For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

Ravi Dahiya: రెజ్లింగ్ హీరో రవి రింగులో కామ్ గా పని కానిచ్చేస్తాడు.. ఏ మాత్రం ఎమోషన్స్ కనబడనివ్వడు...

రవి దహియా ఎవరు? టోక్యో ఒలింపిక్స్ లో మెడల్ ఖాయం చేసుకున్న రెజ్లర్ రవి గురించి ఆసక్తికరమైన విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం.

|

ఒలింపిక్స్ అంటే.. అదొక అంతర్జాతీయ వేడుక.. అంతా రూల్స్ ప్రకారమే జరుగుతుందనుకుంటే తప్పులో కాలేసినట్టే.. మేరీ కోమ్ విషయంలో ఏం జరిగిందో మనం ఇదివరకే చూశాం. తను గెలించిందని అందరూ అనుకున్నాం.. కానీ చివర్లో ఫలితం మాత్రం ఆమెకు వ్యతిరేకంగా వచ్చింది.

Who is Ravi Dahiya? Inspiring Story of Wrestler Confirmed Medal At Tokyo Olympics in Telugu

ఇదిలా ఉండగా.. తాజాగా రెజ్లర్ పోటీల్లో మన రవి దహియా భుజాన్ని పంటితో క్రూరగా కొరికేశాడు ప్రత్యర్థి.. అయినా మనోడు ఏ మాత్రం పట్టు విడవలేదు. చివర్లో ఎంతో సహనంతో ఆ నొప్పినంతా పంటిబిగువన పెట్టేశాడు.. అంతే మొదట్లో 2-9 వెనుకబడినా.. చివర్లో పుంజుకుని ప్రత్యర్థిని ఊపిరాడకుండా చేసి.. వరుసగా పాయింట్లు సాధించాడు. ఫైనల్ లో సగర్వంగా అడుగు పెట్టేశాడు. భారతదేశం తరపున మరో పతకాన్ని కన్ఫార్మ్ చేశాడు.

Who is Ravi Dahiya? Inspiring Story of Wrestler Confirmed Medal At Tokyo Olympics in Telugu

ఇటీవలి కాలంలో భారతదేశం తరపున రెజర్లు ఒలింపిక్స్ లో మంచి ప్రదర్శన కనబరుస్తున్నారు. ఈసారి టోక్యో 2020 ఒలింపిక్స్ లో కూడా రవి కుమార్ దహియా తన పేరిట పతకం ఖాయం చేసుకున్నాడు. 23 సంవత్సరాల భారతీయ రెజ్లర్ రవి కుమార్ దహియా బుధవారం సెమీస్ లో విజయం సాధించి ఫైనల్ లో అడుగుపెట్టడం ద్వారా భారత్ ఖాతాలో మరో పతకాన్ని ఖాయం చేసేశాడు. క్రీడా ప్రపంచంలో తన పేరు సువర్ణాక్షరాలతో నమోదు చేసుకున్నాడు. ఈ సందర్భంగా రవి కుమార్ దహియా పోరాటం, త్యాగం మరియు తన కఠోరమైన శ్రమ గురించి తప్పకుండా తెలుసుకోవాల్సిందే..

Lovlina Borgohain:అంచనాలకు మించి రాణించింది.. భారత్ ఖాతాలో మరో పతకాన్ని 'లవ్లీగా' జత చేసింది...Lovlina Borgohain:అంచనాలకు మించి రాణించింది.. భారత్ ఖాతాలో మరో పతకాన్ని 'లవ్లీగా' జత చేసింది...

అంచనాలు లేకుండా..

అంచనాలు లేకుండా..

రవి కుమార్ దహియా.. చరిత్రలో తనకంటూ ఓ పేజీని క్రియేట్ చేసుకోవడానికి ఒక్క అడుగు దూరంలో మాత్రమే ఉన్నాడు. టోక్యో ఒలింపిక్స్ కు వెళ్లడానికి ముందు రవికుమార్ పై ఎవరికీ పెద్దగా అంచనాలు లేవు. అయితే బుధవారం జరిగిన రెజ్లింగ్ 57 కేజీల విభాగంలో రికార్డు నెలకొల్పాడు. ఉదయం జరిగిన అర్హత పోటీల్లో ప్రత్యర్థిపై ఆది నుండి ఆధిపత్యం ప్రదర్శించిన రవి క్వార్టర్స్ లోనూ అదే ఊపు కొనసాగించాడు. ఆ తర్వాత సెమీస్ లో కజకిస్థాన్ రెజ్లర్ నూరిస్లామ్ సనయేవ్ పై విక్టరీ బైఫాల్ కింద విజయం సాధించి ఫైనల్ కు ప్రవేశించాడు.

రెండో ఆటగాడు..

రెండో ఆటగాడు..

భారత దేశం తరపున రెజ్లర్ సుశీల్ కుమార్ తర్వాత ఒలింపిక్స్ లో ఫైనల్ కు అర్హత సాధించిన రెండో ఆటగాడిగా రవి కుమార్ దహియా నిలిచాడు. మక్కా ఆఫ్ రెజ్లింగ్ అని పిలువబడే హర్యానా రాష్ట్రం సోనిపట్ జిల్లాలో ఉన్న నాహ్రి ప్రాంతానికి చెందిన రవి కుమార్ పదేళ్ల వయసులోనే రెజ్లింగులో ప్రవేశించాడు.

కోచ్ సత్పాల్ తో ఓనమాలు..

కోచ్ సత్పాల్ తో ఓనమాలు..

