Latest Updates
-
చీఫ్ గెస్ట్ గా పిలవలేదని.. క్రికెట్ పిచ్ ను ట్రాక్టర్‌తో దున్నేసిన పొలిటికల్ లీడర్..వీడియో చూడండి -
JEE మెయిన్ రిజల్ట్ టెన్షన్ ఉందా? చాణక్యుడి ఈ సూత్రాలు పాటిస్తే విజయం మీదే -
జంక్ ఫుడ్ వద్దు.. కుర్ కురేకి బదులు ఇంట్లోనే క్రిస్పీ బెండకాయ పకోడీ చేసుకోండిలా! -
పదే పదే నీళ్లు తాగుతున్నారా? సద్గురు చెబుతున్న ఈ షాకింగ్ నిజాలు తెలుసుకోండి! -
బరువు తగ్గాలా? జిమ్ తర్వాత ప్రొటీన్ కావాలా? అయితే ఈ నల్ల శెనగల సలాడ్ మీ కోసమే! -
ఎండల తీవ్రతతో సతమతమవుతున్నారా? ఈ చిట్కాలతో శరీరాన్ని చల్లబరుచుకోండి! -
5 నిమిషాల్లో అదిరిపోయే ఎగ్ బర్గర్.. టేస్ట్ చూస్తే ఫిదా అవ్వాల్సిందే! -
అక్షయ తృతీయ 2026: ఈ సమయం దాటితే పూజ ఫలితం ఉండదా? -
వృషభం, కన్య, మకర రాశుల వారికి ధన యోగం.. ఎవరికి అదృష్టం వరించనుంది? - సోమవారం, 20 ఏప్రిల్ 2026 -
ఎండలను ఎదిరించే కమ్మని పానీయం..మసాలా మజ్జిగ తయారీ విధానం ఇదే!
World Bicycle Day 2022:సైకిల్ తొక్కితే సెక్స్ సామర్థ్యం పెరుగుతందట...!
వరల్డ్ సైకిల్ డే 2022 తేదీ, థీమ్, చరిత్ర, కార్యకలాపాలు మరియు ఆసక్తికరమైన విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం.
ఒకప్పుడు ప్రపంచ వ్యాప్తంగా సైకిళ్లను విపరీతంగా వాడేవారు. వీటికి తెగ డిమాండ్ ఉండేది. అంతేకాదు సైకిల్ తొక్కితే ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు సైతం ఉన్నాయని అందరికీ తెలుసు.

అయితే ప్రస్తుత డిజిటల్ యుగంలో సైకిళ్ల వాడకం తగ్గిపోయిందనడంలో ఎలాంటి సందేహం లేదు. టెక్నాలజీ పెరగడం.. మోటార్ సైకిళ్లు, ఎలక్ట్రిక్ వాహనాలు రావడం వల్ల సైకిల్ ను తొక్కేందుకు చాలా మంది ఆసక్తి చూపడం లేదు. అయితే సైకిల్ వాడటం వల్ల పర్యావరణానికి మేలు చేయడంతో పాటు మన ఆరోగ్యానికి కూడా ఎన్నో అద్భుతమైన ప్రయోజనాలు ఉన్నాయి. అన్నింటికంటే ముఖ్యంగా సైకిల్ ఎవరైతే రెగ్యులర్ గా తొక్కుతారో వారిలో సెక్స్ సామర్థ్యం బాగా ఉంటుందని ఆరోగ్య నిపుణులు సైతం స్పష్టం చేశారు. అందుకే సైకిల్ అనేక క్రీడ, ఆరోగ్య సంరక్షణ క్రీడల్లో వాడేందుకు వినియోగిస్తుంటారు. అంతేకాదు వాతావరణం గురించి ప్రతి ఒక్కరికీ అవగాహన కల్పిచేందుకు ప్రత్యేక అవగాహన కల్పిస్తారు. ఈ నేపథ్యంలోనే ప్రతి సంవత్సరం జూన్ 3వ తేదీన వరల్డ్ సైకిల్ డే జరుపుకుంటారు. 2018 సంవత్సరంలో ఏప్రిల్ నెలలో ఐక్యరాజ్య సమితి సర్వసభ్య సమావేశంలో ఈ తీర్మానాన్ని ప్రవేశపెట్టింది. ఈ దినోత్సవాన్ని జరుపుకునేందుకు లెస్జెక్ సిబిల్క్సి అనే ఓ సామాజికవేత్త ప్రచారం, తుర్క్మనిస్తాన్ 56 ఇతర దేశాల మద్దతు ఫలితంగా ఈ దినోత్సవాన్ని నిర్వహిస్తున్నారు. ఆచార్య స్వన్సన్ సహకారంతో ఐజాక్ ఫెల్డ్ ప్రపంచ సైకిల్ దినోత్సవం సందర్భంగా ఒక లోగోను తయారు చేశారు. ఇదే ప్రపంచ వ్యాప్తంగా వివిధ రకాల ద్విచక్ర వాహనదారులకు చిహ్నంగా మారింది. ఈ సందర్భంగా సైకిల్ డే ప్రాముఖ్యత, సైకిల్ తొక్కడం వల్ల కలిగే లాభాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం...

