For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

World Animal Day 2021:ప్రపంచ జంతు దినోత్సవ ఉద్దేశ్యం ఏంటో తెలుసా...

ప్రపంచ జంతు దినోత్సవం 2021 తేదీ, చరిత్ర, థీమ్ మరియు ప్రాముఖ్యత గురించి ఇప్పుడు తెలుసుకుందాం.

|

ఈ విశ్వంలో మనుషులతో పాటు ఎన్నో రకాల జీవరాశులు జీవనం కొనసాగిస్తున్నాయి. అయితే మనుషుల కంటే ముందే జంతువులు ఈ భూమి మీద తొలిసారిగా పుట్టాయని సైంటిస్టులు చెబుతున్నారు.

World Animal Day 2021: Date, History, Theme and Significance

కానీ భూమి ఆవిర్భవించిన తర్వాత పుట్టిన చాలా జంతువుల జాతులు ఇప్పుడు కనుమరుగైపోయాయి. ప్రస్తుత డిజిటల్ యుగంలో కూడా మనకు తెలిసిన ఎన్నో జంతువులు అంతరించిపోతున్నాయి. ఇలా జంతువులు కనుమరుగు కాకుండా, వాటిని పరిరక్షించడమే ధ్యేయంగా 'ప్రపంచ జంతు దినోత్సవం' జరుపుకుంటారు.

World Animal Day 2021: Date, History, Theme and Significance

ఇలా ప్రతి సంవత్సరం అక్టోబర్ నాలుగో తేదీన ప్రపంచ జంతు దినోత్సవ వేడుకలను జరుపుకుంటారు. ఈ సందర్భంగా ప్రపంచ జంతు దినోత్సవాన్ని తొలిసారిగా ఎప్పుడు జరుపుకున్నారు? ఎవరి జ్ణాపకార్థం ఈ వేడుకలను నిర్వహిస్తారనే ఆసక్తికరమైన విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం...

తొలిసారి ఎక్కడంటే..

తొలిసారి ఎక్కడంటే..

ఈ జంతు దినోత్సవాన్ని తొలిసారిగా 1931వ సంవత్సరంలో ఇటలీలోని ఫ్లోరెన్స్ లో జరుపుకున్నారు. పర్యావరణ పరిరక్షుడు సెయింట్ ఫ్రాన్సిస్ ఆఫ్ అసిసి పండుగను పురస్కరించుకుని ప్రతి ఏటా అక్టోబర్ 4వ తేదీన ఈ జంతు దినోత్సవాన్ని నిర్వహిస్తారు. మన జీవనానికి అనివార్యమైన జంతు సంపదను పరిరక్షించడం, వాటిని పెంచి పోషించడం, జంతువుల హక్కుల కాపాడటమే ఈ దినోత్సవ ముఖ్య ఉద్దేశ్యం.

జంతువులతో అవినాభవ సంబంధం..

జంతువులతో అవినాభవ సంబంధం..

మనుషులకు, జంతువులకు మధ్య ఉన్న అవినాభవ సంబంధాన్ని ఈ దినోత్సవం తెలియజేస్తుంది. ఈరోజున జంతు సంక్షేమ ప్రచారాలతో పాటు జంతు పరిరక్షక శిబిరాలను ప్రారంభించడం, జంతు సంరక్షణకు నిధులు సేకరించడం వంటి కార్యక్రమాలను నిర్వహిస్తారు.

ఆహారం కోసం..

ఆహారం కోసం..

వాస్తవానికి మనలో చాలా మంది జంతువుల ఆవాసాలను నాశనం చేస్తున్నారు. విచక్షణ రహితంగా అడవులు నరుకుతూ వాటి తావులను, మంచినీటి వనరులను ధ్వంసం చేస్తున్నారు. ఈ కారణాల వల్లే జంతువులు గ్రామాలు, పట్టణాల్లోకి వచ్చేస్తున్నాయి. ఆహారం కోసం మనలో చాలా మందిపై దాడి చేస్తున్నాయి.

జంతువులకు ఆవాసం..

జంతువులకు ఆవాసం..

ఇలాంటి పరిస్థితులను మార్చడం కూడా ఈ జంతు దినోత్సవ లక్ష్యాల్లో ఒకటి. జంతువులకు సహజ సిద్ధమైన ఆవాసాలను కల్పించడం, జంతు జాతులను రక్షించడం, వాటి సంక్షేమాన్ని కాపాడటమే ప్రధాన లక్ష్యాలు. అందుకే ఈరోజు జంతు ప్రేమికుల దినోత్సవం అని కూడా అంటారు.

FAQ's
  • ప్రపంచ జంతు దినోత్సవాన్ని ఎప్పుడు జరుపుకుంటారు?

    ప్రతి సంవత్సరం అక్టోబర్ నాలుగో తేదీన ప్రపంచ జంతు దినోత్సవం జరుపుకుంటారు. ఈ జంతు దినోత్సవాన్ని తొలిసారిగా 1931వ సంవత్సరంలో ఇటలీలోని ఫ్లోరెన్స్ లో జరుపుకున్నారు.

English summary

World Animal Day 2021: Date, History, Theme and Significance

Here we are talking about the world animal day 2021: date, history, theme and significance. Read on
Desktop Bottom Promotion