For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

ఉమెన్స్ డే స్పెషల్ : ఇండియన్ ఆర్మీలో ఉమెన్స్ జర్నీకి నాంది పలికిందెవరో తెలుసా...

|

అప్పటికే అంతర్జాతీయంగా మహిళలందరూ అన్ని రంగాల్లో దూసుకుపోతున్నారు. మన దేశంలో కూడా 90వ దశకం నుండి మహిళలు అన్ని రంగాల్లో తమకంటూ ఓ గుర్తింపు తెచ్చుకోవడం ప్రారంభించారు.

అయితే వారికి అన్నింటిలో అవలీలగా ప్రవేశం లభించినప్పటికీ ఒకే ఒక్క దాంట్లో మాత్రం స్థానం దక్కలేదు. అది ఏదంటే భారత సైన్యమే. ఈ విషయమై డిగ్రీ పూర్తి చేసిన ప్రియా ఝింగన్ అనే మహిళ ఏకంగా నాటి సైనిక ప్రధాన అధికారికి లేఖ రాశారు. అందులో మహిళల ప్రవేశానికి భారత సైన్యంలో తలుపులు ఎప్పుడు తెరుస్తారని అడిగారు. ఇందుకు స్పందించిన నాటి జనరల్ సునీత్ త్వరలోనే ఆ దిశగా నిర్ణయం తీసుకుంటామని ఆమె లేఖకు సమాధానంగా ప్రత్యుత్తరం పంపించారు.

తస్మాత్ జాగ్రత్త! కేరళ నుండి కమ్ముకొస్తున్న కరోనా వైరస్.. దాని నుండి ఎలా తప్పించుకోవాలంటే...తస్మాత్ జాగ్రత్త! కేరళ నుండి కమ్ముకొస్తున్న కరోనా వైరస్.. దాని నుండి ఎలా తప్పించుకోవాలంటే...

ఆర్మీ చీఫ్ సంతకంతో..

ఆర్మీ చీఫ్ సంతకంతో..

భారత సైన్యం ప్రధాన అధికారి సంతకంతో వచ్చిన ఆ లేఖను ప్రియా ఝింగన్ అపురూపంగా దాచుకున్నారు. అప్పటికే తాను వేసుకున్న ప్లాన్లన్నింటినీ పక్కన పెట్టేశారు. ఎందుకంటే ఆ అధికారి చెప్పినట్లుగా సైనిక ప్రవేశాలలో మహిళలకు సంబంధించిన ప్రకటన వస్తుందనే నమ్మకం వల్ల. అంతే ఆమె అనుకున్నట్లుగానే సైన్యంలోకి మహిళలను ఆహ్వానిస్తూ, ఓ రోజు పత్రికల్లో ప్రకటన వచ్చేసింది. దీంతో ప్రియా కల నెరవేరింది.

పోలీస్ కావాలనుకున్నారట..

పోలీస్ కావాలనుకున్నారట..

1990 సంవత్సరంలోనే సాహసం అంటే ఇష్టపడే విద్యార్థినులు.. సాధారణంగా కిరణ్ బేడీని ఆదర్శంగా తీసుకునేవారు. లా చదివిన ప్రియా ఝింగన్ కూడా అప్పుడు అలాగే ఆలోచించేవారట. అయితే ఉన్నట్టుండి, ప్రియా శ్రద్ధ సైన్యంలో మహిళలకు ఎందుకు ప్రవేశం కల్పించడం లేదనే అంశం వైపు మళ్లిందట. అంతే అప్పటిదాకా తను పోలీసు అధికారి కావాలనుకున్న తను ఇండియన్ మిలిటరీలో చేరేలా చేశాయని ఆమె చెబుతోంది.

సైన్యంలో మహిళలే లేరా?

సైన్యంలో మహిళలే లేరా?

సైన్యంలో ప్రియా ఝింగన్ కు 001 నెంబర్ కేటాయించారట. అప్పటిదాకా మహిళలెవ్వరూ సైన్యంలో ఎవ్వరూ లేరా? అని ఆమె ఆశ్చర్యపోయారట. 1992లో సైనిక ప్రవేశాల ప్రకటనలో భాగంగా లా డిగ్రీ చేసిన వారికి రెండు సీట్లు కేటాయించారట. ఆ రెండింటిలో ఓ సీటును ఆమె ఖాతాలో వేసుకున్నారట.

