For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

Lovlina Borgohain:అంచనాలకు మించి రాణించింది.. భారత్ ఖాతాలో మరో పతకాన్ని ‘లవ్లీగా’ జత చేసింది...

లవ్లీనా బొర్గోహెయిన్ ఎవరు? టోక్యో ఒలింపిక్స్ లో కాంస్య పతకం గెలుచుకున్న ఈ వీరవనిత స్ఫూర్తిదాయకమైన స్టోరీ గురించి ఇప్పుడు తెలుసుకుందాం.

|

భారత్ తరపున బాక్సర్ గా బరిలోకి దిగింది..
అంచనాలకు మించి రాణించింది..
క్వార్టర్స్ లో ప్రపంచ ఛాంపియన్ ను ఓడించింది..
పసిడి కోసం తీవ్రంగానే ప్రయత్నించింది..
కానీ కాంస్యంతోనే సరిపెట్టుకుంది..
అయినా జాతీయ పతాకాన్ని సగర్వంగా ఎగరేసింది.
భారతావని మనసులను గెలుచుకుంది..
లవ్లీనా దెబ్బకు మన దేశం ఖాతాలోకి మరో మెడల్ వచ్చి చేరింది..

Who is Lovlina Borgohain? Inspiring Story Of Boxer Wins Bronze Medal at Tokyo Olympics in Telugu

భారతదేశం తరపున ముచ్చటగా మూడో పతకాన్ని సైతం మహిళా క్రీడాకారిణి సాధించడం విశేషం. లవ్లీనా బోర్గెహైన్ కంటే ముందు వెయిట్ లిఫ్టింగులో మీరాబాయి చాను, బ్యాడ్మింటన్ విభాగంలో పివి సింధు పతకాలు సాధించిన సంగతి తెలిసిందే. తాజాగా మహిళా బాక్సర్ 69 కేజీల విభాగంలో భారత మహిళా బాక్సర్ లవ్లీనా బోర్గోహైనా కాంస్య పతకం గెలుచుకున్నారు. పసిడి ప్రయత్నంలో భాగంగా చైనీస్ తైపీకి చెందిన నియన్-చిన్ చెన్ ను ఓడించి సెమీస్ కు చేరుకున్న ఈ మహిళా బాక్సర్ సెమీస్ లో మాత్రం చేతులెత్తేసింది. అయినా మన దేశం తరపున ఒక పతకాన్ని సాధించింది. ఈ సందర్భంగా లవ్లీనా బొర్గోహైన్ ఎవరు? ఆమె సక్సెస్ వెనుక ఉన్న కారణాలేంటి అనే వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం.

PV Sindhu:సరికొత్త రికార్డు సాధించిన సింధు.. ఆ ఫీట్ సాధించిన తొలి భారతీయ మహిళ మన తెలుగమ్మాయే...PV Sindhu:సరికొత్త రికార్డు సాధించిన సింధు.. ఆ ఫీట్ సాధించిన తొలి భారతీయ మహిళ మన తెలుగమ్మాయే...

లవ్లీనా ఎవరు?

లవ్లీనా ఎవరు?

అస్సాం రాష్ట్రంలోని గోలాఘాట్ జిల్లాకు చెందిన టికెన్ మరియు మామోని బోర్గోహైన్ దంపతులకు లవ్లీనా జన్మించారు. ఆమె తండ్రి ఒక చిన్న వ్యాపారవేత్త. తన కుమార్తె కలను నిజం చేయడానికి అనేక అవమానాలను ఎదుర్కొన్నాడు. సమాజం నుండి ఎన్నో ఛీత్కారాలను సహించాడు. ముఖ్యంగా ఆర్థిక పరంగా ఎన్ని అవరోధాలు వచ్చినా.. పట్టుదలతో తన కూతురుని ఒలింపిక్స్ వరకు వెళ్లేలా చేయడంలో మాత్రం విజయవంతమయ్యాడు.

కిక్ బాక్సింగ్..

కిక్ బాక్సింగ్..

