For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

World Teachers’ Day 2023:అంతర్జాతీయ టీచర్స్ డే థీమ్ ఏంటో తెలుసా...

|

World Teachers' Day 2023: మన జీవితంలో ఉపాధ్యాయులు లేని జీవితం ఊహించలేనిది. వారి ప్రభావం అనునిత్యం మనపై ఏదో ఒక సందర్భంలో కనిపిస్తూనే ఉంటుంది. ఇదిలా ఉండగా.. మనం స్కూల్ లేదా కాలేజీలో ఉన్నప్పుడు కొందరు టీచర్లు మనకు పూస గుచ్చినట్టు అన్నీ సబ్జెక్టులు అర్థమయ్యేలా క్లాస్ చెబుతారు. మరికొందరు సబ్జెక్ట్ తప్ప ఇతర విషయాలను ఎక్కువగా చెబుతారు.

ఇంకా కొందరు ఉపాధ్యాయులు పాఠాలతో పాటు జీవితంలోని ఆసక్తికరమైన విషయాలను చెబుతారు. అందుకే మన దేశంలో తల్లిదండ్రుల తర్వాత గురువలకే పెద్ద పీట వేస్తుంటాం. గురువును సాక్షాత్తు దేవుడితో సమానంగా గౌరవిస్తారు. ఎందుకంటే నేటి బాలలను.. రేపటి పౌరులుగా మార్చి.. ఆ పౌరులను బాధ్యతాయుత వ్యక్తులుగా.. బంగారు భవిష్యత్తుకు మార్గ నిర్దేశకులుగా.. ప్రగతి రథ సారథులుగా నిలిపేవారే టీచర్లు. ఇలాంటి టీచర్లందనీ గుర్తించేందుకు..

World Teachers’ Day 2023: Date, History, Significance, Activities & How To Celebrate

ఉపాధ్యాయులను ప్రోత్సహించేందుకు ప్రతి సంవత్సరం అక్టోబర్ 5 తేదీన అంతర్జాతీయ టీచర్స్ డే జరుపుకుంటారు. ఈ సందర్భంగా వరల్డ్ టీచర్స్ డే చరిత్ర, ప్రాముఖ్యత, థీమ్ గురించి తెలుసుకుందాం...

అంతర్జాతీయ టీచర్స్ డే 2023 థీమ్ ఏంటో తెలుసా...

అంతర్జాతీయ టీచర్స్ డే 2023 థీమ్ ఏంటో తెలుసా...

సాధారణంగా మన దేశంలో సెప్టెంబర్ 5వ తేదీన డాక్టర్ సర్వేపల్లి రాధాక్రిష్ణన్ గారి జయంతిని పురస్కరించుకుని ఉపాధ్యాయ దినోత్సవం జరుపుకుంటాం. అయితే ప్రపంచ వ్యాప్తంగా అంతర్జాతీయ ఉపాధ్యాయ దినోత్సవాన్ని మాత్రం అక్టోబర్ ఐదో తేదీన జరుపుకుంటారు. ఉపాధ్యాయులు మరియు బోధనకు సంబంధించిన సమస్యలను పరిగణనలోకి తీసుకోవడానికి ప్రతి సంవత్సరం ప్రపంచ ఉపాధ్యాయ దినోత్సవం జరుపుకుంటారు. ఈరోజున ఉపాధ్యాయులకు అవసరమైన ప్రశంసలు, విద్యార్థుల పట్ల ఉపాధ్యాయులు అందించిన సహకారాన్ని స్మరించుకుంటూ 1994 నుండి ప్రపంచ ఉపాధ్యాయ దినోత్సవం జరుపుకోవడం ప్రారంభించారు.

ఉపాధ్యాయ దినోత్సవ చరిత్ర..

ఉపాధ్యాయ దినోత్సవ చరిత్ర..

ప్రపంచ ఉపాధ్యాయ దినోత్సవం 1966 సంవత్సరంలో ఇంటర్నేషనల్ లేబర్ ఆర్గనైజేషన్ (ILO)యునైటెడ్ నేషన్స్ ఎడ్యుకేషనల్, సైంటిఫిక్ అండ్ కల్చరల్ ఆర్గనైజేషన్ (యునెస్కో) ఉపాధ్యాయుల స్థితికి సంబంధించిన సిఫార్సును ఆమోదించిన వార్షికోత్సవాన్ని గుర్తించింది. 1966 సిఫార్సును పూర్తి చేయడానికి 1997లో ఉన్నత విద్యాబోధన సిబ్బంది స్థితికి సంబంధించిన సిఫార్సు ఆమోదించబడింది.

