For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

అప్పుడు.. నిమ్మరసం అమ్మిన మహిళ.. ఇప్పుడు పవర్ ఫుల్ పోలీస్ ఎలా అయ్యిందో తెలుసా...

నిమ్మరసం అమ్మిన చోటే ఎస్సైగా బాధ్యతలు స్వీకరించిన మహిళ గురించి తెలుసుకుందామా.

|

తను డిగ్రీ చదివే సమయంలోనే ప్రేమ కోసం పెద్దలను ఎదిరించింది. చదువును మధ్యలోనే వదిలేసి ప్రియుడి మాటలను నమ్మి పెళ్లి చేసుకుంది. 18 సంవత్సరాలకే ఓ పండంటి బిడ్డకు కూడా జన్మనిచ్చింది.

The Inspiring Story Of A Kerala Woman Anie Siva Who Once Sold Lemonade & Is Now A Cop

తన జీవితం సాఫీగా సాగుతుందని సంతోషించింది.. కానీ అంతలోనే కట్టుకున్న భర్తే కన్నీళ్లు పెట్టించాడు.. ప్రేమించి పెళ్లి చేసుకున్న భర్త బిడ్డ పుట్టాక అర్ధాంతరంగా తనని వదిలేసి వెళ్లిపోయాడు. దీంతో ఆమె మళ్లీ పుట్టింటి బాట పట్టింది. అక్కడ కూడా ఆమెకు నిరాశ ఎదురైంది. అయితే ఆమె అధైర్యపడలేదు.

స్ఫూర్తిదాయకమైన కథ..

స్ఫూర్తిదాయకమైన కథ..

కన్న బిడ్డ కోసం బతకాలని నిర్ణయించుకుంది. సమాజం సూటిపోటి మాటలతో ఎత్తిపొడుస్తున్నా అన్నింటినీ పంటి బిగువనే భరించింది. అదే సమయంలో పొట్ట కూటి కోసం నిమ్మకాయ సోడా, ఐస్ క్రీమ్ వంటివి అమ్మడం ప్రారంభించింది. అయితే సడన్ గా ఆమె పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్ గా కనిపించింది. అందరినీ ఒక్కసారిగా ఆశ్చర్యపరిచింది. అచ్చం సినిమా స్టోరీలా ఉండే ఈ కథ కేరళలో నిజంగానే జరిగింది. కేరళ పోలీసాఫీసర్ గా కొత్తగా విధుల్లో చేరిన ఈ ఒంటరి మహిళా కథ ఎందరికో స్ఫూర్తిదాయకంగా నిలిచింది. ఈ సందర్భంగా తన కథేంటో తెలుసుకుందామా...

శక్తివంతమైన పోలీసు..

శక్తివంతమైన పోలీసు..

కేరళకు చెందిన అనై(31) అనే మహిళ విజయవంతమైన స్టోరీ వింటే ఎవరికైనా జీవితంలో ఎన్ని కష్టాలు ఎదురైనా అధిగమించగలమనే నమ్మకం వస్తుంది. బిడ్డ పుట్టిన కొద్ది రోజులకే తన భర్త వదిలేయడంతో తన జీవితం ఆగిపోయిందని అనుకోలేదు. అందుకే ఆమె ఇప్పుడు శక్తివంతమైన మహిళా పోలీస్ అధికారిణిగా మారింది.

ఆత్మవిశ్వాసంతో..

ఆత్మవిశ్వాసంతో..

ఆ మహిళా ఎస్సై జీవితంలో ఎన్ని సమస్యలొచ్చినా ఆత్మవిశ్వాసం, పట్టుదలతో ఉన్నత శిఖరాలను అధిరోహించిన అనై శివ గురించి కేరళ పోలీసు విభాగం ట్విట్టర్లో వివరిస్తూ.. ప్రోబేషనరీ ఎస్సైగా డ్యూటీలో జాయిన్ అయిన ఆమెకు విషెస్ తెలిపింది.

6 నెలల శిశువుతో..

6 నెలల శిశువుతో..

తన భర్త, కుటుంబ సభ్యులను వదిలిపెట్టి ఆరు నెలల శిశువుతో నడిరోడ్డుపై ఒంటరిగా మిగిలిపోయిన ఆ 18 ఏళ్ల అమ్మాయి వర్కాలా పోలీసు స్టేషన్ కు బాస్ గా ఎంపికైంది. వర్కాలా పోలీస్ స్టేషన్లో ఎస్సైగా తనకు పోస్టింగ్ వచ్చిన విషయం తనకు కొద్ది రోజుల కిందే తెలిసిందని ఏఎస్ఐతో శివ అన్నారు.

కన్నీళ్లు పెట్టుకున్నా..

కన్నీళ్లు పెట్టుకున్నా..

నా బిడ్డతో ఆరోజుల్లో కన్నీళ్లు పెట్టుకున్నా ఎవ్వరూ కనికరించలేని ప్రదేశం ఇది అని భావోద్వేగానికి గురయ్యారు. వర్కాలా శివగిరి ఆశ్రమంలో నిమ్మరసం, ఐస్ క్రీమ్ లు, హస్తకళావస్తువులు అమ్ముకుంటూ వ్యాపారం చేస్తుంటే.. ఏదీ కలిసి రాలేదు.

ఓ వ్యక్తి సలహాతో..

ఓ వ్యక్తి సలహాతో..

అయితే ఇదే సమయంలో ఓ వ్యక్తి ఇచ్చిన సలహాతో డిగ్రీ చదువు పూర్తి చేశాను. పోలీసు అధికారి పరీక్షలు రాయమని ప్రోత్సహించాడు. తనే కొంత డబ్బు కూడా అప్పగా ఇచ్చాడు. అప్పటి నుండి కష్టపడి చదివాను అని ఆమె చెప్పారు. ఆ తర్వాత 18 నెలల శిక్షణ అనంతరం ఆమెకు వర్కలా పోలీసుస్టేషన్లో ప్రొబెషనరీ సబ్ ఇన్ స్పెక్టర్ గా పోస్టింగ్ వచ్చింది. చూశారు కదా.. ఒంటరి మహిళ విజయ గాధ.. ఇలాంటి కథలు విన్నప్పుడే మనలో ధైర్యం, ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. కాబట్టి చిన్న చిన్న విషయాలకే ఏడుస్తూ, నిరాశపడుతూ సమయం వేస్ట్ చేసుకోకుండా కష్టపడి ప్రయత్నించండి. కచ్చితంగా ఫలితం దక్కుతుంది.

All Images Credit to Twitter

English summary

The Inspiring Story Of A Kerala Woman Anie Siva Who Once Sold Lemonade & Is Now A Cop

The Inspiring Story Of A Kerala Woman Anie Siva Who Once Sold Lemonade & Is Now A Cop
Story first published:Friday, July 2, 2021, 17:36 [IST]
Desktop Bottom Promotion