For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

World AIDS Vaccine Day 2022: ఎయిడ్స్ వ్యాధికి ఇప్పటికీ వ్యాక్సిన్ లేదా?

అయితే ఇప్పటికీ ఈ ఎయిడ్స్ వ్యాధికి మందు కనుగొనలేదు. అయితే ఈ ఎయిడ్స్ వ్యాధి గురించి అవగాహన కల్పించేందుకు మే 18న ఎయిడ్స్ వ్యాక్సిన్ డేగా జరుపుకుంటారు.

|

ప్రపంచవ్యాప్తంగా మే 18వ తేదీన 'World AIDS Vaccine Day'గా జరుపుకుంటారు. ఈ ఎయిడ్స్ అనే రోగానికి ఇప్పటివరకు మందు అనేదే లేదు. అయితే ఈ వ్యాధిని గురించి అందరికీ అవగాహన కల్పించేందుకు మే 18వ తేదీన వరల్డ్ ఎయిడ్స్ వ్యాక్సిన్ డేగా నిర్ణయించారు. ఈ వ్యాధి ప్రాణాంతకం కాబట్టి, దీనికి కేవలం నివారణ మార్గం ఒక్కటే ఉంది. అందుకే ఈ వ్యాధిని నిర్మూలించడానికి సురక్షితమైన మరియు సమర్థవంతమైన హెచ్ఐవి వ్యాక్సిన్ల కోసం మార్గాలను కనుగొన్న, క్రుషి చేస్తున్న వాలంటీర్లు, పరిశోధకులు, శాస్త్రవేత్తలు, ఆరోగ్య నిపుణులలో ప్రతి ఒక్కరికీ ధన్యవాదాలు చెప్పే రోజు ఈరోజు.

World AIDS Vaccine Day 2020: Myths and facts about the AIDS vaccine

ఈ సందర్భంగా ఎయిడ్స్ వ్యాక్సిన్ యొక్క చరిత్ర మరియు ప్రాముఖ్యత, అపొహలు, మరియు వాస్తవాలను తెలుసుకుందాం... UNAIDS ప్రకారం, ప్రపంచవ్యాప్తంగా 2017లో సుమారు 36.9 మిలియన్ల మంది ఎయిడ్స్ వ్యాధి బారిన పడ్డారు. ఈ అంకెలు ఎయిడ్స్ గురించి, దానిపై అవగాహన కల్పించి, దాని ప్రాముఖ్యత, దాని నివారణల గురించి మాట్లాడేలా చేశాయి. అయితే ఇప్పటికీ ఎయిడ్స్ అంటే ఏమిటి? దాని లక్షణాలు, అది ఎలా వస్తుందనేందుకు గల కారణాలు, దాని ప్రమాద కారకాలు మరియు నివారణ గురించి అతికొద్ది మందికే తెలుసు. అంతేకాదు చాలామందికి ఈ ఎయిడ్స్ మహమ్మారిపై అనేక రకాల అపొహలు కూడా ఉన్నాయి.

World AIDS Vaccine Day 2020: Myths and facts about the AIDS vaccine

ఇప్పటివరకు హెచ్ఐవి నివారించగల వ్యాక్సిన్ ను 2016 సంవత్సరంలో కనుగొన్నట్లు ఒక అధ్యయనం చెబుతోంది. ఆ తర్వాత హెచ్ఐవి వ్యాక్సిన్ ను పరీక్షించడానికి ఎన్ఐహెచ్ క్లినికల్ ట్రయల్ కూడా ప్రారంభించింది. ఈ టీకాను హెచ్ విటిఎన్ 702 అంటారు. దీని వల్ల చాలా మంది హెచ్ఐవి సోకిన వారు మెరుగైన ఆరోగ్య సంరక్షణ సౌకర్యాలను పొందుతున్నారు. అంతేకాదు సుదీర్ఘ జీవితాన్ని గడపగలుగుతారు. అంతేకాదు ఈ హెచ్ఐవి వ్యాక్సిన్ ద్వారా కొత్త వ్యక్తులు ఈ వైరస్ బారిన పడకుండా చూడొచ్చు.

వ్యాక్సిన్ల వల్ల దుష్ప్రభావాలు..

వ్యాక్సిన్ల వల్ల దుష్ప్రభావాలు..

