For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

రూ.కోటి ఆఫర్ ను కాదనుకుంది.. కొత్త కంపెనీ పెట్టింది... సక్సెస్ సాధించింది.. ఇంతకీ తను ఎవరంటే...

అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా షుగర్ కాస్మోటిక్స్ సిఇఓ వినీత సింగ్ సక్సెస్ స్టోరీ గురించి తెలుసుకుందాం.

|

ప్రతి సంవత్సరం ప్రపంచ వ్యాప్తంగా మార్చి 8వ తేదీన ఇంటర్నేషనల్ ఉమెన్స్ డే జరుపుకుంటారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా మహిళల మానసిక, సామాజిక, ఆరోగ్యం, శ్రేయస్సు పెంపుదలను లక్ష్యంగా పెట్టుకుంది.

Sugar Cosmetics CEO Vineeta Singh Success Story in Telugu

ఈ నేపథ్యంలో 2022 మార్చిలో ఉమెన్స్ డే థీమ్ ''రేపటి మహిళలు''. ఇప్పటికే మహిళలు అన్ని రంగాల్లో తమ నైపుణ్యాలతో ఉన్నత శిఖరాలను అధిరోహించారు. పురుషులతో సమానంగా జీవిస్తున్నారనడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు.

Sugar Cosmetics CEO Vineeta Singh Success Story in Telugu

ఇదిలా ఉండగా.. ఇటీవలి కాలంలో మీడియాలో, సోషల్ మీడియాలో అత్యంత ఎక్కువ ప్రజాదరణ పొందిన ఓ మహిళా విజయగాథను ఇప్పుడు మనం తెలుసుకుంటున్నాం. తను ఓ సాధారణ మహిళ స్థాయి నుండి ఓ కంపెనీ సిఇఒ స్థాయి వరకు ఎదిగింది. అంతేకాదు ఆ కంపెనీని విజయవంతంగా నడిపిస్తోంది. తన సక్సెస్ స్టోరీతో కోట్లాది మంది మహిళలకు ఆదర్శంగా నిలిచింది. ఈ సందర్భంగా వీర మహిళ విజయాలు, తను ఉన్నతస్థాయికి ఎలా చేరుకుందనే ఆసక్తికరమైన విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం...

బాహుబలి హీరో ప్రభాస్ డైట్ అండ్ ఫిట్నెస్ రహస్యాలేంటో తెలుసా...బాహుబలి హీరో ప్రభాస్ డైట్ అండ్ ఫిట్నెస్ రహస్యాలేంటో తెలుసా...

రూ.కోటి ఆఫర్ ను కాదని.. కొత్త కంపెనీ పెట్టి.. సక్సెస్ సాధించింది..

రూ.కోటి ఆఫర్ ను కాదని.. కొత్త కంపెనీ పెట్టి.. సక్సెస్ సాధించింది..

మనలో చాలా మందికి కాస్మోటిక్స్ గురించి ఐడియా ఉండే ఉంటుంది. అయితే వీటిలో షుగర్ కాస్మోటిక్స్ గురించి మరింత ఎక్కువమందికి తెలిసే ఉంటుంది. ఆ కంపెనీ సిఇఒ ఓ మహిళ. ఆ కంపెనీ బ్రాండ్ ఎవరో కాదు వినీతా సింగ్. అంతేకాదు తను సహా వ్యవస్థాపకురాలుగా కూడా ఉన్నారు. షుగర్ బ్రాండ్ కు సంబంధించిన లిప్ స్టిక్స్ మహిళల్లో బాగా ప్రాచుర్యం పొందాయి. తాజాగా ఈమె ప్రముఖ షో షార్క్ టాంక్ ఇండియాలోనూ జడ్జిగా కనిపించింది.

కోటి రూపాయల వద్దని..

కోటి రూపాయల వద్దని..

వినీత సింగ్ 23 ఏళ్ల వయసులో కోటి రూపాయల ఆఫర్ ను తిరస్కరించింది. ఎందుకంటే తను సొంత కంపెనీ ప్రారంభించాలనుకునేదట. అందుకే బ్యాంకు నుండి కోటి రూపాయల ఆఫర్ వచ్చినా... అది జీవితంలో అతి పెద్ద ప్రమాదమని భావించిందట. తన స్నేహితులు, తండ్రి ఉద్యోగం చేయమని ఎంతో ఒత్తిడి తెచ్చారట. అయినా కూడా తను ఈ నిర్ణయం తీసుకోవడం చాలా రిస్క్ తో కూడుకున్నది. తన జీవితంలో అతి పెద్ద రిస్క్ తీసుకుంటున్నానని తెలిసినా తన నిర్ణయాన్ని మార్చుకోకుండా తన కలను సాకారం చేసుకునేందుకు ఎంతగానో క్రుషి చేసింది.

షుగర్ కాస్మోటిక్స్ ప్రారంభమెలా?

షుగర్ కాస్మోటిక్స్ ప్రారంభమెలా?

