For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

World Food Day 2021:ఆహారం వృథాను ఎలా తగ్గించాలి.. మీరంతా ఫుడ్ హీరోలుగా మారేందుకు చేయాల్సినవి...

|

ప్రపంచంలో ఏ ఒక్కరూ ఆకలితో అలమటించకూడదని.. అందరికీ ఆహారం లభించాలన్నదే.. వరల్డ్ ఫుడ్ డే ప్రధాన లక్ష్యం. ప్రతి సంవత్సరం అక్టోబర్ 16వ తేదీన ప్రపంచ ఆహార దినోత్సవాన్ని ప్రపంచవ్యాప్తంగా జరుపుకుంటారు.

ప్రపంచవ్యాప్తంగా దాదాపు 150 దేశాలు ఈ కార్యక్రమంలో పాల్గొంటాయి. ఈరోజు 1945లో స్థాపించబడిన యునైటెడ్ నేషన్స్ ఫుడ్ అండ్ అగ్రికల్చర్ ఆర్గనైజేషన్(FAO)సూచిస్తుంది. కరోనా వైరస్ కారణంగా ప్రస్తుతం చాలా మందికి ఆహారం, ఆరోగ్యంపై అవగాహన పెరిగింది.

పోషకాహారాన్ని తీసుకోవాల్సిన బాధ్యతను గుర్తు చేస్తోంది. అయితే ప్రస్తుత సమాజంలో ప్రతి ఒక్కరికీ మూడు పూటలా కడుపు నిండా ఆహారం లభించడం లేదని గణాంకాలు చెబుతున్నాయి.

ఈ నేపథ్యంలో నేడు ప్రపంచ ఆహార దినోత్సవం గురించి అనేక విషయాలు తెలుసుకోవాల్సిన అవసరం మనపై ఉంది. ఆ విశేషాలేంటో ఇప్పుడు తెలుసుకుందాం...

వరల్డ్ ఫుడ్ డే 2021 థీమ్..

వరల్డ్ ఫుడ్ డే 2021 థీమ్..

గత ఏడాది ప్రపంచ ఆహార దినోత్సవం యొక్క థీమ్ ‘ఎదగండి.. పోషించండి.. నిలబెట్టుకోండి.. ఈ చర్యలతో మనకు భవిష్యత్తు' కరోనా మహమ్మారి కారణంగా లక్షలాది మందిని బాధను దృష్టిలో ఉంచుకుని ఇది నిర్ణయించబడింది. ఈ ఏడాది ఎవ్వరూ ఆకలితో ఉండాల్సిన స్థిరమైన ప్రపంచాన్ని నిర్మించడంలో సహకరించిన ఫుడ్ హీరోలు లేదా వ్యక్తులను ఉద్దేశించి ఈ వేడుకలను జరుపుకోవడం దృష్టి పెట్టారు. విశేషం ఏంటంటే.. మనలో ప్రతి ఒక్కరూ హీరోలు కావొచ్చు. ఆకలి లేని ప్రపంచాన్ని నిర్మించాలనే ఆలోచనకు దోహదం చేయొచ్చు. FAO కూడా అదే కోణంలో పని చేస్తున్న ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఫుడ్ హీరోల పనిని హైలైట్ చేసింది.

వరల్డ్ ఫుడ్ డే చరిత్ర..

వరల్డ్ ఫుడ్ డే చరిత్ర..

ప్రపంచ ఆహార దినోత్సవం వాస్తవానికి 1979 సంవత్సరంలో FAO స్థాపించబడిన రోజును సూచిస్తుంది. అయితే ఇది క్రమంగా ఆకలి, పోషకాహార లోపం, నిలకడ మరియు ఆహార ఉత్పత్తి గురించి అవగాహన పెంచడానికి ఒక మార్గంగా మారింది. డిసెంబర్ 1980వ సంవత్సరం డిసెంబర్ 5 నుండి యునైటెడ్ నేషన్స్ సభ్యులు ఈరోజు పాటించడానికి అంగీకరించారు. UN సెక్రటరీ జనరల్ సెప్టెంబర్ 2021లో మొట్టమొదటి ఫుడ్ సిస్టమ్స్ సమ్మిట్ ను ఏర్పాటు చేస్తున్నారు. FAQ వెబ్ సైట్ ఆహారం మరియు ఆకలి, అలాగే వ్యవసాయ ఆహార వ్యవస్థ గురించి కొన్ని ఆశ్చర్యకరమైన గణాంకాలను హైలైట్ చేస్తుంది.

ఆహారం గురించి మనం నమ్మలేని నిజాలు..

ఆహారం గురించి మనం నమ్మలేని నిజాలు..