అయితే ఈ హెచ్ఐవి టీకా గురించి కొన్ని అపొహలు కూడా ఉన్నాయి. ఒక బ్రిటీష్ వైద్యుడు టీకా మరియు ఆటిజం మధ్య సంబంధాన్ని నివేదించాడు. అయితే అతని వాదనలు మరియు డేటా తప్పు అని తేలిపోయింది. దీంతో అతని మెడికల్ ప్రాక్టీస్ చేయడానికి అతని లైసెన్సు కూడా తొలగించారు. ఆ తర్వాత ఆటిజం మరియు టీ మధ్య ఎలాంటి సంబంధం లేదని మరిన్ని అధ్యయనాలు వెల్లడించాయి. వ్యాక్సిన్ల వల్ల దుష్ప్రభావాలు ఉన్నప్పటికీ, అవి ఎక్కువగా స్వల్పకాలికంగా ఉంటాయి. తక్కువ జ్వరం, గొంతు, కండరాల నొప్పి మొదలైనవి ఉంటాయి.

ఎయిడ్స్ వ్యాక్సిన్ డే చరిత్ర..

ఎయిడ్స్ వ్యాక్సిన్ డే చరిత్ర..

ఎయిడ్స్ వ్యాధి ఎక్కువగా మూడు ప్రధాన కారణాల వల్ల HIV లేదా AIDS వ్యాపిస్తుంది. లైంగిక సంబంధం, తల్లి నుండి బిడ్డకు లేదా శరీర ద్రవాలను మార్పిడి చేయడం ద్వారా ఇది మొదటిసారిగా 1981లో అమెరికాలో వైద్యపరంగా నివేదించబడింది. జూన్ 5, 1981లో ఐదు ఎయిడ్స్ కేసులు కనుగొనబడ్డాయి. HIV1 & HIV2 రెండూ మానవులేతర ప్రైమేట్ల నుండి వచ్చాయి. ఇది ప్రాణాంతకం కావడంతో, ఈ వ్యాధి చుట్టూ అనేక అపొహలు పెరిగిపోయాయి. ప్రజలు హెచ్ఐవి బారిన పడ్డవారిని కించపరచడం ప్రారంభించారు.

1997లో...

1997లో...

తప్పుడు పుకార్ల కారణంగా మరియు తప్పుడు సమాచారం మరియు ద్వేషాన్ని అరికట్టడానికి మరియు వ్యాధి మరింత వ్యాప్తి చెందకుండా ఉండటానికి మే 18న యుఎస్ బిల్ క్లింటన్ ప్రపంచ ఎయిడ్స్ వ్యాక్సిన్ డేగా జరుపుకున్నారు. నివేదికల ప్రకారం, తన 1997 ప్రసంగంలో దీని ప్రాముఖ్యత గురించి మాట్లాడారు. ఈ వ్యాక్సిన్ గురించి అవగాహనను వ్యాప్తి చేయడం గురించి మాట్లాడారు. సురక్షితమైన లైంగిక సంబంధం వల్ల ఈ వ్యాధిని దాని ప్రారంభంలోనే ఆపవచ్చు.

అవగాహన ఉంటేనే..

అవగాహన ఉంటేనే..

మొట్టమొదటి వరల్డ్ ఎయిడ్స్ వ్యాక్సిన్ డే మే 18, 1998న అధికారికంగా జరుపుకుంది. క్లింటన్ ప్రసంగం యొక్క వార్షికోత్సవం సందర్భంగా దీనిని జరుపుకున్నారని మరియు అప్పటి నుండి ఈ సంప్రదాయం పట్టుకున్నట్లు నివేదికలు చెబుతున్నాయి. ఈ వ్యాధి గురించి ప్రజలకు గురించి అవగాహన ఉంటేనే ఎయిడ్స్ ను నివారించవచ్చు. కాబట్టి, ఈరోజు జరుపుకోవడం చాలా అవసరం అని నిర్ణయించారు.

English summary

World AIDS Vaccine Day 2022: Myths and facts about the AIDS vaccine

According to UNAIDS, there were approxmately 36.9 million people affected by AIDS in 2017, all over the world. These numbers speak for the importance of awareness about AIDS and its preventive measures.
Desktop Bottom Promotion