పెళ్లికి ముందు ఏదైనా సాధ్యమేనట... కానీ పెళ్లి తర్వాత అన్నింటికీ కాంప్రమైజ్ కావాల్సిందేనట...పెళ్లికి ముందు ఏదైనా సాధ్యమేనట... కానీ పెళ్లి తర్వాత అన్నింటికీ కాంప్రమైజ్ కావాల్సిందేనట...

చెన్నైలో శిక్షణ..

చెన్నైలో శిక్షణ..

అలా భారత సైన్యంలో సీటు సంపాదించిన ఆమె చెన్నైలోని సైనిక శిక్షణ కళాశాలలో చేరిపోయారు. అలా తనకు ఇష్టమైన, తాను కోరుకున్న ఉద్యోగం, కష్టమైన శిక్షణను ఇష్టంగా ముగించిందట. ఆ తర్వాత భారత సైన్యంలోని జడ్జి అడ్వకేట్ జనరల్ (జేఏజీ) విభాగంలో విధుల్లో చేరిపోయారట. అలా భారత సైన్యంలో తొలి సైనికాధికారిగా ఆమె చరిత్రలో నిలిచిపోయారు.

అయితే మెడికల్ విభాగంలో..

అయితే మెడికల్ విభాగంలో..

భారత సైన్యంలో తొలి మహిళగా ప్రియా ఝింగన్ అడుగు పెట్టే సమయానికే మిలిటరీ మెడికల్ సర్వీసులో మహిళలు ఉండేవారట. అయితే వారంతా కేవలం వైద్యులు, నర్సుల విభాగంలో మాత్రమే ఉండేవారట. నర్సుల విభాగాన్ని పక్కనబెడితే, వైద్యుల విభాగంలో మహిళలు కేవలం వేళ్లమీద లెక్క పెట్టే సంఖ్యలో ఉండేవారట.

క్రమంగా సైన్యంలో..

క్రమంగా సైన్యంలో..

ప్రియా ఝింగన్ సైనిక శిక్షణను ముగించడంతో మహిళలు ఆ రంగంలోనే లేరనే బెంగ కూడా తీరిపోయింది. క్రమంగా సైన్యంలో మహిళలకు మెరుగైన ప్రాతినిధ్యం లభించింది.

<strong>'దేన్నైనా పుట్టించే శక్తి ఆడవారికే ఉంది'... మరి అలాంటోల్లే లేకపోతే...?</strong>'దేన్నైనా పుట్టించే శక్తి ఆడవారికే ఉంది'... మరి అలాంటోల్లే లేకపోతే...?

ఎలాంటి వేధింపులు లేవట..

ఎలాంటి వేధింపులు లేవట..

తన పదేళ్ల విధి నిర్వహణలో ప్రియా ఝింగన్ ఎలాంటి లైంగిక వేధింపులకు గురి కాలేదట. సైన్యం నుండి రిటైర్ అయిన తర్వాత కూడా తన బ్యాచ్ మేట్లతో సమాచార సంబంధాలు జరుపుతుండేదట. అయితే వారి మధ్య ఎన్నడూ ఈ తరహా విషయాల ప్రస్తావనే రాలేదట. అయితే ఓ సందర్భంలో తన గదిలోకి చొచ్చుకొచ్చేందుకు యత్నించిన ఓ సైనికుడిని సమర్థంగా ఎదుర్కొన్నానని తెలిపింది.

సైన్యం నుండి బహిష్కరణ..

సైన్యం నుండి బహిష్కరణ..

భారత సైన్యంలో అతను చేసిన తప్పుకు అతడిని సైన్యం నుండి బహిష్కరించారని చెప్పారు. ఈ తరహా వేధింపులకు పాల్పడే వారిపై సైన్యం వేగంగా చర్యలు తీసుకుంటుందని కూడా ప్రియా చెప్పారు.

మధుర క్షణాలను గుర్తు చేసుకుంటూ

మధుర క్షణాలను గుర్తు చేసుకుంటూ

ప్రియా ఝింగన్ రిటైర్ అయినప్పటికీ ఇంకా సైన్యంలో ఉన్నట్లుగానే భావించేవారట. తన శారీరక దారుఢ్యాన్ని కాపాడుకునేందుకు ప్రతిరోజూ 9 కిలోమీటర్ల వరకు నడక సాగించే వారట. సైన్యంలోని ఓ వ్యక్తిని వివాహం చేసుకున్న ఆమెకు ఓ కుమారుడు ఉన్నాడట.

All Images Credited to entertales

English summary

The Story of 1st Women to join the Indian Army Priya Jhingan

Here we talking about the story of 1st women to join the indian army priya jhingan. Read on