లవ్లీనాతో పాటు మరో ఇద్దరు సోదరీమణులు కిక్ బాక్సింగ్ ప్రారంభించారు. తన సోదరీమణులు కూడా కిక్ బాక్సింగులో జాతీయ ఛాంపియన్లుగా నిలిచారు. ఒకరోజు వారి తండ్రి మార్కెట్ నుండి తిరిగి ఇంటికి వస్తున్నప్పుడు.. వార్తాపత్రికలో కొన్ని వస్తువులను తీసుకువచ్చినప్పుడు.. అందులో గొప్ప బాక్సర్ మహ్మద్ ఆలీ చిత్రాన్ని చూసిన లవ్లీనా తన గురించి తెలుసుకోవడం ప్రారంభించింది. ఆ క్షణం నుండి బాక్సింగుతో ఆమె ఆసక్తికరమైన ప్రయాణం ప్రారంభమైంది.

2012లో కెరీర్ ప్రారంభం..

2012లో కెరీర్ ప్రారంభం..

లవ్లీనా 2012 సంవత్సరంలో స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా ట్రయల్స్ స్కూల్ నుండి తన కెరీర్ లాంఛనంగా ప్రారంభమైంది. తనను కోచ్ పాడమ్ బోర్ గుర్తించారు. ఆమెకు ఐదు సంవత్సరల పాటు కఠినమైన శిక్షణ ఇచ్చారు. తను కూడా కఠోర శ్రమ చేసింది. ఐదు సంవత్సరాలలో తను ఛాంపియన్ షిప్ లో కాంస్య పతకానికి చేరుకుంది.

Mirabai Chanu : మట్టిలో మాణిక్యం మీరాబాయి.. ఒకప్పుడు దుంగలు మోసింది.. ఇప్పుడు దేశ మణిపూసగా మారిపోయింది...Mirabai Chanu : మట్టిలో మాణిక్యం మీరాబాయి.. ఒకప్పుడు దుంగలు మోసింది.. ఇప్పుడు దేశ మణిపూసగా మారిపోయింది...

భాగస్వామి బాక్సర్లు లేరు..

భాగస్వామి బాక్సర్లు లేరు..

భారతదేశంలో లవ్లీనా బాక్సర్ గా కెరీర్ ప్రారంభించిన సమయంలో తన తోటి భాగస్వాములు, తన లాంటి ఆటగాళ్లు అందుబాటులో లేరు. దీంతో తను శిక్షణ సమయంలో చాలా సమస్యలను ఎదుర్కొంది. కాబట్టి తను ప్రాక్టీస్ చేయడానికి పార్ట్నర్స్ కూడా లేరు. దీంతో తను ఇతర కేటగీరీలకు చెందిన బాక్సర్లతో శిక్షణ పొందాల్సి వచ్చింది.

ఒలింపిక్స్ కు ముందు..

ఒలింపిక్స్ కు ముందు..

టోక్యో ఒలింపిక్స్ లో పాల్గొనడానికి ముందు లవ్లీనాకు చాలా కష్టాలు ఎదురయ్యాయి. ఆ సమయంలో తన తల్లి కిడ్నీ మార్పిడి శస్త్రచికిత్స కారణంగా తను కొంత కాలం రింగ్ కు దూరంగా ఉండాల్సి వచ్చింది. అయితే ఆమెకు నయం అయిన తర్వాత, తను శిక్షణ నిమిత్తం బరిలోకి దిగింది. ముందుగా తనను తాను శారీరకంగా, మానసికంగా ఎంతో మెరుగుపరచుకుంది. ఆమె కఠోర శ్రమ వల్లే భారతదేశానికి లవ్లీనా రూపంలో మరో పతాకం వచ్చింది. ఈమె సెమీస్ లో ఓడిపోయినప్పటికీ.. భారతదేశం గర్వించదగ్గ ప్రదర్శన చేసింది. అందరి చేత శభాష్ అనిపించుకుంది...

English summary

Who is Lovlina Borgohain? Inspiring Story Of Boxer Wins Bronze Medal at Tokyo Olympics in Telugu

Here we are talking about the who is lovlina borgohain? Inspiring story of boxer wins broze medal at tokyo olympics in Telugu. Have a look
Story first published:Wednesday, August 4, 2021, 16:16 [IST]
Desktop Bottom Promotion