For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

Who Is Anil Menon:నాసా కొత్త టీంలో చేరిన అనిల్ మీనన్ ఎవరు? అక్కడ తనకెలా అవకాశమొచ్చిందంటే...

నాసాకు ఎంపికై భారత సంతతి వ్యక్తి అనిల్ మీనన్ అరుదైన ఘనత సాధించారు..కొత్త ఆస్ట్రోనాట్ గా రికార్డు నెలకొల్పారు.

|

అంతరిక్షంలో అద్భుతమైన ప్రయోగాలు చేసే సంస్థ ఏదైనా ఉందంటే అందరికీ టక్కున గుర్తొచ్చే పేరు నాసా. ప్రపంచంలోనే ఇది అత్యున్నత అంతరిక్ష ప్రయోగాలు చేస్తుందని చాలా మంది అభిప్రాయం. ఇది అమెరికాకు చెందిన స్పేస్ ఏజెన్సీ. అందుకే ఈ నాసాలో పని చేసేందుకు ప్రపంచంలోని శాస్త్రవేత్తలు, పరిశోధకులు ఎంతో ఆసక్తి చూపుతుంటారు.

Who Is Anil Menon? Know All About NASAs Latest Recruit for Future Moon Mission in Telugu

అదే సమయంలో ప్రతిభ ఉందంటే చాలు వారికి అవకాశాలు ఇవ్వడంలో నాసా ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటుంది. ఇటీవలే మన తెలుగమ్మాయి శిరీష బండ్ల అమెరికా నాసాలో ఆస్ట్రోనాట్ లో చోటు సంపాదించిన మన తెలుగు ఖ్యాతిని ప్రపంచవ్యాప్తంగా ఉన్నత శిఖరాలకు చేర్చడంలో కీలక పాత్ర పోషించారు. ఇప్పుడు తాజాగా మరో కొత్త ఆస్ట్రో నాట్ టీమ్ ను నాసా ప్రకటించింది. అందులో భారత సంతతి వ్యక్తి అనిల్ మీనన్ అనే వ్యక్తి చోటు సంపాదించారు.

నాసా భవిష్యత్తు మిషన్లలో పాల్గొనేందుకు కొందరు సభ్యులను ఎంపిక చేసుకుంది. ఇందుకోసం పన్నెండు వేల మంది దరఖాస్తు చేసుకోగా.. వారిలో కేవలం పది మందిని మాత్రమే ఫైనల్ చేసింది. కొత్తగా పది మందితో కూడిన ఆస్ట్రోనాట్(వ్యోమగామి) టీమ్ ను ప్రకటించింది. ఈ విషయాన్ని ట్విట్టర్ ద్వారా షేర్ చేసుకుంది. అయితే ఇదే టీమ్ లో భారత సంతతి వ్యక్తి అనిల్ మీనన్ కు చోటు దక్కడం విశేషం. ఇంతకీ అనిల్ మీనన్ ఎవరు? ఆయన నేపథ్యం ఏంటీ.. తనకు ఇంత గొప్ప అవకాశం ఎలా దక్కందనే ఆసక్తికరమైన విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం...

