Latest Updates
-
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.! -
రసం, సాంబార్ రుచిని మరిపించే కేరళ స్టైల్ ఉల్లిపాయ పులుసు.. అన్నంలోకి అదరహో.! -
పుస్తక జ్ఞానం ఒక్కటే కాదు.. గురువుల నుంచి నేర్చుకోవాల్సిన జీవిత పాఠాలు ఇవే.! -
గర్భిణీలకు బలాన్ని ఇచ్చే ఫుడ్.. మధ్యాహ్నం హడావుడి లేకుండా ఈజీగా చేసుకునే టేస్టీ డిష్.! -
పూరీ, చపాతీలోకి అదుర్స్ అనిపించే నీలగిరి వెజ్ కుర్మా..అమృతం తిన్న ఫీలింగ్! -
గుండెను పదిలంగా ఉంచడంతో పాటు పొట్ట ఆరోగ్యాన్ని కాపాడే ఫ్రూట్.. మీ భోజనంలో తప్పనిసరి.! -
తరాలు మారినా ఖ్యాతి మారదు.. పూర్వీకుల బలాన్ని ఇచ్చే ఉలవ చట్నీ.. ఇడ్లీ, దోశలోకి అమృతమే.! -
నీచ భంగ రాజయోగం: కర్కాటకంలోకి కుజ సంచారంతో ఈ రాశుల వారికి దరిద్రం వదిలిపోతుంది.! -
అమ్మ జన్మనిస్తే, గురువు జీవితాన్ని ఇస్తాడు.. టీచర్స్ డే స్పెషల్ వాట్సాప్ స్టేటస్, బెస్ట్ విషెస్ ఇవే!
World Lion Day 2021:సింహం ఎప్పుడూ సింగిల్ గానే అటాక్ చేస్తుందా?
సింహం గురించి కొన్ని ఆసక్తికరమైన విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం.
అడవికి రారాజు ఎవరంటే అందరూ టక్కున చెప్పే పేరు సింహం. 'సింహం ఎప్పుడూ సింగిల్ గానే వస్తుంది' అనే డైలాగ్ మనం సినిమాల్లో ఎక్కువగా వింటూ ఉంటాం.

అయితే వాస్తవానికి సింహం సింగిల్ గా ఎప్పుడూ ఉండదట. సింహాలు ఎల్లప్పుడూ గుంపులుగానే ఉంటాయట. అవి దాదాపు పది, పదిహేను గుంపులుగా ఉంటాయట. వాటి గుంపును ఫ్రైడ్ అంటారు. అలాంటి సింహాలకు ఓ రోజు ఉంటుందని తెలుసా..

ఆరోజే ఎప్పుడో కాదు.. ఈరోజే(ఆగస్టు 10వ తేదీ). ఈరోజున సింహాలకు పండుగలా చేస్తారు. కొన్ని వేడుకలు కూడా జరుపుతారు. అంతరించిపోతున్న జాబితాలో సింహాల సంఖ్య కూడా పెరుగుతోందట. అందుకే సింహాలను కాపాడాలనే ఉద్దేశ్యంతో ప్రతి సంవత్సరం ఆగస్టు 10వ తేదీన సింహాల దినోత్సవం జరుపుకుంటున్నాం. వరల్డ్ లయన్స్ డే 2021 సందర్భంగా సింహాల గురించి కొన్ని ఆసక్తికరమైన విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం...

సింహం గర్జిస్తే..
ఒక పెద్ద మగ సింహం గర్జిస్తే దాదాపు ఎనిమిది కిలోమీటర్ల దూరం వినబడుతుందట. అంతేకాదు ఒక మగ సింహం ప్రతిరోజూ ఐదు కేజీల వరకు మాంసాన్ని ఈజీగా తినేస్తుందట. అదే ఆడ సింహం అయితే ఏకంగా దాదాపు ఏడు కేజీల వరకు మాంసం తింటుదట.

