Latest Updates
-
NEET UG 2026: అడ్మిట్ కార్డ్ వచ్చేస్తోంది.. పరీక్షలో విజయం సాధించాలంటే చాణక్యుడు చెప్పిన ఈ సూత్రాలు పాటించండి! -
నేటి గ్రహాల సంచారం: సూర్య-చంద్రుల కలయికతో ఈ రాశుల వారికి అదృష్టం పండబోతోంది! -
పుష్య నక్షత్రం, అమృత కాలం కలయిక.. ఈ రాశుల వారికి ఇక తిరుగులేదు! -
స్టవ్ తో పనేలేదు,ఎండ ఉంటే చాలు..వాడిపోయిన నిమ్మకాయలతో అదిరిపోయే ఊరగాయ..పెరుగన్నం,పప్పులోకి కేక -
రాజస్థానీ స్పెషల్ గులాబ్ జామున్ కర్రీ..గిన్నెలు లేపాల్సిందే! -
ఎండలు మండిపోతున్నాయి! వడదెబ్బ తగలకుండా ఉండాలంటే ఈ సైన్స్ ఆధారిత హైడ్రేషన్ ప్లాన్ మీకోసం -
మోహినీ ఏకాదశి వ్రతం చేస్తున్నారా? మీరు తెలియక చేసే ఈ చిన్న తప్పులే ఫలితాన్ని దూరం చేస్తున్నాయా? -
స్వార్థం లేని స్నేహం, ప్రేమ కావాలా? చాణక్యుడు చెప్పిన ఈ 4 సూత్రాలు పాటించండి! -
కర్కాటకం, వృశ్చికం, మీన రాశుల వారికి లక్ష్మీ కటాక్షం.. ఎవరికి భారీ అదృష్టం? - శుక్రవారం, 24 ఏప్రిల్ 2026 -
వడగాల్పుల వేళ గర్భిణులు, పీసీఓఎస్ బాధితులు ఈ జాగ్రత్తలు తీసుకోకపోతే ప్రమాదమే!
సుష్మా స్వరాజ్ రాజకీయ ప్రస్థానం..
సోనియా గాంధీకే ఎదురునిలిచిన ధీరవనిత.. తన ప్రసంగాలతో అందరినీ ఆకట్టుకునే సుష్మాజీ ఇక లేరనే వార్తలను భారతావని జీర్ణించుకోలేకపోతోంది. తెలంగాణ రాష్ట్రం ఏర్పడటంలోనూ ఆమె కీలకపాత్ర పోషించారు.
Life
oi-Venkatesh Sale
మాజీ విదేశాంగ మంత్రి సుష్మా స్వరాజ్ 1953 ఫిబ్రవరి 14న హర్యాణాలోని అంబాలాలో జన్మించారు. ఏడుసార్లు ఎంపీగా, మూడుసార్లు ఎమ్మెల్యేగా పనిచేశారు. ఢిల్లీ ఐదో ముఖ్యమంత్రిగానూ సేవలందించారు. 1970వ దశకంలో ఏబీవీపీ ద్వారా తన రాజకీయ ప్రస్థానాన్ని ప్రారంభించారు. అప్పటినుంచి అంచెలంచెలుగా ఎదుగుతూ అందరి మన్ననలు అందుకున్నారు.

1977-82: హర్యానా అసెంబ్లీకి తొలిసారి ఎన్నికయ్యారు.
1977-79: హర్యానా ప్రభుత్వంలో కార్మిక, ఉపాధి మంత్రిగా బాధ్యతలు చేపట్టారు.
1987-90: హర్యానా శాసనసభ సభ్యురాలిగా రెండోసారి జయకేతనం ఎగురవేశారు.
1987-90: విద్య, ఆహార, పౌరసరఫరాల మంత్రిత్వ శాఖల బాధ్యతలు స్వీకరించారు.

1996-97: 11వ లోక్‌సభకు ఎన్నిక (ఎంపీగా రెండోసారి: 1996 మే 15- 1997 డిసెంబర్ 4)
1996: (మే 16 - జూన్ 1) కేంద్ర సమాచార, ప్రసారశాఖ మంత్రిగా బాధ్యతలు చేపట్టారు.
1998-99: 12వ లోక్‌సభకు మళ్లీ ఎన్నికయ్యారు. (ఎంపీగా మూడోసారి: 1998 మార్చి 10- 1999 ఏప్రిల్ 26)
1998: (మార్చి 19- అక్టోబర్ 12) కేంద్ర సమాచార, ప్రసారశాఖతోపాటు అదనంగా టెలీ కమ్యూనికేషన్ల శాఖ బాధ్యతలను నిర్వర్తించారు.

1998: (నవంబర్) హజ్ ఖాస్ నియోజకవర్గం నుంచి ఢిల్లీ అసెంబ్లీకి ఎన్నికయ్యారు. అనంతరం రాజీనామా చేసి లోక్‌సభ సభ్యురాలిగా కొనసాగారు.
2000-06 : రాజసభ్యకు ఎన్నికయ్యారు. (ఎంపీగా నాలుగోసారి)
2000-03 : (2000 సెప్టెంబర్ 30- 2003 జనవరి 29) కేంద్ర సమాచార, ప్రసారశాఖ బాధ్యతలు స్వీకరించారు.
2003-04: (2003 జనవరి 29- 2004 మే 22) కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమం, పార్లమెంటరీ వ్యవహారాల బాధ్యతలు చేపట్టారు.

2009-14: (2009 మే 16- 2014 మే 18) 15వ లోక్‌సభకు ఎన్నికయ్యారు (ఎంపీగా ఆరోసారి)
2009-09: (2009 జూన్ 3 - 2009 డిసెంబర్ 21) లోక్‌సభలో ప్రతిపక్ష ఉప నేత పాత్రను సమర్థంగా నిర్వర్తించారు.
2009-14: (2009 డిసెంబర్ 21- 2014 మే 18) లోక్‌సభలో ప్రతిపక్ష నేతగా అద్వానీ స్థానాన్ని భర్తీ చేశారు.
2014-19: (2014 మే 26 నుంచి ) 16వ లోక్‌సభకు ఎన్నికయ్యారు. (ఎంపీగా ఏడోసారి)
2014-19: (2014 మే 26- 2019 మే 29) కేంద్ర విదేశాంగ మంత్రిగా బాధ్యతలు చేపట్టి అందరి మన్ననలు పొందారు.
Comments
English summary



Click it and Unblock the Notifications