For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

World Aids Vaccine Day 2022 :హెచ్ఐవిని కంట్రోల్ చేయలేమా? వ్యాక్సిన్లు పని చేస్తున్నాయా?

వరల్డ్ ఎయిడ్స్ వ్యాక్సిన్ డే 2022 తేదీ, థీమ్, చరిత్ర, వాస్తవాలు మరియు ప్రాముఖ్యత గురించి ఇప్పుడు తెలుసుకుందాం.

|

World Aids Vaccine Day 2022:ప్రతి సంవత్సరం మే 18వ తేదీన "World AIDS Vaccine Day(ప్రపంచ ఎయిడ్స్ వ్యాక్సిన్ దినోత్సవం) లేదా హెచ్ఐవి వ్యాక్సిన్ అవగాహన దినోత్సవంగా జరుపుకుంటారు.

World Aids Vaccine Day

ఈ వ్యాధి ప్రాణాంతకం కాబట్టి, ఈరోజున ఎయిడ్స్ మరియు దాని రోగనిరోధక చర్యల గురించి అందరికీ అవగాహన కల్పిస్తారు. హెచ్ఐవి వ్యాధి వ్యాప్తి చెందకుండా వ్యాక్సిన్ యొక్క ప్రాధాన్యతను కూడా ఈరోజు తెలియజేస్తుంది.

World Aids Vaccine Day

ప్రస్తుత ఆధునిక యుగంలో ఎందరో ఆరోగ్య నిపుణులు, పరిశోధకులు ఆరోగ్య సంరక్షణ కార్యకర్తలు, స్వచ్ఛంద సేవకులు, విద్యార్థులు, కమ్యూనిటీ సభ్యులు మరియు NGOలు హెచ్ఐవి ఎయిడ్స్ వ్యాప్తి చెందకుండా ఎలా నిరోధించాలి మరియు వైరస్ బారిన పడితే ఎలాంటి చర్యలు తీసుకోవాలనే దానిపై ప్రజలకు అవగాహన కల్పించేందుకు అవిశ్రాంతంగా పని చేస్తున్నారు. వారందరికీ ధన్యవాదాలు చెప్పేదే ప్రపంచ ఎయిడ్స్ వ్యాక్సిన్ డే. ఈ సందర్భంగా ఎయిడ్స్ వ్యాక్సిన్ యొక్క చరిత్ర మరియు ప్రాముఖ్యత, అపొహలు, మరియు వాస్తవాలను తెలుసుకుందాం...

World AIDS Vaccine Day 2022: ఎయిడ్స్ వ్యాధికి ఇప్పటికీ వ్యాక్సిన్ లేదా?World AIDS Vaccine Day 2022: ఎయిడ్స్ వ్యాధికి ఇప్పటికీ వ్యాక్సిన్ లేదా?

ఎయిడ్స్ వ్యాక్సిన్ డే చరిత్ర..

ఎయిడ్స్ వ్యాక్సిన్ డే చరిత్ర..

ఎయిడ్స్ వ్యాధి ఎక్కువగా మూడు ప్రధాన కారణాల వల్ల HIV లేదా AIDS వ్యాపిస్తుంది. లైంగిక సంబంధం, తల్లి నుండి బిడ్డకు లేదా శరీర ద్రవాలను మార్పిడి చేయడం ద్వారా ఇది మొదటిసారిగా 1981లో అమెరికాలో వైద్యపరంగా నివేదించబడింది. జూన్ 5, 1981లో ఐదు ఎయిడ్స్ కేసులు కనుగొనబడ్డాయి. HIV1 & HIV2 రెండూ మానవులేతర ప్రైమేట్ల నుండి వచ్చాయి. ఇది ప్రాణాంతకం కావడంతో, ఈ వ్యాధి చుట్టూ అనేక అపొహలు పెరిగిపోయాయి. ప్రజలు హెచ్ఐవి బారిన పడ్డవారిని కించపరచడం ప్రారంభించారు.తప్పుడు పుకార్ల కారణంగా మరియు తప్పుడు సమాచారం మరియు ద్వేషాన్ని అరికట్టడానికి మరియు వ్యాధి మరింత వ్యాప్తి చెందకుండా ఉండటానికి మే 18న యుఎస్ బిల్ క్లింటన్ ప్రపంచ ఎయిడ్స్ వ్యాక్సిన్ డేగా ప్రకటించారు.

