Latest Updates
-
ఆఫీస్ బ్యాగ్‌తో ఈ పొరపాట్లు.. మీ జేబును ఖాళీ చేస్తాయంటే నమ్ముతారా.? -
బిర్యానీ రుచిని తలదన్నే కొబ్బరి పాల మటన్ పులావ్.. సండే స్పెషల్ అదిరిపోవాల్సిందే.! -
మూత్రంలో మంటతో పాటు విపరీతమైన జ్వరం.. నిర్లక్ష్యం చేస్తే ఈ పార్ట్‌కి ముప్పు తప్పదు.! -
'పోషకాల నిధి' పొట్టు మినప్పప్పు ఆవిరి కుడుములు.. ఒక్కటి తిన్నా రోజంతా ఎనర్జీ.! -
విపరీత రాజయోగం: అక్టోబర్ 31 వరకు ఈ రాశుల వారిపై గురు కటాక్షంతో ఎనలేని కీర్తి, సంపద.! -
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్‌కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.! -
రసం, సాంబార్ రుచిని మరిపించే కేరళ స్టైల్ ఉల్లిపాయ పులుసు.. అన్నంలోకి అదరహో.! -
పుస్తక జ్ఞానం ఒక్కటే కాదు.. గురువుల నుంచి నేర్చుకోవాల్సిన జీవిత పాఠాలు ఇవే.! -
గర్భిణీలకు బలాన్ని ఇచ్చే ఫుడ్.. మధ్యాహ్నం హడావుడి లేకుండా ఈజీగా చేసుకునే టేస్టీ డిష్.!
ACని ఇలా వాడితే కరెంట్ బిల్లు చాలా తక్కువ వస్తుంది.. లైఫ్ టైం కూడా పెరుగుతుంది!
వేసవి రాగానే ఎండలు మండిపోతూ, ఉష్ణోగ్రతలు ఆకాశాన్ని తాకుతాయి. ఈ వేడి నుంచి ఉపశమనం పొందేందుకు చాలామంది ఎయిర్ కండిషనర్ల (AC) పై ఆధారపడతారు. అయితే, AC వాడకం పెరిగితే విద్యుత్ బిల్లులు కూడా పెరగడం సహజం. అయితే కొన్ని చిట్కాలు పాటించడంతో బిల్లుల భారం తగ్గించుకోవచ్చు. ఆ చిట్కాలు ఏంటి? వాటిని ఏ విధంగా పాటించాలి అనేది ఈ స్టోరీలో తెలుసుకుందాం.
1. వాడకంలో లేనప్పుడు ACను పూర్తిగా ఆఫ్ చేయండి
చాలామంది రిమోట్‌తో మాత్రమే ACని ఆఫ్ చేస్తారు. కానీ ఈ స్థితిలో కొన్ని భాగాలు, ముఖ్యంగా కంప్రెసర్ విద్యుత్‌ను అలానే వినియోగించే అవకాశం ఉంది. అందుకే, AC వాడకంలో లేనప్పుడు ప్లగ్‌ని తీయడం లేదా మేయిన్ స్విచ్ ఆఫ్ చేయడం మంచిది. దీని వల్ల అనవసర విద్యుత్ వినియోగం తగ్గడమే కాదు, AC జీవితకాలం కూడా పెరుగుతుంది.

2. సరైన ఉష్ణోగ్రత సెట్టింగ్‌ను ఎంచుకోండి
ACని 18°C - 20°Cకి సెట్ చేస్తే గది త్వరగా చల్లబడుతుంది అనుకోవచ్చు. కానీ ఇది విద్యుత్ వినియోగాన్ని గణనీయంగా పెంచుతుంది. అసలు విషయమేంటంటే, 24°C వద్ద ACని సెట్ చేస్తే శరీరానికి అనుకూలంగా ఉండటమే కాదు, విద్యుత్ వినియోగం కూడా తగ్గుతుంది. ఇది ఇంటర్నేషనల్ ఎనర్జీ ఏజెన్సీ సిఫారసు చేసిన టెంపరేచర్.
3. గదిలో వేడి గాలి ప్రవేశించకుండా జాగ్రత్తలు
AC ఎంత సమర్థంగా పనిచేసినా, గదిలోకి వెలుపలి వేడి గాలి లోపలికి ప్రవేశిస్తే శ్రమ వృథా అవుతుంది. గది తలుపులు, కిటికీలు పూర్తిగా మూసి ఉండాలి. అదనంగా, గదిలో మందపాటి కర్టెన్లు ఉపయోగించటం వల్ల వెలుపల నుండి వచ్చే వేడి కాంతిని అడ్డుకోవచ్చు. ఈ చిన్న జాగ్రత్త AC పై వచ్చే లోడ్‌ను తగ్గిస్తుంది.
4. ఫ్యాన్ ఉపయోగంతో గాలి ప్రసరణ మెరుగుపరచండి
ACతో పాటు ఫ్యాన్‌ను నడిపించడం వల్ల గదిలో చల్లదనం సమానంగా వ్యాపిస్తుంది. ఫ్యాన్ ACపై భారం తగ్గించడంతో విద్యుత్ వినియోగం తగ్గుతుంది.
5. సమయానుసారంగా సర్వీసింగ్ చేయండి
కొత్తగా AC కొనేవారికి "ఇప్పుడు ఏమీ తక్కువవుతుందిలే!" అన్న భ్రమ ఉండొచ్చు. కానీ వాస్తవంగా, వాతావరణంలో ఉండే దుమ్ము, ధూళి కారణంగా AC లోపల ఫిల్టర్లు మూసుకుపోతాయి. దీని వల్ల యంత్రం పనితీరు మందగిస్తుంది. కనీసం సంవత్సరానికి రెండుసార్లు సర్వీసింగ్ చేయడం వల్ల AC శుభ్రంగా ఉండి సమర్థవంతంగా పనిచేస్తుంది. దీని వల్ల విద్యుత్ వినియోగం కూడా తగ్గుతుంది.
6. ఇన్వర్టర్ ACలు, ఎనర్జీ స్టార్ రేటింగ్ ఉన్నవి ఎంపిక చేయండి
కొత్తగా AC కొనాలని ప్లాన్ చేస్తున్నవారు ఇన్వర్టర్ టెక్నాలజీతో వచ్చిన ACలను ఎంపికచేయడం మంచిది. ఇవి గది ఉష్ణోగ్రతను ఒక స్థిర స్థాయిలో ఉంచుతాయి, తద్వారా ఎక్కువ విద్యుత్ ఆదా అవుతుంది. అలాగే, 3 లేదా 5 స్టార్ ఎనర్జీ రేటింగ్ ఉన్న యంత్రాలు తక్కువ విద్యుత్ వాడతాయి.
7. టైమర్, ఈకో మోడ్ లాంటి ఫీచర్లను వినియోగించండి
ఒకసారి గది చల్లబడిన తర్వాత కూడా AC నడుస్తుండటం విద్యుత్ వృథా చేస్తుంది. అందుకే టైమర్ సెట్టింగ్స్, ఈకో మోడ్ లాంటి ఫీచర్లను సద్వినియోగం చేసుకోండి. ఇవి సమయానికి AC ఆఫ్ అవ్వడానికి సహాయపడతాయి. ఈ సూచనలు పాటించడం వల్ల వేసవి వేడిలో తక్కువ ఖర్చుతో చల్లదనాన్ని అనుభవించవచ్చు. ఈ వేసవిలో చాకచక్యంగా వ్యవహరిస్తూ, కూల్‌గా జీవించండి!



Click it and Unblock the Notifications