For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

Happy Birthday Sachin : క్రికెట్ దేవుని గురించి మనం నమ్మలేని నిజాలు...

క్రికెట్లో తన కంటూ చెరగని ముద్ర వేసుకున్న సచిన్ పుట్టినరోజు ఈరోజు(ఏప్రిల్ 24వ తేదీ). ఈ సందర్భంగా సచిన్ గురించి కొన్ని ఆసక్తికరమైన విషయాలను తెలుసుకుందాం.

|

మన దేశంలో 'ది గాడ్ ఆఫ్ క్రికెట్' అంటే అందరికీ టక్కున గుర్తొచ్చే పేరు సచిన్ టెండూల్కర్ ఒక్కటే. ఒకప్పుడు క్రికెట్ అంటే సచిన్, సచిన్ అంటేనే క్రికెట్ అనేంత స్థాయికి మైదానంలో తన ప్రదర్శన ద్వారా నిరూపించేవాడు.

Unknown Facts about Cricket God Sachin Tendulkar

16వ ఏటలోనే అంతర్జాతీయ క్రికెట్ లో అడుగుపెట్టిన సచిన్ టెండూల్కర్, పాకిస్థాన్ తో తొలి టెస్టు మ్యాచ్ ఆడాడు. ఆ మ్యాచ్ లో కేవలం 15 పరుగులు చేసి అవుటైన సచిన్, ఆ తర్వాత అంచెలంచెలుగా ఎదుగుతూ క్రికెట్లో ప్రపంచ రికార్డులన్నీ బద్దలు కొట్టాడు. అంతేకాదు ఇప్పటికీ అంతర్జాతీయ క్రికెట్లో అత్యధిక సెంచరీలు, పరుగులు మనోడివే.

Unknown Facts about Cricket God Sachin Tendulkar

ఇంతవరకు ఆయన రికార్డుల దరిదాపుల్లోకి కూడా ఎవ్వరూ రాలేకపోయారు. క్రికెట్లో తన కంటూ చెరగని ముద్ర వేసుకున్న సచిన్ పుట్టినరోజు ఈరోజు(ఏప్రిల్ 24వ తేదీ). ఈ సందర్భంగా సచిన్ గురించి కొన్ని ఆసక్తికరమైన విషయాలను తెలుసుకుందాం...

సచిన్ బాల్యం..

సచిన్ బాల్యం..

సచిన్ పూర్తి పేరు సచిన్ రమేష్ టెండూల్కర్. 1973లో ముంబైలోని సారస్వత బ్రహ్మాణ కుటుంబంలో రజనీ, రమేష్ దంపతులకు జన్మించారు. ఆయన తండ్రి మరాఠా నవల రచయిత. ఆయన తల్లి ఒక ఇన్సూరెన్స్ కంపెనీ ఏజెంటుగా పని చేస్తుండేవారు.

తన గురువు సలహా..

తన గురువు సలహా..

సచిన్ టెండూల్కర్ గురువు అయిన రమాకాంత్ ఇచ్చిన సలహా మేరకు శారదా ఆశ్రమ విద్యామందిర్ లోని ఉన్నత పాఠశాలలో చేరాడు. అక్కడ పేస్ బౌలింగులో ట్రైనింగ్ కోసం వెళితే అక్కడ అప్పటి ఫాస్ట్ బౌలర్ డెన్నిస్ లిల్లి అనే శిక్షకుడు సచిన్ కు బ్యాటింగ్ ఎక్కువ శ్రద్ధ పెట్టాలని సూచించాడట. దీంతో తను అప్పటి నుండి బ్యాటింగ్ పై ఫోకస్ పెట్టాడు.

చిన్నప్పుడే సెంచరీలు..

చిన్నప్పుడే సెంచరీలు..

అలా దులీప్ ట్రోఫీ, రంజీ ట్రోఫీ, ఇరానీ ట్రోఫీలలో ఆడిన తొలి మ్యాచుల్లోనే సెంచరీలు సాధించి కొత్త రికార్డులు నెలకొల్పాడు. అలా 1989వ సంవత్సరంలో 16వ ఏటలోనే అంతర్జాతీయ క్రికెట్లో.. అది కూడా పాకిస్థాన్ తో ఆడే ఛాన్స్ కొట్టేశాడు. తన తొలి వన్డే మ్యాచ్ ను కూడా అదే ఏడాది డిసెంబర్ లో పాకిస్తాన్ తోనే ఆడాడు.

