For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

Droupadi Murmu:ద్రౌపది ముర్ము ఎవరు? క్లర్క్ నుండి అధ్యక్ష అభ్యర్థి వరకు ఆమె ప్రస్థానమిలా...

|

ప్రస్తుత రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ పదవీ కాలం త్వరలో ముగియనుండటంతో కొత్త అభ్యర్థి కోసం అన్ని పార్టీలు తీవ్రంగా అన్వేషించాయి. ఈ నేపథ్యంలోనే విపక్షాలు యశ్వంత్ సిన్హాను రాష్ట్రపతి అభ్యర్థిగా నిర్ణయించాయి. అయితే అధికార ఎన్డీయే ప్రభుత్వం ఈ విషయంలో చాలా వ్యూహాత్మకంగా వ్యవహరించింది.

Who Is Draupadi Murmu? Here Is Everything You Need to Know About Presidential Candidate in Telugu

చివరి వరకు రాష్ట్రపతి అభ్యర్థి విషయంలో సీక్రెట్ గా వ్యవహరిస్తూ వచ్చింది. అందరూ ప్రస్తుత ఉపరాష్ట్రపతి, తెలుగు బిడ్డకే అవకాశం వస్తుందని అందరూ ఊహించారు. అయితే అందరి అంచనాలను తలకిందులు చేస్తూ బిజెపి తమ అభ్యర్థిని ప్రకటించింది. ఒడిశా రాష్ట్రానికి చెందిన ఎస్టీ మహిళ ద్రౌపది ముర్మును తమ అభ్యర్థిగా ప్రకటించింది. ఆమె జార్ఖండ్ రాష్ట్ర తొలి మహిళా గవర్నర్ గా పని చేశారు. అంతేకాదు తను మంత్రిగా కూడా పని చేశారు. త్వరలో జరగబోయే అధ్యక్ష ఎన్నికలో ఆమె విజయం సాధిస్తే, తొలి గిరిజన మహిళ మన దేశానికి అధ్యక్షురాలు కానున్నారు. ఈ సందర్భంగా ద్రౌపది ముర్ము ఎవరు? తన రాజకీయ ప్రయాణం గురించి కొన్ని ఆసక్తికరమైన విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం...

ద్రౌపది బాల్యం..

ద్రౌపది ముర్ము 20 జూన్ 1958 సంవత్సరంలో ఒడిశాలోని మయూర్ గంజ్ జిల్లా బైద్పోసి గ్రామంలో జన్మించారు. తన తండ్రి పేరు బిరంచి నారాయణ్ తుడు. వారు సంతాల్ అనే గిరిజన జాతికి చెందిన వారు. ద్రౌపది తన సొంత జిల్లాలోనే ప్రాథమిక విద్యను పూర్తి చేశారు. అనంతరం భువనేశ్వర్ లోని రమాదేవి మహిళా మహా విశ్వవిద్యాలయంలో బ్యాచిలర్ డిగ్రీ పట్టా పొందారు. చదువు పూర్తయిన అనంతరం కెరీర్ ప్రారంభించి ఈ రంగంలో కొంతకాలం పని చేశారు.

నీటి పారుదల, విద్యుత్ శాఖలో..

ద్రౌపది ముర్ము 1979 నుండి 1983 వరకు నీటిపారుదల మరియు విద్యుత్ శాఖలో జూనియర్ అసిస్టెంట్ గా పని చేశారు. 1994 నుండి 1997 వరకు తను రాయంగ్ పూర్ లోని శ్రీ అరబిందో ఇంటిగ్రల్ ఎడ్యుకేషన్ సెంటర్లో గౌరవ సహాయ ఉపాధ్యాయినిగా కూడా పని చేశారు.

భర్త, ఇద్దరు కుమారులను కోల్పోయారు..

ద్రౌపది ముర్ముని శ్యామ్ చరణ్ ముర్మును వివాహం చేసుకున్నారు. తనకు ఇద్దరు కుమారులు మరియు ఒక కుమార్తె ఉన్నారు. అయితే వివాహం అయిన కొన్ని సంవత్సరాలకే తన భర్తను, ఇద్దరు కుమారులను అకస్మాత్తుగా కోల్పోయారు. ఆ తర్వాత తల్లి ఉద్యోగం ద్వారా వచ్చిన ఆదాయంతోనే ఇంటి ఖర్చులను చూసుకుంది. అలాగే తన కుమార్తె ఇతి ముర్ముని చదివించారు. కూతురికి కాలేజీ తర్వాత బ్యాంకులో ఉద్యోగం లభించింది. ఇప్పుడు ఆమె తన వైవాహిక జీవితం సంతోషంగా ఉంది.

కౌన్సిలర్ గా ప్రస్థానం ప్రారంభం..

ద్రౌపది ముర్ము 1997లో ఒడిశాలోని రాయరంగ్ పూర్ నగర పంచాయతీలో కౌన్సిలర్ గా తన రాజకీయ జీవితాన్ని ప్రారంభించారు. అనంతరం 2000 సంవత్సరంలో ఒడిశా ప్రభుత్వంలో ఎమ్మెల్యేగా విజయం సాధించారు. ఒడిశాలోని బిజెడి, బిజెపి సంకీర్ణ ప్రభుత్వంలోనూ తను మంత్రిగా పని చేశారు. మార్చి 2000 నుండి 2004 గంటల వరకు రాష్ట్ర వాణిజ్య మరియు రవాణా, చేపలు, జంతు వనరుల అభివ్రుద్ధి శాఖ మంత్రిగా పని చేశారు. 2007లో ద్రౌపది ఒడిశా శాసనసభ ఉత్తమ ఎమ్మెల్యే అవార్డును అందుకున్నారు.

తొలి మహిళా గవర్నర్..

జార్ఖండ్ రాష్ట్రానికి తొలి మహిళా గవర్నర్ కూడా ఎంపికై ద్రౌపది ముర్ము రికార్డు నెలకొల్పారు. అంతేకాదు, 2000 సంవత్సరంలో జార్ఖండ్ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఐదు సంవత్సరాల పదవీకాలాన్ని పూర్తి చేసిన జార్ఖండ్ తొలి గవర్నర్. తను 2015 నుండి 2021 వరకు జార్ఖండ్ గవర్నర్ గా పని చేశారు. ఇప్పుడు భారత రాష్ట్రపతి ఎన్నికల్లో గెలిస్తే, తను తొలి గిరిజన అధ్యక్షురాలు అవుతుంది. ఆమె గెలిస్తే ఒడిశా రాష్ట్రం నుంచి దేశంలోనే అత్యున్నత పదవికి చేరిన తొలి వ్యక్తిగా నిలుస్తారు.

English summary

Draupadi murmu is 15th president of india : Who Is Droupadi Murmu? Here Is Everything You Need to Know About Presidential Candidate in Telugu

Droupadi Murmu was Jharkhands first female governor. She was also the first Odia woman and tribal leader to be named governor of an Indian state Heres all you need to know about Droupadi Murmu
Desktop Bottom Promotion