For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

#HimaDas: హిమదాస్ ఎవరు? ఇంత చిన్న వయసులో డిఎస్పీ ఎలా అయ్యిందో తెలుసా...

పరుగుపందెంలో హిమదాస్ సాధించిన ఘనతకు గొప్ప గౌరవం దక్కింది.

|

భారత స్టార్ అథ్లెట్, ఆడ పులి హిమ దాస్ కు అస్సాం రాష్ట్ర ప్రభుత్వం డిప్యూటీ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్(DSP) ఐపిఎస్ క్యాడర్ ఇచ్చి గౌరవించింది. ఈ మేరకు ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి శర్బానంద సోనోవాల్ నియామక పత్రాలను అందజేశారు.

Who is Hima Das? All you need to know about Assam DSP

21 సంవత్సరాలున్న హిమదాస్ 2018లో ప్రపంచ జూనియన్ ఛాంపియన్ షిప్ లో భారతదేశాన్ని ప్రపంచ ఛాంపియన్ గా నిలిపింది. అంతేకాదు ఆసియా క్రీడల్లోనూ స్వర్ణం, రజతం సాధించి మన దేశ కీర్తి ప్రతిష్టలను మరింత ఇనుమడింపజేసింది.

Who is Hima Das? All you need to know about Assam DSP

అస్సాం ప్రభుత్వం ఇచ్చిన గౌరవ పదవి అనంతరం హిమదాస్ మాట్లాడారు. తన చిన్ననాటి కల ఈరోజుతో నెరవేరిందని.. పోలీస్ అధికారి కావాలన్న తన కోరికను క్రీడలపై ఉండే ఇష్టంతోనే నెరవేరిందన్నారు.

Who is Hima Das? All you need to know about Assam DSP

హిమకు ఈ పదవి దక్కడంపై దేశవ్యాప్తంగా ప్రశంసల జల్లు కురుస్తోంది. బాలీవుడ్ బ్యూటీ సోనాక్షి సిన్హా కూడా హిమకు ఈ పదవి రావడంపై ఆనందం వ్యక్తం చేశారు. 'నిన్ను ఇలా చూడటం గర్వంగా ఉంది' అంటూ తన ఇన్ స్టాగ్రామ్ లో పోస్ట్ షేర్ చేశారు. ఈ సందర్భంగా డింగ్ ఎక్స్ ప్రెస్.. కొత్త పోలీస్ బాస్.. హిమదాస్ గురించి కొన్ని ఆసక్తికరమైన విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం...

డింగ్ పట్టణంలో..

డింగ్ పట్టణంలో..

హిమ దాస్ అస్సాం రాష్ట్రంలోని నాగోల్ జిల్లా డింగ్ పట్టానికి సమీపంలో ఉన్న కందూలిమారి గ్రామంలో రోంజిత్ మరియు జోనాలి దాస్ దంపతులకు జన్మించారు. తన తల్లిదండ్రులు చిన్ననాటి నుండే రైతు కూలీలుగా పని చేసేవారు. వారికి ఉన్నా సంతానంలో అందరికంటే చిన్నది మన హిమదాస్.

హిమ విద్యాభ్యాసం..

హిమ విద్యాభ్యాసం..

హిమ దాస్ విద్యాభ్యాసం అంతా డింగ్ పబ్లిక్ హైస్కూల్లోనే జరిగింది. ప్రారంభంలో తాను ఫుట్ బాల్ ఆడటంలో ప్రావీణ్యత సంపాదించింది. అంతేకాదు అప్పట్లోనే చిరుతపులిలా పరుగెత్తడాన్ని చూసి.. తనను అందరూ డింగ్ ఎక్స్ ప్రెస్ గా పిలిచేవారు.

రన్నింగ్ ప్రాక్టీస్..

రన్నింగ్ ప్రాక్టీస్..