ఎయిడ్స్ వ్యాక్సిన్ డే ప్రాముఖ్యత..

ఎయిడ్స్ వ్యాక్సిన్ డే ప్రాముఖ్యత..

వరల్డ్ ఎయిడ్స్ వ్యాక్సిన్ డే లేదా హెచ్ఐవి వైరస్ అవగాహన దినోత్సవాన్ని నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ అలెర్జీ అండ్ ఇన్ఫెక్షియన్ డిసీజ్(NIAID) నిర్వహిస్తోంది. అమెరికా మాజీ అధ్యక్షుడు బిల్ క్లింటన్ మే 18వ తేదీన తన ప్రసంగంలో ఇలా పేర్కొన్నారు. రాబోయే దశాబ్దంలో సైన్స్ అండ్ టెక్నాలజీలో డెవలప్ చేసిన వ్యాక్సిన్ ను మరింత మెరుగుపరచుకోవడానికి కొత్త లక్ష్యాలను నిర్దేశించుకోవాలని, దీనినే లక్ష్యంగా పెట్టుకున్నట్లు ఆయన వివరించారు.

అధికారికంగా అప్పుడే..

అధికారికంగా అప్పుడే..

1998 సంవత్సరంలో క్లింటన్ ప్రసంగం యొక్క మొదటి వార్షికోత్సవాన్ని పురస్కరించుకుని మొట్టమొదటి ప్రపంచ ఎయిడ్స్ వ్యాక్సిన్ దినోత్సవాన్ని పాటించారు. టీకాలు, నివారణ మరియు కమ్యూనిటీలకు అవగాహన కల్పించడానికి ప్రతి సంవత్సరం ప్రపంచవ్యాప్తంగా ఉన్న సంఘాలు, స్వచ్ఛంద సంస్థలు అనేక రకాల కార్యకలాపాలను నిర్వహిస్తున్నాయి.

వ్యాక్సిన్ల వల్ల సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయా?

వ్యాక్సిన్ల వల్ల సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయా?

ఈ హెచ్ఐవి టీకా గురించి కొన్ని అపొహలు కూడా ఉన్నాయి. ఒక బ్రిటీష్ డాక్టర్ వ్యాక్సిన్ అండ్ ఆటిజం మధ్య సంబంధాన్ని నివేదించాడు. అయితే అతని వాదనలు మరియు డేటా తప్పు అని తేలిపోయింది. దీంతో అతని మెడికల్ ప్రాక్టీస్ చేయడానికి అతని లైసెన్సు కూడా తొలగించారు. ఆ తర్వాత ఆటిజం మరియు వ్యాక్సిన్ మధ్య ఎలాంటి సంబంధం లేదని మరిన్ని అధ్యయనాలు వెల్లడించాయి. వ్యాక్సిన్ల వల్ల దుష్ప్రభావాలు ఉన్నప్పటికీ, అవి తక్కువ స్థాయిలోనే ఉంటాయి. తక్కువ జ్వరం, గొంతు, కండరాల నొప్పి మొదలైనవి ఉంటాయి.

FAQ's
  • వరల్డ్ ఎయిడ్స్ వ్యాక్సిన్ డే ఎప్పుడు జరుపుకుంటారు?

    ప్రతి సంవత్సరం మే 18వ తేదీన "World AIDS Vaccine Day(ప్రపంచ ఎయిడ్స్ వ్యాక్సిన్ దినోత్సవం) లేదా హెచ్ఐవి వ్యాక్సిన్ అవగాహన దినోత్సవంగా జరుపుకుంటారు. ఈ వ్యాధి ప్రాణాంతకం కాబట్టి, ఈరోజున ఎయిడ్స్ మరియు దాని రోగనిరోధక చర్యల గురించి అందరికీ అవగాహన కల్పిస్తారు. హెచ్ఐవి వ్యాధి వ్యాప్తి చెందకుండా వ్యాక్సిన్ యొక్క ప్రాధాన్యతను కూడా ఈరోజు తెలియజేస్తుంది.

English summary

World Aids Vaccine Day 2022 Date, Theme, History, Facts and Significance in Telugu

Here we are talking about the world aids vaccine day 2022 date, theme, history, facts and significance in Telugu. Read on
Story first published:Tuesday, May 17, 2022, 21:32 [IST]
Desktop Bottom Promotion