రెండుసార్లు ఒలింపిక్స్ లో పతకాలు సాధించిన సుశీల్ కుమార్ కోచ్ అయిన సత్పాల్ సింగ్ దగ్గరే రెజ్లింగ్ ఓనమాలు నేర్చుకున్నాడు. అయితే రవికుమార్ ది గొప్ప కుటుంబం అనుకుంటే మీరు పొరబడినట్లు. తను ఓ సాధారణ రైతు కుటుంబానికి చెందినవాడు. అంతేకాదు వారికి కనీసం సొంత భూమి కూడా కౌలు రైతుగా పని చేస్తూ కుటుంబాన్ని పోషించుకుంటున్నారు.

PV Sindhu:సరికొత్త రికార్డు సాధించిన సింధు.. ఆ ఫీట్ సాధించిన తొలి భారతీయ మహిళ మన తెలుగమ్మాయే...PV Sindhu:సరికొత్త రికార్డు సాధించిన సింధు.. ఆ ఫీట్ సాధించిన తొలి భారతీయ మహిళ మన తెలుగమ్మాయే...

కొడుకు కోరిక కాదనలేక..

కొడుకు కోరిక కాదనలేక..

వాస్తవానికి రవి కుమార్ దహియా రెజ్లింగులో చేరడం తల్లిదండ్రులకు ఏ మాత్రం ఇష్టం లేదు. అయితే రవి రెజ్లింగుపై ఉండే ఆసక్తిని గమనించిన పేరేంట్స్ కొడుకు కోరికను కాదనలేకపోయారు. అంతే అప్పటి నుండి రవి రెజ్లింగ్ పట్టుబట్టి నేర్చుకున్నాడు.

రోజూ 40 కిలోమీటర్లు..

రోజూ 40 కిలోమీటర్లు..

ప్రతిరోజూ రవికి పాలు, పండ్లు ఇవ్వడానికి తన తండ్రి రాకేష్ దహియా 40 కిలోమీటర్లు ప్రయాణించేవారు. ఇలా ఒకట్రెండు కాదు ఏకంగా పదేళ్ల పాటు చేయడం విశేషం. తన కొడుకు ఇప్పుడీ స్థాయికి చేరినా.. రాకేష్ దహియా మాత్రం ఇప్పటివరకూ రవి కుమార్ రెజ్లింగ్ ను చూడకపోవడం విశేషం.

గాయాలతో సమస్యలు..

గాయాలతో సమస్యలు..

2015 సంవత్సరంలోనే జూనియర్ వరల్డ్ రెజ్లింగ్ ఛాంపియన్ షిప్ లో రవి 55 కేజీల విభాగంలో రజత పతకాన్ని గెలుచుకున్నాడు. అప్పుడు అనుకోకుండా సెమీఫైనల్ లో గాయపడ్డాడు. ఆ తర్వాత 2017 సంవత్సరంలో సీనియర్ నేషనల్స్ లో గాయం అతడిని మరోసారి ఇబ్బంది పెట్టింది. ఈ కారణంగా తను కొంతకాలం రెజ్లింగ్ కు దూరంగా ఉండాల్సి వచ్చింది.

అద్భుత పునరాగమనం..

అద్భుత పునరాగమనం..

అయితే 2018 సంవత్సరంలో తను అండర్-23 వరల్డ్ రెజ్లింగ్ ఛాంపియన్ షిప్ లో అద్భుతమైన పునరాగమనం చేసి రజత పతకం సాధించాడు. 2019 సంవత్సరంలో ప్రపంచ ఛాంపియన్ షిప్ లో పాల్గొని కాంస్య పతకాన్ని సైతం గెలుచుకున్నాడు. అదే ఫామ్ కొనసాగిస్తూ 2020 మరియు 2021 ఆసియా ఛాంపియన్ షిప్ లలో రెండు బంగారు పతకాలను సాధించాడు.

ఏ దశలోనూ..

ఏ దశలోనూ..

రవి కుమార్ దహియా తను పోటీలో ఎంతలా వెనుకబడినా.. ఏ దశలోనూ తన స్టామినాను, మెంటల్ బ్యాలెన్స్ కోల్పోడు. ఇందుకు తన కోచ్ ఓ ఉదాహరణ కూడా చెప్పాడు. ఓసారి యూరోపియన్ ఛాంపియన్ పోటీలో రవి ఒక దశలో 0-6 స్కోరుతో వెనుకబడ్డాడు. అయితే తర్వాత పుంజుకుని ఏకంగా 17 పాయింట్లు కొట్టాడు. ప్రత్యర్థికి కనీసం ఊపిరి పీల్చుకునే అవకాశం ఇవ్వడు.. మరో విశేషమేమిటంటే.. ఒలింపిక్స్ లో వెళ్తున్నందుకు ఎవరైనా భావోద్వేగానికి గురవుతారు. ఇక మెడల్ సాధిస్తే నేల మీద పడిపోయి.. గాల్లోకి ఎగురుతూ తమ ఆనందాన్ని వ్యక్తం చేస్తారు. కానీ మన హీరో రవి మాత్రం తన మొహంలో కనీసం చిరునవ్వు కూడా కనిపించదు. చాలా క్యాజువల్ గా కనిపిస్తాడు. ఇదిలా ఉండగా.. రవికి పతకం ఖాయం కావడంతో అందరికన్నా తన తండ్రి కౌలు రైతు ఆనందంతో ఉప్పొంగిపోతున్నాడు.

All Images Credited To Twitter

English summary

Who is Ravi Dahiya? Inspiring Story of Wrestler Confirmed Medal At Tokyo Olympics in Telugu

Here we are talking about the who is Ravi Dahiya? Inspiring story of wrestler confirmed medal at tokyo olympics in Telugu. Read on
Desktop Bottom Promotion