* ప్రపంచ జనాభాలో దాదాపు 40% మంది ఆరోగ్యకరమైన ఆహారం తీసుకోలేకపోతున్నారు.

* నిశ్చల జీవనశైలి కారణంగా 2 మిలియన్ల మంది ఊబకాయం లేదా అధిక బరువుతో బాధపడుతున్నారు.

* ప్రపంచంలోని గ్రీన్ హైస్ వాయు ఉద్గారాలలో 33% కంటే ఎక్కువ ప్రపంచ ఆహార వ్యవస్థలు బాధ్యత వహిస్తాయి.

* పంటకోత, నిర్వహణ, నిల్వ మరియు రవాణా సరిపడకపోవడం వల్ల ప్రపంచంలోని 14 % వృథా అవుతోంది. వినియోగదారుల నుండి దాదాపు 17% వృథా అవుతోంది.

* ప్రపంచంలోని వ్యవసాయ-ఆహార వ్యవస్థలు 1 బిలియన్ మందికి పైగా పని చేస్తున్నాయి. ఇవి ఇతర రంగాల కంటే ఎక్కువ.

ఆహార వ్యర్థాలను ఎలా తగ్గించాలంటే..

ఆహార వ్యర్థాలను ఎలా తగ్గించాలంటే..

FAO ప్రకారం, మనమందం ఫుడ్ హీరోలుగా మారొచ్చు. మనం అందరికీ సహాయం చేయడానికి మన వంతు ప్రయత్నం చేయొచ్చు. మనం ప్రభుత్వంలో లేదా ప్రైవేటు రంగం, పౌర సమాజం లేదా విద్యాసంస్థలో ఉన్నా.. ‘ప్రక్రుతి తో కలిసిపోవడం' ద్వారా ప్రక్రుతి నుండి నేర్చుకోవడం ముఖ్యం. మీరు ఇప్పటినుంచే ఇలాంటి చర్యలను తీసుకోవడం ప్రారంభించడానికి కొన్ని మార్గాలున్నాయి. అవేంటో చూడండి.

* ఆరోగ్యకరమైన ఆహారాన్ని ఎంపిక చేసుకోండి. అల్ట్రాప్రాసెస్ చేసిన ఆహార పదార్థాలకు దూరంగా ఉండండి. మార్కెట్ మనకు అందించే వాటిని ప్రభావితం చేయడానికి మరియు ఆరోగ్యకరమైన శరీరం మరియు పర్యావరణాన్ని కాపాడేందుకు దోహదపడుతుంది.

* మీకు ఆరోగ్యకరమైన మరియు పర్యావరాణానికి నిలకడగా ఉండే ఉత్పత్తులను ఎంచుకోండి. మీరు ఉత్పత్తులను ఎంచుకునే ముందు లేబుల్స్ మరియు ప్యాకేజింగును జాగ్రత్తగా చూడండి.

* ఆహార నిల్వను మెరుగుపరచండి మరియు ఇంట్లో వృథాను తగ్గించండి అని FAO సూచిస్తుంది. వీలైనంత వరకు రీసైకిల్ చేయండి మరియు ఇంట్లో పాత నీటిని తిరిగి ఉపయోగించుకోండి. కంపోస్టింగ్ చేయడానికి ప్రయత్నించండి. పోషకాలను తిరిగి మట్టిలో వేయండి. మీరు పండ్లు, కూరగాయలు లేదా మూలికల యొక్క మీ సొంత గ్రీన్ కలర్ ను ప్రారంభించొచ్చు.

* స్థానిక పర్యావరణ వ్యవస్థలను పెంపొందించడానికి చిన్న రైతులు మరియు స్థానిక ఉత్పత్తి దారులకు మద్దతు ఇవ్వండి.

ప్రపంచ ఆహార దినోత్సవ ప్రాముఖ్యత..

ప్రపంచ ఆహార దినోత్సవ ప్రాముఖ్యత..

ప్రజలందరికీ పోషకాహారం కల్పించాలనే లక్ష్యంతో ఐక్యరాజ్య సమితి ముందుకు వెళ్తోంది. ప్రపంచంలోని నలుమూలల నివసించే వారందరికీ ఆహారం అందించాలని.. అందరికీ ఆహార భద్రత కల్పించడమే గాక.. అందరికీ పోషకాహారం లభించేందుకు అవసరమైన చర్యలను చేపట్టడానికి అనేక అవగాహన కార్యక్రమాలను UN చేపట్టనుంది.

English summary

World Food Day 2021: Date, Theme, Significance And How To Reduce Food Waste

World Food Day is an annual event that is observed every year on 16 October. The day marks the anniversary of the United Nations Food and Agriculture Organisation. To know more about this day, scroll down the article.