకానందుల మార్గంలో పయనించి సన్యాసం తీసుకోవడానికి తీర్మానించారు.
సుభాష్ చంద్ర బోస్ పుట్టినరోజును పురస్కరించుకుని.. ప్రతి సంవత్సరం భారతదేశంలో పరాక్రమ దినోత్సవాన్ని జరుపుకుంటారు. 2021లో నేతాజీ 125వ జయంతి సందర్భంగా కేంద్రం ఈ దినోత్సవాన్ని ప్రతి ఏటా జరుపుకోవాలని నిర్ణయించింది.