For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

World Students Day 2021: అబ్దుల్ కలామ్ జయంతి రోజునే.. విద్యార్థి దినోత్సవాన్ని ఎందుకు జరుపుకుంటారో తెలుసా...

ఎపిజె అబ్దుల్ కలామ్ పుట్టినరోజే ఎందుకు ఈ దినోత్సవాన్ని జరుపుకుంటారనే ఆసక్తికరమైన విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం.

|

మన భారత మాజీ రాష్ట్రపతి అబ్దుల్ కలామ్ జన్మదినం (అక్టోబర్ 15వ తేదీ) సందర్భంగా ప్రపంచ వ్యాప్తంగా అంతర్జాతీయ విద్యార్థుల దినోత్సవాన్ని జరుపుకుంటారు. రామేశ్వరంలో పేపర్ బాయ్ నుండి రాష్ట్రపతిగా.. ఎదిగిన కలామ్ సేవలను గుర్తు చేసుకుంటూ.. ఆయన చేసిన సేవలకు ప్రతీకగా 2010లో యునైటెడ్ నేషన్స్ డాక్టర్ ఎపిజె అబ్దుల్ కలామ్ దినోత్సవాన్ని ప్రతి ఏటా వరల్డ్ స్టూడెంట్స్ డే గా జరుపుకోవాలని నిర్ణయించింది.

World Students Day 2021 Date, History, and Why We Celebrated APJ Abdul Kalam Birthday as Students day

సైన్స్ అండ్ టెక్నాలజీ రంగంలో ఆయన సాధించిన విజయాలు మరియు శాస్త్రీయ మరియు రాజకీయ కెరీర్లో ఉత్తమ ఉపాధ్యాయుడి పాత్రను గౌరవించారు. ఈ అక్టోబర్ 15వ తేదీ విజయదశమి పండుగ రోజునే అబ్దుల్ కలామ్ జయంతి రావడం విశేషం. ఈయన జయంతి సందర్భంగా ప్రపంచంలోని ప్రముఖలందరూ, మన దేశంలోని అన్ని రాజకీయ పార్టీల నాయకులు ఆయన చేసిన సేవలను గుర్తు చేసుకుంటూ అబ్దుల్ కలామ్ కు నివాళులు అర్పిస్తారు. అదేవిధంగా పాఠశాలలు, మరియు కళాశాలల్లో వేడుకలు జరుగుతాయి.

World Students Day 2021 Date, History, and Why We Celebrated APJ Abdul Kalam Birthday as Students day

అబ్దుల్ కలాం చేసిన క్రుషి, చిత్తశుద్ధి, వినయం మరియు సానుకూలత కారణంగా ఆయనకు ప్రపంచ వ్యాప్తంగా మిలియన్ల సంఖ్యలో విద్యార్థులు ఇప్పటికీ స్ఫూర్తిదాయకమైన రోల్ మోడల్ గా భావిస్తున్నారు.

రామేశ్వరం నుండి రాష్ట్రపతి వరకు మిస్సైల్ మ్యాన్ అబ్దుల్ కలామ్ ప్రస్థానమిలా...రామేశ్వరం నుండి రాష్ట్రపతి వరకు మిస్సైల్ మ్యాన్ అబ్దుల్ కలామ్ ప్రస్థానమిలా...

ప్రపంచ విద్యార్థి దినోత్సవ చరిత్ర..

ప్రపంచ విద్యార్థి దినోత్సవ చరిత్ర..

1939 సంవత్సరంలో అక్టోబర్ 15వ తేదీన తమిళనాడు రాష్ట్రం రామేశ్వర్వంలో జన్మించిన డాక్టర్ ఎపిజె అబ్దుల్ కలామ్ చిన్ననాటి నుండే విద్య పట్ల బలమైన నిబద్ధతతో ఉండటం వల్ల అతను విద్యావేత్త గా మారేలా చేసింది. ఆయన సిద్ధాంతాలు కూడా చాలా స్పష్టంగా ఉన్నాయి. సగటు విద్యార్థిగా ఎదిగేందుకు, కేవలం పాఠ్యపుస్తక పరిజ్ణానం మాత్రమే సరిపోదని, తన సిద్ధాంతాలను చదవడం మరియు వాటి ఆచరణాత్మక అనువర్తనాలను అర్థం చేసుకోవడం వంటి అన్ని ఎంపికలను అన్వేషించాలి.

యువతకు స్ఫూర్తి..

యువతకు స్ఫూర్తి..

తన రాజకీయ మరియు శాస్త్రీయ జీవితమంతా డాక్టర్ కలాం తనను తాను ఉపాధ్యాయుడిగా భావించారు. అందుకే అతను విద్యార్థులనుద్దేశించి మాట్లాడేటప్పుడు చాలా సంతోషంగా ఉండేవారు. తను విద్యార్థులకు బోధన మరియు స్ఫూర్తిదాయకం పట్ల చాలా ఆసక్తి చూపేవాడు. ఆయన ప్రభుత్వ ప్రిన్సిపల్ సైంటిఫిక్ అడ్వైజర్ పదవిని విడిచిపెట్టిన తర్వాత, అతను టీచర్ గా మారాడు. తన జ్ణానం, రచనలు, ప్రేరణాత్మక సందేశాలు యువతకు ఎంతగానో స్ఫూర్తినిచ్చాయి.

ప్రపంచ విద్యార్థుల దినోత్సవ యొక్క లక్ష్యాలు..

ప్రపంచ విద్యార్థుల దినోత్సవ యొక్క లక్ష్యాలు..

విద్యార్థులు జీవితంలో ఒక లక్ష్యాన్ని కలిగి ఉండాలి.

ప్రతి చోట జ్ణానాన్ని గ్రహించాలి. తమ లక్ష్యం కోసం కష్టపడి పని చేయాలి. ఓటమి గురించి ఆలోచించొద్దు.

విద్యార్థులు తమ పాత్రను సమర్థవంతంగా పోషించాలి. అప్పుడే మీరు కోరుకున్న ఫలితాలొస్తాయి.

మంచి లక్షణాలను అలవర్చుకోవాలి.

మంచి లక్షణాలను అలవర్చుకోవాలి.

ప్రతి విద్యార్థీ కచ్చితంగా క్రమశిక్షణతో కూడిన జీవితాన్ని గడపాలి.

ఒక ఆదర్శ విద్యార్థి అన్ని మంచి లక్షణాలను అలవర్చుకోవాలి. తనను తాను ఇతర విద్యార్థులకు చూపించాలి.

FAQ's
  • అబ్దుల్ కలామ్ ఎప్పుడు, ఎక్కడ జన్మించారు?

    మాజీ రాష్ట్రపతి అబ్దుల్ కలామ్ తమిళనాడు రాష్ట్రంలోని రామేశ్వరంలో అక్టోబర్ 15వ తేదీన జన్మించారు.

English summary

World Students Day 2021 Date, History, and Why We Celebrated APJ Abdul Kalam Birthday as Students day

In 2010, the United Nations declared Dr APJ Abdul Kalams birthday (15 October) as World Students Day to honour his accomplishments in the field of science and technology.
Story first published:Friday, October 15, 2021, 0:20 [IST]
Desktop Bottom Promotion