సైకిల్ డే ప్రాముఖ్యత..
సమాజంలో సైకిల్ వాడే కల్చర్ ను మెరుగుపరచేందుకు, ప్రోత్సహించేందుకు కావాల్సిన ఉత్తమ పద్ధతులను, సరైన మార్గాలను పొందేలా సభ్య దేశాలను ప్రోత్సహిస్తుంది. రోడ్డు భద్రతను మెరుగుపరిచేందుకు సభ్య దేశాలను ప్రోత్సహించడమే కాకుండా పాదచారుల భద్రతను కాపాడేందుకు కూడా సైకిల్ డే ప్రోత్సహిస్తుంది.

సైకిల్ వాడకంతో..
శారీరక శ్రమను బలంగా మార్చుకునేందుకు, రోగాలను నివారించేందుకు, మనలో సహనాన్ని పెంచేందుకు, సామాజిక దూరాలను సులభతరం చేయడం వంటి విషయాల గురించి తెలియజేయడమే సైకిల్ డే ముఖ్య ఉద్దేశ్యం. పెట్రోల్, డిజీల్ వంటి ధరలు రోజురోజుకు ఆకాశాన్నంటుతున్న నేపథ్యంలో సైకిల్ కొనేందుకు చాలా మంది ఆసక్తి చూపుతున్నారు. ఇది చాలా మంచి పరిణామంగా పర్యావరణవేత్తలు చెబుతున్నారు.

అనేక ప్రయోజనాలు..
సైకిల్ రెగ్యులర్ గా తొక్కడం వల్ల అనేక ప్రయోజనాలు ఉన్నాయి. శారీరక వ్యాయామానికి సైకిల్ తొక్కడం ఎంతో మంచిది. బీపీ, మధుమేహం లాంటి వ్యాధులు దరి చేరకుండా ఉంటాయి.

సెక్స్ సామర్థ్యం..
అంతేకాదు సైకిల్ వాడకం వల్ల సెక్స్ సామర్థ్యం పెరుగుతుందన్న విషయం చాలా మందికి తెలియదు. ఎందుకంటే ఆ కార్యంలో పని చేసే కండరాలన్నీ సైక్లింగులో కూడా వాడతారట. దీంతో రెగ్యులర్ గా సైకిల్ తొక్కడం వల్ల మీ సెక్స్ సామర్థ్యం రెట్టింపవుతుంది. మీ జీవిత కాలం కూడా పెరుగుతుంది. రెగ్యులర్ గా కనీసం ఐదు నుండి ఆరు కిలోమీటర్లు సైకిల్ తొక్కితే ఆరోగ్యానికి ఎంతో ప్రయోజనకరమని వైద్యులు సూచిస్తున్నారు. కాబట్టి సైకిల్ ఉన్నవారంతా రెగ్యులర్ గా తొక్కండి.
ప్రతి సంవత్సరం జూన్ 3వ తేదీన వరల్డ్ సైకిల్ డే జరుపుకుంటారు. 2018 సంవత్సరంలో ఏప్రిల్ నెలలో ఐక్యరాజ్య సమితి సర్వసభ్య సమావేశంలో ఈ తీర్మానాన్ని ప్రవేశపెట్టింది. ఈ దినోత్సవాన్ని జరుపుకునేందుకు లెస్జెక్ సిబిల్క్సి అనే ఓ సామాజికవేత్త ప్రచారం, తుర్క్మనిస్తాన్ 56 ఇతర దేశాల మద్దతు ఫలితంగా ఈ దినోత్సవాన్ని నిర్వహిస్తున్నారు. ఆచార్య స్వన్సన్ సహకారంతో ఐజాక్ ఫెల్డ్ ప్రపంచ సైకిల్ దినోత్సవం సందర్భంగా ఒక లోగోను తయారు చేశారు. ఇదే ప్రపంచ వ్యాప్తంగా వివిధ రకాల ద్విచక్ర వాహనదారులకు చిహ్నంగా మారింది.



Click it and Unblock the Notifications











