For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

Thanks Giving Day 2022 : ఎవరికైనా కృతజ్ఞతలు చెప్పాలంటే ఈరోజే చెప్పేయండి... ఎందుకంటే...

ఈ దినోత్సవానికి ప్రపంచ వ్యాప్తంగా మంచి ప్రాముఖ్యత ఉంది. దీనిని మొట్టమొదటిసారిగా అమెరికా మొదటి అధ్యక్షుడు జార్జ్ వాషింగ్టన్ నవంబర్ 26న 1789న నియమించారు.

|

Thanks Giving Day 2022 : మన జీవితంలో మనం జన్మించిన నాటి నుండి నేటి వరకూ ఎందరో తోడ్పాటు వల్లే మనం ప్రస్తుతం ఈ స్థాయికి చేరుకోగలిగాం. మనం ఒకస్థాయికి వచ్చాక, మనలో ఒక్కసారిగా ఫలానా వారి వల్లే నేను ఈ స్థాయికి రాగలిగాను.. వారి వద్దకు వెళ్లి ఒకసారి కలిసి రావాలి అనుకుంటాం. కానీ మనకు నిత్యం ఉండే పని ఒత్తిడి, గజి బిజీ లైఫ్ వల్ల మనం వారిని కలవలేకపోతాం.

Thanksgiving Day

అందుకే వారు చేసిన సేవ, మేలు, సహాయం, త్యాగాన్ని గుర్తు చేసుకునేందుకు ఈరోజును ఏర్పాటు చేశారు. అందుకే మీ జీవితంలో మీ అభివృద్ధి కోసం పాటుపడిన వారందరికీ కృతజ్ఞతలు తెలియజేయడానికి ఈ దినోత్సవాన్ని నిర్ణయించారు. ఇంతకీ ఈ దినోత్సవాన్ని ఎవరు పరిచయం చేశారు? ఎప్పుడు పరిచయం చేశారు? ఎక్కడ పరిచయం చేశారు అనే వివరాలు తెలియాలంటే ఈ స్టోరీలోకి వెళ్లాల్సిందే..

కృతజ్ఞతా దినోత్సవ ప్రాముఖ్యత..

కృతజ్ఞతా దినోత్సవ ప్రాముఖ్యత..

ఈ దినోత్సవానికి ప్రపంచ వ్యాప్తంగా మంచి ప్రాముఖ్యత ఉంది. దీనిని మొట్టమొదటిసారిగా అమెరికా మొదటి అధ్యక్షుడు జార్జ్ వాషింగ్టన్ నవంబర్ 26న 1789న నియమించారు. అయితే తరువాత వచ్చిన మరో అధ్యక్షుడు భారత సంతతికి చెందిన ప్రముఖుడు అబ్రహం లింకన్ ప్రతి సంవత్సరం నవంబర్ నాలుగో గురువారం నాడు కృతజ్ఞతా దినోత్సవంగా నిర్ణయించారు.

చరిత్రను పరిశీలిస్తే..

చరిత్రను పరిశీలిస్తే..

1620 సంవత్సరం సెప్టెంబర్ మాసంలో 102 మంది ప్రజలతో మే ఫ్లవర్ అనే ఓడ ఇంగ్లాండ్ నుండి బయలుదేరింది. వారు తమ విశ్వాసాన్ని స్వేచ్ఛగా ఆచరించడానికి కొత్త ఇంటి కోసం అన్వేషిస్తున్నారు. రెండు నెలల తర్వాత యాత్రికులు మసాచుసెట్స్ కు చేరుకున్నారు. కొంతమంది ఓడలోనే నివసించడం అలవాటు చేసుకున్నారు. ఇంకా కొంతమంది ఒక చిన్న గ్రామాన్నిస్థాపించే పనిని ప్రారంభించారు. అయినప్పటికీ శీతాకాలంలో తక్కువ ఉష్ణోగ్రత మరియు ఆహార లోపం కారణంగా వారు అంటు వ్యాధి మరియు దురదతో బాధపడ్డారు. ఇక మార్చిలో అంటే వసంత కాలాన్ని ఆస్వాదించేందుకు న్యూ ఇంగ్లాండుకు వెళ్లారు.

కొత్త తెగతో స్నేహం..

కొత్త తెగతో స్నేహం..

ఆ ఓడలోని యాత్రికులు స్క్వాంటో అనే స్థానిక అమెరికన్ ను కలుసుకున్నారు. అతను యాత్రికులకు మొక్కజొన్న పండించడం, చేపలను పట్టుకోవడం, చెట్ల నుండి పండ్లను తీయడం మరియు విష మొక్కలను ఎలా నివారించాలో నేర్పించాడు. అలాగే స్థానిక తెగతో స్నేహం ఏర్పడేందుకు వారికి సహాయం చేశాడు.