అనిల్ మీనన్ ఎవరంటే..
అనిల్ మీనన్, ఒక భారతీయ వలసదారుని కుమారుడు. ఈయన మిన్నెసోటాలోని మిన్నియాపాలిస్ లో పుట్టి పెరిగాడు. 45 సంవత్సరాల లెఫ్టినెట్ కల్నల్, స్పేస్ ఎక్స్ ఉద్యోగి అన్నా మీనన్ ను పెళ్లి చేసుకున్నారు. తనకు ఇద్దరు పిల్లలు ఉన్నారు. తను 'డెమో-2' మిషన్ సమయంలో ఎలోన్ మస్క్ యొక్క స్పేస్ ఎక్స్ మానవులకు అంతరిక్షంలోకి తీసుకురావడంలో సహాయం చేశాడు. భవిష్యత్తులోనూ మిషన్ల సమయంలో మానవ వ్యవస్థకు మద్దతుగా ఒక సంస్థను డెవలప్ చేశాడు. మీనన్ వైమానిక దళంలో 45వ స్పేస్ వింగ్ మరియు 173వ ఫైటర్ వింగ్ కు ఫ్లైట్ సర్జన్ గా పని చేశాడు. తను ఎఫ్-15 ఫైటర్ జెట్లో వందలాది సార్లు ప్రయాణించాడు. క్లిష్ట పరిస్థితుల్లో ఎయిర్ ట్రాన్స్ పోర్ట్ టీమ్ లో భాగంగా 100 మందికి పైగా రోగులను సురక్షితంగా తీసుకొచ్చారు.

అనిల్ మీనన్ విద్యాభ్యాసం..
అనిల్ మీన్ స్టాన్ ఫోర్డ్ విద్యాసంస్థల్లో ఇంజనీరింగ్ అండ్ మెడిసిన్లో పట్టభద్రుడయ్యాడు. కాలిఫోర్నియాలోని సిలికాన్ వ్యాలీలోని నాసా అమెస్ రీసెర్చ్ సెంటర్లో సాఫ్ట్ టిష్యూ మోడళ్లను కోడింగ్ చేయడంలో పని చేశాడు. 2010 సంవత్సరంలో వచ్చిన హైతీ భూకంపం, 2015 నేపాల్ భూకంప సమయంలో, 2011 రెనో ఎయిర్ షో ప్రమాద సమయంలో ముందుగా స్పందించింది ఈయనే.

ఫ్లయిట్ సర్జన్ గా..
అనిల్ మీనన్ ఫ్లయిట్ సర్జన్ గా 2014 సంవత్సరం నుండి విధులు నిర్వర్తిస్తున్నారు.
అంతర్జాతీయ స్పేస్ స్టేషన్లో డిప్యూటీ క్రూ సర్జన్ గా కూడా సేవలందించారు. ఆ తర్వాత 2018లో స్పేస్ ఎక్స్ లో చేరిన అనిల్ కంపెనీ ఫస్ట్ హ్యూమన్ ఫ్లైట్ ప్రిపరేషన్లో భాగస్వామయ్యారు. ఇప్పుడు నాసాలో భవిష్యత్తులో చేపట్టబోయే మిషన్లలో పాలుపంచుకోనున్నాడు. ఈ నేపథ్యంలోనే నాసా పరిపాలనా విభాగాధిపతి బిల నెల్సన్.. ఆస్ట్రోనాట్ టీమ్ ను స్వయంగా ప్రకటించారు. వీరికి ఐదు కేటగీరీల్లో ట్రైనింగ్ ఇప్పిస్తారు. స్పేస్ స్టేషన్లో సంక్లిష్ట సమస్యల పరిష్కారం, స్పేస్ వాక్ ట్రైనింగ్, క్రిటికల్ రోబోటిక్ స్కిల్స్ డెవలప్ చేసుకోవడం, టి-38 ట్రైనింగ్ జెట్ ను సురక్షితంగా ఎలా నడపాలి.. చివరగా రష్యన్ లాంగ్వేజ్ స్కిల్స్ శిక్షణను ఇస్తారు. అనంతరం 2022లో జనవరిలో అనిల్ మీనన్ నాసా టీమ్ లో చేరి ట్రైనింగ్ తీసుకోనున్నారు.

English summary

Who Is Anil Menon? Know All About NASA's Latest Recruit for Future Moon Mission in Telugu

Anil Menon, an Indian-origin lieutenant colonel in United States Air Force and SpaceX's first flight surgeon, was Latest Recruit for Future Moon Mission. Know more
Story first published:Wednesday, December 8, 2021, 15:10 [IST]
Desktop Bottom Promotion