సింహం జీవితకాలం..
ఒక సింహం దాదాపు 25 సంవత్సరాలు జీవిస్తుందని నిపుణులు చెబుతున్నారు. సింహం బిడ్డని కబ్ అని పిలుస్తారట. అయితే ప్రతి ఒక్క సింహం దాదాపు 12 నుండి 16 సంవత్సరాలు సులభంగా బతికేస్తుంది. మగ సింహాలు 226 కేజీల వరకు బరువు పెరగుతాయి. అదే విధంగా 8 అడుగుల పొడవు పెరుగుతాయి. మగ సింహాలు చూడటానికి చాలా ఆకర్షణీయంగా ఉంటాయి. వాటి తల,మెడ చుట్టూ భారీగా జుట్టు ఉంటుంది. అందువల్ల చూడటానికి అతి పెద్దవిగా కనిపిస్తాయి. ఇక సింహం పిల్లల్లో మగవి పెరిగే కొద్దీ.. తమ జీవితంలో తాము చూసుకుంటాయి. తల్లిదండ్రులపై ఆధారపడటం మానేస్తాయి.

ఆడ సింహాలు..
అదే మగ సింహాలతో పోలిస్తే.. ఆడ సింహాలు కాస్త చిన్నగా ఉంటాయి. కానీ అవి వేగంగా పెరుగుతాయి. ఆడ సింహాలు వాటి తోబుట్టువులను కలిగి ఉంటాయి. అలా ఉంటూనే గుంపులోనూ ఉంటాయి. ఈ సింహాలు రాత్రి వేళ ఎక్కువగా వేటాడతాయి. ఎందుకంటే వాటికి రాత్రి వేళ కళ్లు బాగా కనిపిస్తాయి.

విశాల వాతావరణం..
సింహాలకు దట్టమైన అడవుల్లో నివసించడం నచ్చదు. అవి గడ్డి మైదానాల్లో ఉండేందుకే ఇష్టపడతాయి. ఎందుకంటే వాటిని చూస్తే.. అంతా ప్రశాంతమైన విశాలమైన వాతావారణం కనిపిస్తుంది. అందుకే వాటికి అవి బాగా నచ్చుతాయి.

ఒకే రంగు..
సింహాలు ప్రపచంలో ఏ ప్రాంతంలో ఉన్నప్పటికీ.. వాటి రంగు ఒకే మాదిరిగా ఉంటుంది. లైట్ ఎల్లో కలర్ నుండి డార్క్ బ్రౌన్ మాదిరిగా ఉంటుంది. సింహం కాళ్ల గోళ్లు చాలా పెద్దవిగా ఉంటాయి. అవి దాదాపు 10 సెంటిమీటర్ల వరకు ఉంటాయి. నివేదికల ప్రకారం.. వంద సంవత్సరాల క్రితం ఆఫ్రికాలో 2 లక్షల దాకా సింహాలు జీవించేవి. తాజా సర్వేలో వాటి సంఖ్య దాదాపు 30 వేలకు తగ్గిపోయింది.

సింహాలపై అవగాహన..
అందుకే సింహాలను ఎలా కాపాడాలి.. వాటి పెరుగుదలకు తీసుకోవాల్సిన చర్యల గురించి ప్రపంచ దేశాలు ఆగస్టు 10వ తేదీన చర్చిస్తాయి. అలాగే సింహాల గురించి విద్యార్థులు, పిల్లలు, ప్రజల్లో అవగాహన కల్పించేందుకు కార్యక్రమాలు నిర్వహిస్తారు. ఈ నేపథ్యంలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ట్వీట్ చేశారు. ‘సింహం గొప్పది. ధైర్యానికి నిర్వచనం. సింహాలకు నిలయం ఉన్నందుకు భారత్ గర్వపడుతోంది ప్రపంచ సింహ దినోత్సవం రోజు సింహాల పరిరక్షణపై మక్కువ ఉన్న ప్రజలందరినీ అభినందిస్తున్నా. కొన్నేళ్లు మన దేశంలో సంఖ్య పెరుగుతోంది.. తాను గుజరాత్ సీఎంగా ఉన్నప్పుడు సింహాలకు సురక్షితమైన ఆవాసాలు ఏర్పాటు చేసినట్టు' గుర్తు చేశారు. సింహాల సంఖ్య పెరుగుదల కోసం అనేక కార్యక్రమాలు కూడా నిర్వహించామన్నారు.



Click it and Unblock the Notifications