For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

Vernal Equinox 2022:ఈ ఏడాదిలో పగలు, రాత్రి ఒకేలా ఎప్పుడు కనిపిస్తాయో తెలుసా...

వసంత విషువత్తు 2022 సందర్భంగా ఏ సమయంలో వసంత కాలం వస్తుంది, విషువత్తు అంటే ఏమిటి అనే వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం.

|

వాతావరణంలో మార్పు రావడానికి సూర్య గ్రహమే ప్రధాన కారణమన్న విషయం మనందరికీ తెలిసిందే. సౌర వ్యవస్థలో, సూర్యుడు దాని స్థిర కక్ష్య చుట్టూ తిరుగుతుంది. అయితే భూమి సూర్యుని చుట్టూ తిరుగుతుంది.

Vernal Equinox : When Is Spring Equinox? What It Means For You And Your Planet in Telugu

ఈ రెండు గ్రహాల స్థానాలను బట్టి వాతావరణం మారుతూ ఉంటుంది. ఈ నేపథ్యంలోనే భూమి యొక్క భూమధ్య రేఖ సూర్యునికి ఎదురుగా ఉన్న సమయాన్ని విషువత్తు అంటారు. ఈ సమయంలో పగలు మరియు రాత్రి సమానంగా ఉంటుంది.

Vernal Equinox : When Is Spring Equinox? What It Means For You And Your Planet in Telugu

సాధారణంగా ప్రతి సంవత్సరం ఇలా రెండుసార్లు జరుగుతుంది. సాధారణంగా మార్చి 21వ తేదీన మరియు సెప్టెంబర్ 23వ తేదీన విషువత్తు తర్వాత మాత్రమే వాతావరణం మారుతుంది. సాధారణంగా, ఉత్తర అర్ధగోళంలో శరద్రుతువు విషువత్తు సెప్టెంబర్ మాసంలో సంభవిస్తుంది. దీని స్థానం భూమి యొక్క కక్ష్య ద్వారా నిర్ణయించబడుతుంది. దీని ప్రతి సంవత్సరం కొంచెం భిన్నంగా ఉండొచ్చు. ఈ ఏడాది విషువత్తు మార్చి 20వ తేదీన అంటే ఆదివారం నాడు వచ్చింది. ఈ సందర్భంగా విషువత్తు అంటే ఏమిటి? దాని ప్రాముఖ్యత గురించి ఇప్పుడు తెలుసుకుందా...

International Day of Happiness 2022: సంతోషమే సగం బలం.. ఆందోళనలను అధిగమిద్దాం..International Day of Happiness 2022: సంతోషమే సగం బలం.. ఆందోళనలను అధిగమిద్దాం..

విషువత్తు అంటే ఏమిటి?

విషువత్తు అంటే ఏమిటి?

విషువత్తు అనేది ఖగోళ సంఘటన, భూమి యొక్క భూమధ్య రేఖ సూర్యుని మార్గం మధ్యలో నేరుగా వెళ్తున్న సమయాన్ని సూచిస్తుంది. మీరు ఈరోజున భూమధ్యరేఖ నుండి సూర్యుడిని చూస్తే, అది సిద్ధాంతపరంగా ఎల్లప్పుడూ తూర్పున ఉదయిస్తుంది. పడమర దిక్కులో అస్తమిస్తుంది. సంవత్సరంలో రెండు తేదీల్లో ఉత్తర మరియు దక్షిణ అర్థగోళాలు రెండూ సూర్య కిరణాలను సమానంగా పంచుకుంటాయి. ఈరోజున రాత్రి మరియు పగలు, 24 గంటల పాటు, దాదాపు సమానంగా ఉంటుంది. విషువత్తు అనే పేరు లాటిన్ ఎక్వస్ నుండి వచ్చింది.

ఉత్తర అర్థగోళంలోకి ప్రవేశం..

ఉత్తర అర్థగోళంలోకి ప్రవేశం..