1999 వరల్డ్ కప్ లో విషాదం..

1999 వరల్డ్ కప్ లో విషాదం..

1999 ప్రపంచ కప్ టోర్నీ ఆడే సమయంలో సచిన్ టెండూల్కర్ కుటుంబంలో విషాదం నెలకొంది. ఆ సమయంలో అకస్మాత్తుగా తన తండ్రి మరణ వార్తను తీవ్ర నిరాశకు గురయ్యాడు. తండ్రి అంత్యక్రియల కోసం భారత్ కు రావడంతో జింబాబ్వేతో ఆడే ఛాన్స్ కోల్పోయాడు. అయితే వెంటనే ఆ కార్యక్రమాన్ని ముగించుకుని కెన్యాతో జరిగిన మ్యాచ్ లో పాల్గొన్నాడు. అంతేకాదు అందులో 101 బంతుల్లోనే 140 పరుగులు చేసి ఆ సెంచరీని తన తండ్రికి అంకితమిచ్చిన గొప్ప ఆటగాడు.

షేన్ వార్న్ కలలో..

షేన్ వార్న్ కలలో..

సచిన్ టెండూల్కర్ గురించి మరో ఆసక్తికరమైన విషయమేమిటంటే.. ఆస్ట్రేలియాకు చెందిన అద్భుత స్పిన్నర్ షేన్ వార్న్ సచిన్ గురించి ఒక సందర్భంలో మాట్లాడుతూ తను రాత్రి వేళ నిద్రిస్తుంటే.. సచిన్ తన బ్యాటింగుతో అతనిని భయపెట్టాడని చెప్పాడు.

డబుల్ సెంచరీ కొట్టిన తొలి ఆటగాడు..

డబుల్ సెంచరీ కొట్టిన తొలి ఆటగాడు..

వన్డేలు, టెస్టు మ్యాచులలో అత్యధిక సెంచరీలు సాధించిన ఆటగాడిగా తనకంటూ చెరగని ముద్ర వేసుకున్నాడు. అంతేకాదు ఇంటర్నేషనల్ వన్డే క్రికెట్ లో కూడా డబుల్ సెంచరీ కొట్టిన తొలి ఆటగాడిగా చరిత్రపుటల్లోకెక్కాడు. అంతేకాదు అత్యధిక సార్లు మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్, మ్యాన్ ఆఫ్ ది సీరిస్ అందుకున్న బ్యాట్స్ మెన్ రికార్డులను నెలకొల్పాడు.

వ్యక్తిగతంగా లెఫ్ట్ హ్యాండ్..

వ్యక్తిగతంగా లెఫ్ట్ హ్యాండ్..

సచిన్ టెండూల్కర్ రైట్ హ్యాండ్ బ్యాట్స్ మెన్ అండ్ బౌలర్ అని మనందరికీ తెలుసు. అయితే తన చేతి రాతకు మాత్రం లెఫ్ట్ హ్యాండ్ ను ఉపయోగిస్తారు. ఈ విషయం అతికొద్ది మందికే తెలుసు. అలాగే సచిన్ క్రికెట్ పుస్తకంలో తనకంటూ ఓ పేజీని క్రియేట్ చేసి భావితరాలకు ఓ మార్గదర్శి అయ్యాడు.

సచిన్ వివాహం..

సచిన్ వివాహం..

90వ దశకంలో భారత క్రికెట్ ను, అభిమానులను ఉర్రూతలు ఊగించిన ఈ ఆటగాడు 1994-95వ సంవత్సరంలో గుజరాత్ రాష్ట్రానికి చెందిన పారిశ్రామికవేత్త ఆనంద్ మెహతా కూతురు అయిన అంజలిని పెళ్లి చేసుకున్నారు. వీరికి ఇద్దరు పిల్లలు కూడా జన్మించారు. వారి పేర్లు సారా టెండూల్కర్, అర్జున్ టెండూల్కర్.

English summary

Unknown Facts about Cricket God Sachin Tendulkar

Here we talking about unknown facts about cricket god sachin tendulkar. Read on
Desktop Bottom Promotion