For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

Vikram Batra:యుద్ధంలో వెన్నుచూపని వీరుడు..దాయాది దేశానికి వణుకు పుట్టించిన ధీరుడు..

Vikram Batra:విక్రమ్ బాత్రా కథ గురించి తెలుసుకుంటే మీరు కచ్చితంగా గర్వపడతారు.

|

జమ్మూ కాశ్మీర్ రైఫిల్స్ అధికారి కెప్టెన్ విక్రమ్ బాత్రా యుద్ధంలో వెన్ను చూపని వీరునిగా.. శత్రు దేశానికి వణుకు పుట్టించే ధీరుడిగా చరిత్రలో నిలిచిపోయారు. కార్గిల్ యుద్ధంలో వీరమరణం పొందిన 'షేర్ షా' విక్రమ్ బాత్రా 24 సంవత్సరాల వయసులోనే తన నిండు ప్రాణాలను యుద్ధ భూమిలో కోల్పోయాడు.

Who Was Captain Vikram Batra And Why Was He Called Shershaah

ఈయన ఒక సైనికుడిగానే కాదు.. ప్రేమికుడిగా కూడా అందరికీ చిరస్మరణీయంగా నిలిచిపోయారు. డింపుల్ చీమాతో తన ప్రేమ ప్రయాణం వివాహం వరకు వెళ్లకుండా ముగిసిపోయింది. అయినా కూడా వీరి ప్రేమ అమర ప్రేమలాగా అజరామరంగా నిలిచిపోయింది.

Who Was Captain Vikram Batra And Why Was He Called Shershaah

ఈ సందర్భంగా విక్రమ్ బాత్రా ఎవరు? ఏ ప్రాంతానికి చెందిన వారు? అంత చిన్న వయసులోనే వీరుడిగా.. సూరుడిగా పేరేలా తెచ్చుకున్నారనే వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం...

విక్రమ్ జననం..

విక్రమ్ జననం..

హిమాచల్ ప్రదేశ్ లోని పాలంపూర్ జిల్లాలోని గుగ్గర్ అనే ప్రాంతంలో 1974వ సంవత్సరం సెప్టెంబర్ తొమ్మిదో తేదీన కెప్టెన్ విక్రమ్ బాత్రా జన్మించారు. తన తల్లిదండ్రులు జిఎం బాత్రా, కమల్. పాలమూరులో తన ప్రాథమిక విద్యను పూర్తి చేసుకున్న తర్వాత ఉన్నత చదువుల కోసం చండీగఢ్ వెళ్లాడు.

కాలేజీలో ప్రేమ..

కాలేజీలో ప్రేమ..

విక్రమ్ మాస్టర్స్ డిగ్రీ చదివేందుకు పంజాబ్ యూనివర్సిటీలో చేరారు. ఈ సమయంలోనే విక్రమ్-డింపుల్ కు పరిచయం ఏర్పడింది. ఆ పరిచయం కాస్త తక్కువ సమయంలోనే ప్రేమగా మారిపోయింది. కాలేజీలోని అన్ని ప్రేమ జంటల మాదిరిగానే వీరి ప్రేమ జంట కూడా ఎంచక్కా ఎంజాయ్ చేసింది. అదే సమయంలో 1996లో విక్రమ్ డెహ్రాడూన్ లోని ఇండియన్ మిలిటరీకి ఎంపిక అవ్వడంతో మాస్టర్స్ డిగ్రీని మధ్యలోనే ఆపేశాడు. ఆ తర్వాత డింపుల్ కూడా చదువును ఆపేసింది. విక్రమ్ ఆర్మీలో ఉన్నా వారి ప్రేమ కంటిన్యూ అయ్యింది. తను ఆర్మీ నుండి ఇంటికి వచ్చిన ప్రతిసారీ డింపుల్ ను కలిసేవాడు.

తన రక్తంతో బొట్టు..

తన రక్తంతో బొట్టు..

ఓ రోజు డింపుల్ విక్రమ్ వద్ద వివాహ ప్రస్తావన తీసుకొచ్చింది. అప్పుడే విక్రమ్ తన వ్యాలెట్లో ఉన్న చిన్న బ్లేడ్ తీసుకొని బొటన వేలు కోసుకున్నాడు. ఆ రక్తంతో ఆమె నుదుటిన బొట్టు పెట్టాడు. సినిమా శైలిలో జరిగిన ఆ సంఘటన ఆమె మనసులో చెరగని ముద్ర వేసుకుంది. అయితే సమయం గడుస్తున్న కొద్దీ డింపుల్ ఇంట్లో పెళ్లి గురించి ఒత్తిడి పెరిగింది. ఈ నేపథ్యంలో కార్గిల్ యుద్ధం ముగిసిన తర్వాత ఇద్దరూ పెళ్లి చేసుకోవాలని డిసైడ్ అయ్యారు. అంతలోనే 1999 సంవత్సరంలో జులై 7న కార్గిల్ వార్ లో విక్రమ్ వీరమణం పొందాడు.

‘యే దిల్ మాంగే మోర్’..

‘యే దిల్ మాంగే మోర్’..

‘యే దిల్ మాంగే మోర్' అనే పదాలను చూసినప్పుడు మన శత్రువులలో భయం కనిపించిందట. ఈ నినాదం భారతదేశం అంతటా వ్యాపించింది. కెప్టెన్ గా ఉన్న విక్రమ్ బాత్రా ఈ నినాదాన్ని తీసుకొచ్చారు. తను వీర మరణం పొందడానికి ముందు ‘జై భారత్ మాతా' అనే మాటలు చివరగా వినిపించాయి.

పరమ్ వీర చక్ర..

పరమ్ వీర చక్ర..

కేంద్ర ప్రభుత్వం ఆయనను పరమ వీర చక్ర అవార్డుతో గౌరవించింది. విక్రం మరణం తర్వాత డింపుల్ మళ్లీ పెళ్లి చేసుకోలేదు. విక్రమ్ జీవిత కథను బాలీవుడ్ లో ‘షేర్ షా' సినిమాగా తెరకెక్కించారు. సిద్ధార్థ్ మల్హొత్రా, కియారా అద్వానీ జంటగా నటించిన ఈ సినిమా ఈరోజే రిలీజ్ అయ్యింది.

English summary

Who Was Captain Vikram Batra And Why Was He Called Shershaah

Here we are talking about the who was captain vikram batra and why was he called shershah. have a look
Desktop Bottom Promotion