ఉత్తర అర్థగోళంలో మార్చి విషువత్తు ఖగోళ వసంతం ప్రారంభాన్ని సూచిస్తుంది. ఇది ప్రపంచ వ్యాప్తంగా ఒక గ్లోబల్ ఈవెంట్. ఇది నిర్దిష్ట సమయం మధ్యాహ్నం 3:33 గంటలకు అధికారికంగా ఉంటుంది. అయితే యూకేలో ఉదయం 8:33 గంటలకు నుండి 11:33 గంటల మధ్యన ప్రారంభమవుతుంది. మిగిలిన దేశాల్లో మధ్యాహ్నం 3:33 గంటలకు వస్తుంది. ఈ ఉత్తర అర్థగోళం, అయనాంతం వరకు జూన్ 21, 2022 మంగళవారం వరకు కొనసాగుతుంది.

విషువత్తు ఎలా..

విషువత్తు ఎలా..

ఇది భూమి, సూర్యుడికి సంబంధించి 23.5 డిగ్రీల వంపు ఉన్న అక్షం మీద తిరుగుతుంది. సూర్యోదయం మరియు సూర్యస్తమయాల సమయాలను మరియు పగలు, రాత్రి పొడవును సూచిస్తుంది. అయితే విషువత్తు వేళ అంటే ఆదివారం రోజున భూమి యొక్క అక్షం సూర్యుడికి ఎదురుగా ఉంటుంది. కాబట్టి ఉత్తరం మరియు దక్షిణ అర్థ గోళాలు రెండూ సమాన రెండూ సమాన సమయం వరకు సూర్యరశ్మిని పొందుతాయి. దీని తర్వాత సెప్టెంబర్ 23వ తేదీన 2022న అంటే శుక్రవారం నాడు విషువత్తు పతనం అవుతుంది.

విషువత్తును చూడొచ్చా?

విషువత్తును చూడొచ్చా?

ఖగోళ శాస్త్రం ప్రకారం, భూమధ్య రేఖ-సూర్యుడు విషువత్తు వద్ద దాటుతుంది. కాబట్టి మీరు ఆకాశంలో అసలు సంఘటనను చూడలేరు. ఈ విషువత్తులు వాతావరణంలో మార్పును గుర్తించడమే కాకుండా అవి ఇతర ప్రాముఖ్యతను కూడా కలిగి ఉంటాయి. అయితే ఆదివారం రోజున సూర్యోదయం లేదా సూర్యస్తమయాన్ని చూడటం చూడొచ్చు. అయితే మధ్యాహ్నం వేళ సూర్యుడిని చూడకూడదు. అదేవిధంగా సూర్యుడిని స్పష్టంగా, తదేకంగా చూడకూడదని గుర్తుంచుకోండి.

FAQ's
  • 2022లో వసంత విషువత్తు ఎప్పుడొచ్చింది? పగలు, రాత్రి ఎప్పుడు ఒకేలా ఉంటుంది?

    సౌర వ్యవస్థలో, సూర్యుడు దాని స్థిర కక్ష్య చుట్టూ తిరుగుతుంది. అయితే భూమి సూర్యుని చుట్టూ తిరుగుతుంది. ఈ రెండు గ్రహాల స్థానాలను బట్టి వాతావరణం మారుతూ ఉంటుంది. ఈ నేపథ్యంలోనే భూమి యొక్క భూమధ్య రేఖ సూర్యునికి ఎదురుగా ఉన్న సమయాన్ని విషువత్తు అంటారు. ఈ సమయంలో పగలు మరియు రాత్రి సమానంగా ఉంటుంది. సాధారణంగా ప్రతి సంవత్సరం ఇలా రెండుసార్లు జరుగుతుంది. సాధారణంగా మార్చి 21వ తేదీన మరియు సెప్టెంబర్ 23వ తేదీన విషువత్తు తర్వాత మాత్రమే వాతావరణం మారుతుంది. అయితే ఈ ఏడాది విషువత్తు మార్చి 20వ తేదీన అంటే ఆదివారం నాడు వచ్చింది.

English summary

Vernal Equinox : When Is Spring Equinox? What It Means For You And Your Planet in Telugu

Here we are talking about the vernal equinox 2022:When is Spring Equinox? What it means for you and Your planet in Telugu. Read on
Story first published:Saturday, March 19, 2022, 17:26 [IST]
Desktop Bottom Promotion