భవిష్యత్ తరాలకు..

భవిష్యత్ తరాలకు..

ఉపాధ్యాయులు విద్యార్థులకు అందించే ప్రోత్సాహాన్ని గుర్తు చేస్తూ వారిని గౌరవించడం మరియు భవిష్యత్తు తరాలకు అవసరాలను తీర్చిదిద్దే ఉపాధ్యాయుల ప్రాముఖ్యత గురించి అందరికీ అవగాహన కల్పించాలనే ఉద్దేశ్యంతో అంతర్జాతీయ టీచర్స్ డే జరుపుకోవడం ప్రారంభించారు. ఈ దినోత్సవాన్ని ప్రపంచవ్యాప్తంగా దాదాపు 100 దేశాలలో జరుపుకుంటారు. ఈరోజు పాఠశాలలు మరియు కళాశాలలో టీచర్లకు సంబంధించిన కొన్ని కార్యక్రమాలు నిర్వహించబడతాయి.

విద్యా పునరుద్ధరణ..

విద్యా పునరుద్ధరణ..

UNESCO, ILO, UNICEF మరియు ఎడ్యుకేషన్ ఇంటర్నేషనల్ సంయుక్త ప్రకటనలో ‘ప్రపంచ ఉపాధ్యాయ దినోత్సవం రోజున ఉపాధ్యాయులను గౌరవించడం మాత్రమే కాదు.. ఆయా దేశాలలో పెట్టుబడులు పెట్టాలని మరియు ప్రపంచ విద్యా పునరుద్ధరణ ప్రయత్నాలలో ప్రాధాన్యతనివ్వాలని మేము ప్రతి దేశానికి పిలుపునిస్తున్నాం. అర్హత కలిగి ఉన్న ప్రతి ఒక్క ఉపాధ్యాయుడికి మద్దతుగా నిలబడదాం' అని భరోసా కల్పించారు.

వరల్డ్ టీచర్స్ డే ప్రాముఖ్యత..

వరల్డ్ టీచర్స్ డే ప్రాముఖ్యత..

ప్రపంచ ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా ఉపాధ్యాయుల సేవ మరియు విద్యకు సంబంధించిన వారి సహకారం గుర్తించబడింది. ఉపాధ్యాయ రంగానికి సంబంధించిన సవాళ్లను పరిగణనలోకి తీసుకోవడానికి ఇదొక అవకాశం. ఈరోజున ఉపాధ్యాయ రంగానికి సంబంధించిన సమస్యలను పరిష్కరించేందుకు మరియు టీచర్ల హక్కులు, బాధ్యతలను గుర్తించడానికి ఒక మంచి సందర్భంం.

వరల్డ్ టీచర్స్ డే 2023 థీమ్..

వరల్డ్ టీచర్స్ డే 2023 థీమ్..

ప్రపంచ ఉపాధ్యాయ దినోత్సవం 2023 యొక్క థీమ్ ‘Teachers at the heart of education recovery' (విద్య పునరుద్ధరణలో టీచర్ల మనసు లగ్నం అవ్వాలి). యునెస్కో ప్రకారం, ఈ సంవత్సరం ఐదు రోజుల పాటు ప్రపంచ మరియు ప్రాంతీయ సంఘటనల శ్రేణి కరోనావైరస్ మహమ్మారి ఉపాధ్యాయ రంగంపై తీవ్ర ప్రభావాన్ని చూపింది.. చూపుతోంది.. అయితే దీన్ని ఎదుర్కొనేందుకు సమర్థవంతమైన మరియు ఆశాజనకమైన విధాన ప్రతి స్పందనలను హైలెట్ చేస్తుంది. బోధనా సిబ్బంది తమ పూర్తి సామర్థ్యాన్ని డెవలప్ చేసుకునేలా చూసుకోవాలి.

FAQ's
  • అంతర్జాతీయ ఉపాధ్యాయ దినోత్సవం ఎప్పుడు జరుపుకుంటారు?

    ప్రపంచ వ్యాప్తంగా అంతర్జాతీయ ఉపాధ్యాయ దినోత్సవాన్ని అక్టోబర్ ఐదో తేదీన జరుపుకుంటారు.

English summary

World Teachers’ Day 2023: Date, History, Significance, Activities & How To Celebrate

Here we are talking about the world teacher's day 2023: date, history, significance, activities & how to celebrate. Have a look
Desktop Bottom Promotion