For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

మిల్కా సింగ్ కు ‘ది ఫ్లయింగ్ సిక్కు’ అనే బిరుదు ఇచ్చిందెవరో తెలుసా...

|

ఒలింపిక్స్, కామన్వెల్త్, ఏషియన్ గేమ్స్ లో పరుగు పందేలతో, వరుసగా గోల్డ్ మెడల్స్ తో అంతర్జాతీయ స్థాయిలో భారతదేశ ప్రతిష్టను పెంచిన దిగ్గజం మిల్కా సింగ్. కరోనా వైరస్ మహమ్మారితో 91 ఏళ్ల వయసులో ఆయన తుదిశ్వాస విడిచారు.

ఈ సందర్భంగా క్రీడాలోకం, అభిమానులు, దేశం ఆయనకు ఘనంగా నివాళులు అర్పిస్తోంది. పంజాబీ కుటుంబంలో పుట్టిన పరుగుల దిగ్గజం మిల్కా సింగ్ చిన్నతనం నుండే పరుగెత్తడం నేర్చుకున్నాడు. ఢిల్లీకి వచ్చిన తర్వాత భారత సైన్యంలో చేరాడు.

ఆ తర్వాత సైన్యం కోసం పరుగెత్తాడు. మిల్కా సింగ్ కు పాకిస్థాన్ జనరల్ 'ఫ్లయింగ్ సిక్కు' అనే బిరుదును ప్రచారం చేశారు. మిల్కా సింగ్ తన లైఫ్ లో 80 రేసుల్లో మొత్తం 77 గెలుచుకున్నాడు. ఈ సందర్భంగా ఆయన గురించి కొన్ని ఆసక్తికరమైన విషయాలను తెలుసుకుందాం...

ఇండో-పాక్ విభజనలో..

ఇండో-పాక్ విభజనలో..

1929 నవంబర్ 20వ తేదీన గోవింద్ పుర(ప్రస్తుతం పాక్ లో ఉన్న పంజాబ్)లో పుట్టిన మిల్కా సింగ్ భారతదేశం, పాకిస్థాన్ విభజన సమయంలో తన తల్లిదండ్రులను కోల్పోయారు. అప్పటికీ మిల్కా సింగ్ వయసు కేవలం 12 సంవత్సరాలు. ఆ తర్వాత ఆయన పరుగెత్తడం ప్రారంభించాడు. అలా విభజన తర్వాత మిల్కా సింగ్ భారతదేశ నివాసి అయ్యాడు.

టికెట్ లేకుండా రైలు ప్రయాణం..

టికెట్ లేకుండా రైలు ప్రయాణం..

తన జీవితంలో ఒకసారి టికెట్ లేకుండా రైలులో ప్రయాణించాడు. ఆ సమయంలో పట్టుబడిన మిల్కా సింగ్ తీహార్ జైలుకు కూడా వెళ్లాడు. ఆ తర్వాత తన సోదరి నగలను విక్రయించి అక్కడి నుండి విడుదల అయ్యాడు.

మూడు సార్లు తిరస్కరణ..

మూడు సార్లు తిరస్కరణ..

మిల్కా సింగ్ భారత సైన్యంలో చేరాలని ఆకాంక్షించినప్పటికీ మూడుసార్లు తిరస్కరణకు గురయ్యారు. అయితే సోదరుని ప్రోత్సాహంతో నాలుగో ప్రయత్నంలో సక్సెస్ అయ్యాడు. నాలుగోసారి మిల్కా సింగ్ ఇంజనీరింగ్ విభాగంలో నమోదు చేసుకున్నాడు. ఆర్మీలో చేరిన తర్వాత మిల్కాసింగ్ వెనక్కి తిరిగి చూడకుండా ‘పరుగులు' తీశాడు.

టెక్నికల్ జవాన్ గా ప్రస్థానం..

టెక్నికల్ జవాన్ గా ప్రస్థానం..

ఆర్మీలో టెక్నికల్ జవాన్ గా మిల్కాసింగ్ ప్రస్థానం మొదలెట్టాడు. అయితే అక్కడి నుండే ఆయన రన్నింగ్ రేసులో పాల్గొనడం ప్రారంభించాడు. మన దేశంలో రన్నింగ్ లో ‘ట్రాక్ అండ్ ఫీల్డ్'ను పరిచయం చేసింది మిల్కా సింగే.

ట్రైనింగ్ సమయంలో..

ట్రైనింగ్ సమయంలో..

తన ప్రాక్టీస్ సమయంలో, మిల్కా సింగ్ నోటిలో మరియు మూత్రంలో రక్తం రావడం ప్రారంభమైంది. దీంతో అతను చాలా సార్లు మూర్చపోయాడు. దాదాపు మరణం అంచులదాకా వెళ్లాడు. అయితే తను మొక్కవోని ధైర్యంతో మళ్లీ లేచి నిలబడ్డాడు.