షంసుల్ హోక్ సలహాలతో ఫుట్ బాల్ నుండి రన్నింగ్ ప్రాక్టీస్ స్టార్ట్ చేసింది. తను స్కూలుకు వెళ్లే సమయంలోనూ కొండలు, లోయలతో నిండి ఉన్న ప్రాంతం కావడంతో.. కిలోమేటర్ల మేరకు అలాగే నడుచుకుంటూ వెళ్లేది. అలా కొండకోనలను దాటుతూ.. పరుగెత్తుతూ పాఠశాలకు చేరుకునేది. అలా అక్కడే పరుగెత్తుతూ పరుగులో రాటుదేలింది.

సహజ సిద్ధమైన అథ్లెట్..

సహజ సిద్ధమైన అథ్లెట్..

స్కూల్ స్టడీస్ కోసం కిలోమీటర్ల కొద్ది కొండలు దాటిన హిమ సహజసిద్ధమైన అథ్లెట్ గా అతి కొద్ది కాలంలో ఎదిగిపోయింది. ప్రతిరోజూ తన తండ్రితో కలిసి పొలం పనులు చేస్తూ మరింత ధ్రుఢంగా తయారైంది.

సరైన వసతులు లేకున్నా..

సరైన వసతులు లేకున్నా..

అనంతరం అథ్లెటిక్స్ లో అడుగుపెట్టిన హిమదాస్.. సరైన వసతులు లేకపోయినా మొక్కవోని దీక్షతో సాధన కొనసాగించింది. బురదలా ఉండే ఫుట్ బాల్ మైదానంలో కఠోర శిక్షణ చేసింది.

తొలి స్వర్ణంతో చరిత్ర..

తొలి స్వర్ణంతో చరిత్ర..

ఐఏఏఎఫ్ ప్రపంచ అండర్-20 అథ్లెటిక్స్ ఛాంపియన్ షిప్ లో భారతదేశం తరపున తొలిసారి స్వర్ణం గెలిచిన తొలి మహిళా అథ్లెట్ గా చరిత్ర స్రుష్టించింది. ఫిన్లాండ్ వేదికగా జరిగిన ఐఏఏఎఫ్ వరల్డ్ అండర్ -20 అథ్లెటిక్స్ ఛాంపియన్ షిప్స్ లో అద్భుత ప్రతిభ కనబరిచింది. అక్కడ 400 మీటర్ల పరుగు పందెంలో విన్నర్ గా నిలిచింది. ఈ ట్రాక్ లో భారతదేశం స్వర్ణం సాధించడం అదే తొలిసారి.

18 రోజుల్లోనే..

18 రోజుల్లోనే..

హిమ దాస్ అంటే ఆడ పిల్ల కాదు.. ఆడపులి అనే పేరును తెచ్చుకుంది. చెక్ రిపబ్లిక్స్ లో జరుగుతున్న అథ్లెటిక్స్ లో కేవలం 18 రోజుల్లో ఐదు స్వర్ణాలను సాధించింది. అంతేకాదు 400 మీటర్ల పరుగు పందెంలో 52.09 సెకన్ల సమయంలో పూర్తి చేసి రికార్డు నెలకొల్పింది.

ఎన్నో అవార్డులు..

ఎన్నో అవార్డులు..

హిమదాస్ ప్రతిభను గుర్తించిన ప్రభుత్వం 2018లో అర్జున్ అవార్డు ఇచ్చి సత్కరించింది.

అదే ఏడాదిలో యునిసెఫ్ ఇండియాకు యూత్ అంబాసిడర్ గా నియమితురాలైంది.

అంతర్జాతీయ ఈవెంట్లో భోగేశ్వర్ బరువా తర్వాత అస్సాం నుండి గోల్డ్ మెడల్ సాధించిన రెండో ప్లేయర్ గా హిమదాస్ చరిత్రకెక్కింది.

అస్సాం ప్రభుత్వం కూడా తనను స్పోర్ట్స్ అంబాసిడర్ గా నియమించింది. పరుగుల రాణి ఉషను గుర్తు చేస్తూ 19 ఏళ్లకే స్ప్రింటర్ గా అంతర్జాతీయ ఈవెంట్లో సత్తా చాటింది.

All Images Credited to Twitter

English summary

Who is Hima Das? All you need to know about Assam DSP

Here we are talking about who is hima das? all you need to know about assam dsp. Read on
Desktop Bottom Promotion