మొట్టమొదటి మొక్కజొన్న..

మొట్టమొదటి మొక్కజొన్న..

1621 సంవత్సరం నవంబర్ నెలలో యాత్రికుల మొట్టమొదటి మొక్కజొన్న పంట విజయవంతం అయ్యింది. ఆ సమయంలో గవర్నర్ గా ఉన్న విలియం బ్రాడ్ ఫోర్డ్ ను మూడురోజుల పాటు విందు వేడుకలను నిర్వహించారు. తర్వాత థ్యాంక్స్ గివింగ్ వేడుక న్యూ ఇంగ్లాండ్ ప్రాంతాల్లో సాధారణ పద్ధతిగా మారిపోయింది.

కృతజ్ఞత దినోత్సవ సంప్రదాయం

కృతజ్ఞత దినోత్సవ సంప్రదాయం

మన తెలుగు రాష్ట్రాల్లో కార్తీక మాసంలో వన భోజనాలు ఎలా నిర్వహిస్తామో, అచ్చం అలాగే కృతజ్ఞత దినోత్సవ సంప్రదాయన్ని పాటిస్తారు. ఈ ఆధునిక సాంప్రదాయం ప్రకారం మంచి భోజనం వండి కుటుంబం మరియు స్నేహితులతో కలిసి ఈ వేడుకను జరుపుకుంటారు. ప్రజలు నిర్దిష్ట సమయంలో మంచి పంటను అందించినందుకు మరియు అంతకుముందు సంవత్సరానికి కృతజ్ఞతలు తెలుపుతారు. అయితే ఈ భోజనంలో అమెరికన్లు 90 శాతం మంది కాల్చిన టర్కీని తింటారు. ఎందుకంటే ఆ పక్షి మొత్తం కుటుంబాన్ని పోషించేంత పెద్దదని వారు నమ్ముతారు. అయితే స్నో ప్లేక్, బంగాళదుంపలు, గుమ్మడికాయ ఫ్రై, క్యాండీలు, ద్రాక్ష మరియు ఇతర సాంప్రదాయ ఆహారాలు కూడా చేర్చబడ్డాయి.

ఇది కృతజ్ఞతా దినోత్సవం చరిత్ర, ప్రాముఖ్యత, సంప్రదాయం. సో మీకు కూడా మీ జీవితంలో ఎవరో ఒకరు.. ఎంతో కొంత మేలు చేసే ఉంటారు. కాకపోతే కొన్ని తెలిసి చేస్తారు. కొన్ని మనకు తెలియకుండా చేస్తారు. అలాంటి వారందరికీ కృతజ్ఞతలు చెప్పాలని అనుకుంటాం. కాని కొన్ని అనివార్య కారణాల వల్ల మరచిపోతాం. తర్వాత వారికి మనం చెప్పాలన్నా వారు మనకు కనిపించరు. అప్పుడే మనం ఏదో ఇవ్వాల్సింది అలాగే బ్యాలెన్స్ ఉండిపోయేందనే భావనలో ఉండిపోతాం. అయితే ఈ భావన మనల్ని జీవితాంతం వెంటాడుతుంది. అలాంటి వారిని మరోసారి లేదా కనీసం ఏడాదికి ఒకసారి అయినా గుర్తు చేసుకోవడానికి ఈ కృతజ్ఞత దినోత్సవం అన్నమాట.

నా జీవితంలో కూడా నాకు మేలు, కీడు, ఉపకారం, మోసం, నన్ను నమ్మిన వారికి, నమ్మని వారికి, వెన్నుపోటు దారులకూ, ఆపదలో ఆదుకున్న వారందరికీ.. నన్ను నిత్యం ప్రోత్సహించేవారితో పాటు... అందరికీ నా హృదయపూర్వక కృతజ్ఞతలు.

ఈ ఆర్టికల్ మీకు నచ్చినట్లయితే బంధు మిత్రులకు, మీ ప్రియమైన వారికి షేర్ చేయండి. ఇలాంటి అనేక ఆరోగ్య, సౌందర్య, జీవనశైలి, ఆహార, లైంగిక, వ్యాయామ, ఆద్యాత్మిక, జ్యోతిష్య, హస్త సాముద్రిక, తదితర సంబంధిత విషయాల కోసం బోల్డ్స్కై పేజీని తరచూ సందర్శించండి. ఈ ఆర్టికల్ పై మీ అభిప్రాయాలను కామెంట్స్ విభాగంలో తెలియజేయండి.

English summary

Thanksgiving Day 2022: Date, History And Tradition Of The Day

Every year, the fourth Thursday of November is celebrated as the Thanksgiving Day. This year, the day falls on 28 November. It is marked by cooking a bountiful turkey meal and celebrating the day with family and friends. Let’s know more.
Desktop Bottom Promotion