కామన్వెల్త్ క్రీడల్లో..

కామన్వెల్త్ క్రీడల్లో..

1958 ఆసియా క్రీడలలో మరియు కామన్వెల్త్ క్రీడల్లో మిల్కా సింగ్ 200 మీటర్లు, 400 మీటర్ల రేసును 46.16 సెకన్లు, 21.6 సెంటిమీటర్లను కేవలం 47 సెకన్లలోనే పూర్తి చేశాడు. దీంతో తనకు గోల్డ్ మెడల్ లభించింది. కామన్వెల్త్ క్రీడల్లోనూ తొలిసారి స్వర్ణ పతకం గెలిచిన తర్వాత.. తన విజయానికి గౌరవంగా దేశవ్యాప్త సెలవు ప్రకటించాలన్న మిల్కా సింగ్ విజ్ణప్తిని అప్పటి ప్రధాన మంత్రి జవహార్ లాల్ నెహ్రు సంతోషంగా అంగీకరించారు.

రోమ్ ప్రజలు..

రోమ్ ప్రజలు..

1960 సంవత్సరంలో రోమ్ ఒలింపిక్స్ సందర్భంగా బాగా ప్రాచుర్యం పొందారు. మిల్కా సింగ్ అప్పట్లో చాలా పొడవుగా, ఎక్కువ గడ్డంతో అందంగా ఉండేవాడు. అయితే ఆయనను రోమ్ లో ఎవ్వరూ ఇంత ప్రత్యేకమైన అథ్లెట్ ను ఎవ్వరూ చూడలేదు. అక్కడి ప్రజలు ఆయనను ఒక సాధువులా భావించారు. ఒక సాధువు ఇంత వేగంగా ఎలా నడుస్తారని ఆశ్చర్యపోయేవారట.

పాక్ రేసర్ ను ఓడించినప్పుడు..

పాక్ రేసర్ ను ఓడించినప్పుడు..

1962లో మిల్కా సింగ్ పాకిస్థాన్ వేగవంతమైన స్ప్రింటర్ అబ్దుక్ ఖాలిక్ ను ఓడించాడు. అప్పుడే పాకిస్థాన్ జనరల్ తనకు ‘ది ఫ్లయింగ్ సిక్కు'అనే బిరుదున ఇచ్చారు. ఆయన పేరు అయూబ్ ఖాన్.

అర్జున అవార్డు తిరస్కరణ..

అర్జున అవార్డు తిరస్కరణ..

2001వ సంవత్సరంలో భారత దేశ ప్రభుత్వం మిల్కా సింగ్ కు అర్జున అవార్డు ప్రకటించగా.. ‘40 ఏళ్లు ఆలస్యమైంద'ని పేర్కొంటూ దాన్ని తిరస్కరించారు. ఆయన తన పతకాలన్నింటినీ దేశానికే దానం చేసేశాడు. ముందుగా ఢిల్లీ నెహ్రూ స్టేడియంలో ప్రదర్శనకు ఉంచిన వాటిని తర్వాత పటియాలలోని క్రీడా మ్యూజియానికి తరలించారు. 1999 సంవత్సరంలో కార్గిల్ వార్ లో అమరుడైన బిక్రమ్ సింగ్ ఏడేళ్ల కొడుకును మిల్కాసింగ్ దత్తత తీసుకున్నాడు.

మిల్కాసింగ్ మూవీ..

మిల్కాసింగ్ మూవీ..

మిల్కా సింగ్ తన కూతురు సోనియా సాన్వాకాతో కలిసి ఆత్మకథ ‘ది రేస్ ఆఫ్ మై లైఫ్' రాసుకున్నాడు. ఈ పుస్తకం ఆధారంగానే బాలీవుడ్ డైరెక్టర్ రాకేష్ మెహ్రా, ఫర్హాన్ అక్తర్ తో ‘భాగ్ మిల్కా భాగ్' అనే మూవీ తీశాడు. అయితే ఈ సినిమా కోసం తన బయోపిక్ హక్కుల్ని కేవలం ఒక్క రూపాయికే ఇచ్చేసి ఆశ్చర్యపరిచాడు. అయితే సినిమాకొచ్చే లాభాల్లో కొంత వాటాను పేద క్రీడాకారుల కోసం నెలకొల్పిన మిల్కా సింగ్ ఛారిటబుల్ ట్రస్టుకు ఇవ్వాలనే షరతు పెట్టాడనే విషయం తర్వాత వెలుగులోకి వచ్చింది.

English summary

Unknown Facts About Milka Singh in Telugu

Here are the unknown facts about milka singh in telugu. Have a look
Story first published: Saturday, June 19, 2021, 10:57 [IST]