వినీతా సింగ్ భర్త కౌశిక్ ముఖర్జీతో కలిసి 2012 సంవత్సరంలో షుగర్ కాస్మోటిక్స్ ను ప్రారంభించారు. 2019-2020 సంవత్సరంలో వారి బ్రాండ్ బిజినెస్ రూ.100 కోట్ల మార్కును దాటింది. ఒకప్పుడు షుగర్ కాస్మోటిక్స్ పెద్ద కంపెనీల నుండి తీవ్రమైన పోటీ ఉండేది. అయితే ఇప్పుడు కొన్ని మిలియన్ల షుగర్ కాస్మోటిక్స్ ఉత్పత్తులు చాలా వేగంగా అమ్ముడవుతున్నాయి.

Pooja Hegde: లేటెస్ట్ డ్రస్సులో సమ్మర్ కంటే ముందే హీట్ పుట్టిస్తోన్న పూజా హెగ్డే...Pooja Hegde: లేటెస్ట్ డ్రస్సులో సమ్మర్ కంటే ముందే హీట్ పుట్టిస్తోన్న పూజా హెగ్డే...

సొంతంగా స్టార్టప్..!

సొంతంగా స్టార్టప్..!

వినీతా సింగ్ ఢిల్లీలో జన్మించారు. మద్రాసు ఐఐటిలో ఎలక్ట్రికల్ ఇంజినీరింగ్ చేశారు. ఆ తర్వాత ఐఐఎం అహ్మదాబాదులో ఎంబీఏ పూర్తి చేశారు. అనంతరం వినీత సింగ్ తన కలను నెరవేర్చుకోవడానికి ముందుగా ముంబైకి వచ్చింది. తను ఓ చిన్న గదిని అద్దెకు తీసుకుని అక్కడే నివసించింది. అక్కడే కష్టాలు పడుతూ వ్యాపారం ప్రారంభించింది. ఎలాంటి నిధులు లేకుండా సొంతంగా స్టార్టప్ ని ప్రారంభించేందుకు ప్రయత్నించినట్లు వినీత ఓ ఇంటర్వ్యూలో చెప్పారు.

వినీతా సింగ్ నికర విలువ..

వినీతా సింగ్ నికర విలువ..

ప్రస్తుత కాలంలో ధనవంతుల జాబితాలో వినీతా సింగ్ కూడా చేరిపోయింది. తన నికర విలువ గురించి చెప్పాలంటే, ఆమెకు ఏడాదికి దాదాపు 300 కోట్ల రూపాయలు వస్తున్నట్లు సమాచారం. అంతేకాదు షార్క్ టాంక్ అనే బిజినెస్ రియాలిటీ షోలో న్యాయనిర్ణేత పాత్ర కోసం ఒక్కో ఎపిసోడ్ కు వినీతా సింగ్ దాదాపు 5 నుండి 6 లక్షల రూపాయలు తీసుకుంటున్నారట.

ఫిట్నెస్ విషయంలో..

ఫిట్నెస్ విషయంలో..

వినీతా సింగ్ కేవలం వ్యాపారంలోనే కాదు.. తను ఒక గొప్ప క్రీడాకారినిణి కూడా. అందుకే తన సోషల్ మీడియా పేజీలో ఫిట్నెస్ కు సంబంధించిన వీడియోలను షేర్ చేసుకుంటూ ఉంటారు. అంతేకాదు 2013 సంవత్సరంలో దక్షిణాఫ్రికాలో జరిగిన అల్ట్రా మారథాన్ లో కూడా ఆమె పాల్గొన్నారు. అక్కడ డౌన్ రన్ పూర్తి చేసినందుకు తనకు బ్యాక్ టు బ్యాక్ మెడల్స్ కూడా దక్కాయట.

FAQ's
  • షుగర్ కాస్మోటిక్స్ కంపెనీ సిఇఒ ఎవరు?

    మనలో చాలా మందికి కాస్మోటిక్స్ గురించి ఐడియా ఉండే ఉంటుంది. అయితే వీటిలో ‘‘షుగర్ కాస్మోటిక్స్' గురించి మరింత ఎక్కువమందికి తెలిసే ఉంటుంది. ఆ కంపెనీ సిఇఒ ఓ మహిళ. ఆ కంపెనీ బ్రాండ్ ఎవరో కాదు వినీతా సింగ్. అంతేకాదు తను సహా వ్యవస్థాపకురాలుగా కూడా ఉన్నారు. షుగర్ బ్రాండ్ కు సంబంధించిన లిప్ స్టిక్స్ మహిళల్లో బాగా ప్రాచుర్యం పొందాయి. తాజాగా ఈమె ప్రముఖ షో షార్క్ టాంక్ ఇండియాలోనూ జడ్జిగా కనిపించింది.

  • అంతర్జాతీయ మహిళా దినోత్సవం ఎప్పుడు జరుపుకుంటారు?

    ప్రతి సంవత్సరం ప్రపంచ వ్యాప్తంగా మార్చి 8వ తేదీన ఇంటర్నేషనల్ ఉమెన్స్ డే జరుపుకుంటారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా మహిళల మానసిక, సామాజిక, ఆరోగ్యం, శ్రేయస్సు పెంపుదలను లక్ష్యంగా పెట్టుకుంది. ఈ నేపథ్యంలో 2022 మార్చిలో ఉమెన్స్ డే థీమ్ ‘‘రేపటి మహిళలు'.

English summary

Sugar Cosmetics CEO Vineeta Singh Success Story in Telugu

International Womens Day: Success Story Of Ceo Of Sugar Cosmetics Vineeta Singh In Telugu. Read On,
Desktop Bottom Promotion