For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

Mirabai Chanu : మట్టిలో మాణిక్యం మీరాబాయి.. ఒకప్పుడు దుంగలు మోసింది.. ఇప్పుడు దేశ మణిపూసగా మారిపోయింది...

టోక్యో ఒలింపిక్స్ వెయిట్ లిఫ్టింగులో మెడల్ సాధించిన మీరాబాయి చాను ఎవరు? ఆమె సక్సెస్ స్టోరీ గురించి ఇప్పుడు తెలుసుకుందాం.

|

టోక్యో ఒలింపిక్స్ లో ఆరంభంలోనే అదరగొట్టింది మీరాబాయి చాను. భారతదేశం తరపున తొలి రజత పతకం సాధించింది. 49 కిలోల మహిళల విభాగంలో యావత్ భారతావని గర్వించే అథ్లెట్ గా నిలిచింది. మీరాబాయి చానుతో ఒలింపిక్స్ లో భారత్ పతకాల వేట మొదలైంది. ఎలాంటి అంచనాలు లేకుండా బరిలోకి దిగిన సైఖోమ్ మీరాబాయి చాను(26) సిల్వర్ మెడల్ తో భారతదేశంలో అశేష ప్రజా వాణితో శభాష్ అనిపించుకుంది. ఇంతకీ మీరాబాయి చాను ఎవరు? ఆమె సక్సెస్ వెనుక ఉన్న కథేంటో తెలిస్తే మీరు ఆశ్చర్యపోతారు. ఆ వివరాలేంటో ఇప్పుడు తెలుసుకుందాం...

Who is Mirabai Chanu? Know The Success Story of Indias Weightlifting Silver Medalist at Tokyo Olympics in Telugu

PC :Twitter

మణిపూర్ రాజధాని ఇంపాల్ దగ్గర్లోని నాంగ్ పోక్ కక్సింగ్ లో 1994 సంవత్సరం ఆగస్టు 8వ తేదీన సైఖోమ్ మీరా బాయి చాను జన్మించారు. ఆమెది మధ్యతరగతి కుటుంబం. వంట కలప కోసం వెళ్లిన టైంలో తన అన్న కంటే ఎక్కువ బరువులన్ని మోసి అందర్నీ ఆశ్చర్యపరిచింది.

Who is Mirabai Chanu? Know The Success Story of Indias Weightlifting Silver Medalist at Tokyo Olympics in Telugu

అలా చిన్న వయసులోనే ఆమెలోని సత్తాను గుర్తించింది కుటుంబం. అప్పటి నుండి వారికి కష్టమైనా సరే వెయిట్ లిఫ్టింగులో శిక్షణ ఇప్పించింది. ఎలాగైనా తమ ఊరి పేరును ప్రపంచం మొత్తం మారుమోగేలా చేయాలన్నది వారి కుటుంబం కల. అందుకు తగ్గట్టుగానే తల్లిదండ్రులను అంచనాలను, నమ్మకాన్ని నిలబెట్టుకుంటూ.. వారి కలలను సాకారం చేస్తూ వచ్చింది మీరాబాయి.

ముందుగా కామన్వెల్త్ లో..
పదకొండు సంవత్సరాల వయసు నుండే లోకల్ వెయిట్ లిఫ్టింగ్ పోటీల్లో పాల్గొనడం ప్రారంభించింది. చానుకు ఫస్ట్ బ్రేక్ వచ్చింది 2014 గ్లాస్గో కామన్వెల్త్ గేమ్స్ నుంచి. అందులో ఆమె సిల్వర్ మెడల్ సాధించారు. 2016లో రియో ఒలింపిక్స్ పోటీల కోసం నేషనల్ ట్రయల్స్ లో సత్తా చాటి మీరాబాయి అరుదైన ఘనత సాధించారు. ఏడుసార్లు ఛాంపియన్, తాను ఆరాధ్య గురువుగా భావించే కుంజారాణి దేవి రికార్డును అధిగమించేసింది.

ఎత్తుపల్లాలు..
2016 సంవత్సరంలో రియో ఒలింపిక్స్ లో మెడల్ కోసం బరిలో దిగినప్పటికీ అక్కడ సఫలం కాలేకపోయింది. అయితే ఏ మాత్రం నిరాశపడకుండా 2017లో ప్రపంచ వెయిట్ లిఫ్టింగ్ ఛాంపియన్ షిప్స్ లో 48 కేజీల విభాగంలో స్వర్ణ పతకం సాధించి తన సత్తా ఏంటో చాటింది. రెండు దశాబ్దాల తర్వాత ఈ ఘనత సాధించిన తొలి ఉమెన్ ఇండియన్ వెయిట్ లిఫ్టర్ గా నిలిచింది. ఆ తర్వాత 2018లో కామన్వెల్త్ గేమ్స్ స్వర్థ పతకం, 2019లో ఏషియన్ వెయిట్ లిఫ్టింగ్ ఛాంపియన్ షిప్స్ లో కాంస్యంతో మెరిసింది. అయితే 2019 సంవత్సరంలో నాలుగో స్థానంతో సరిపెట్టుకుంది. ఆ తర్వాత 2020లో సీనియర్ నేషనల్ వెయిట్ లిఫ్టింగ్ ఛాంపియన్ షిప్స్ లో తన రికార్డును తానే అధిగమించింది. దీంతో టోక్యో ఒలింపిక్స్ లో అడుగు పెట్టేసింది.

తొలి వెయిట్ లిఫ్టర్..
టోక్యో ఒలింపిక్స్ కు అర్హత సాధించిన తొలి వెయిట్ లిఫ్టర్ కూడా మీరాబాయి చానునే. అంతేకాదు ఈ విభాగంలో ఈమె ఒక్కరే భారత్ నుండి పాల్గొన్నారు. ఒలింపిక్స్ 49 కేజీల విభాగంలో మొత్తం 202 కేజీలు ఎత్తిన మీరాబాయి.. స్వర్ణం కోసం జరిగిన మూడో అటెంప్ట్ లో మాత్రం విఫలమైంది. క్లీన్ అండ్ జెర్క్ లో 117 కిలోల బరువు ఎత్తే క్రమంలో తడబడింది. అయినా రజత పతకం సాధించి భారత్ పతకాల బోణీ తెరిచిన తొలి వ్యక్తిగా నిలిచారు.

ఎన్నో అవార్డులు..
26 సంవత్సరాల మీరాబాయి చాను గతంలో ఎన్నో అవార్డులు వచ్చాయి. కేంద్రం నుండి పద్మశ్రీతో పాటు రాజీవ్ ఖేల్ రత్న పురస్కారాలను అందుకున్నారు. ప్రస్తుత ఒలింపిక్స్ పతక సాధనతో ఆమెకు సర్వత్రా అభినందనలు వెల్లువెత్తుతున్నాయి.

English summary

Who is Mirabai Chanu? Know The Success Story of India's Weightlifting Silver Medalist at Tokyo Olympics in Telugu

Who is Mirabai Chanu? Know the success story of India's weightlifting silver medalist at tokyo olympics in telugu. Take a look.
Desktop Bottom Promotion