For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

World Tourism Day 2021:పర్యాటకంలోనే పరవశం.. పర్యటనతో ఉల్లాసం.. ఉత్సాహం.. మీ సొంతం...

|

టూరిజం ఒక అద్భుతం..
టూరిజం మనకొక వరం..
టూరిజంలో పరవశం..
టూరిజంతో ఆనందం..
టూరిజంతో ఆదాయం..
టూరిజం లేనిదే లేదు జీవితం..

మనలో చాలా మంది ప్రతిరోజూ ఆఫీసు, స్కూల్, కాలేజీకి వెళ్లడం లేదా ఇంకేదైనా పనికి వెళ్లడం వంటి రోటీన్ వర్క్ చేయడాన్ని బోర్ ఫీలవుతారు. ఎందుకంటే రోజూ ఇంటి నుండి ఒకే ప్లేసుకు వెళ్లి తిరిగి రావడం.. చేసిన పని చేయడం వల్ల చాలా చిరాకు కలుగుతుంది.

అయితే ఇలా జరగకుండా ఉండాలంటే.. మీరు అప్పుడప్పుడు కొన్ని కొత్త ప్రదేశాలకు వెళ్లాలి.. ముఖ్యంగా పర్యాటక ప్రాంతాల్లో పర్యటిస్తే.. మీరు కచ్చితంగా కొత్త అనుభూతిని పొందుతారు. ఎందుకంటే అలా పర్యటించడం వల్ల మీరు చాలా చురుగ్గా మారిపోతారు. మీ లైఫ్ స్టైల్ కూడా కొంచెం కొత్తగా మారుతుంది. కొత్త కొత్త ప్రదేశాలు చూడటం.. కొత్త విషయాలు నేర్చుకోవడం.. చారిత్రక విషయాలను తెలుసుకోవడం వల్ల నాలెడ్జ్ కూడా పెరుగుతుంది.

అందుకోసం మన చుట్టూ కొన్ని వేలు, లక్షల సంఖ్యలో పర్యాటక ప్రదేశాలున్నాయి. ఇలాంటి ప్రదేశాలకు మీరు ఒక్కసారైనా వెళ్లొస్తే మీ మనసు పరవశించిపోతుంది. మీ జీవితంలో ఎన్ని ఇబ్బందులైనా ఉండొచ్చు.. వాటన్నింటినీ అధిగమించి.. మీరు ప్రశాంతతను కోరుకుంటే మాత్రం.. మీరు రోటీన్ పనులకు కాస్త బ్రేక్ ఇచ్చి.. కొత్త ప్రదేశాలను చుట్టి రావాలి. అప్పుడు మీరు కచ్చితంగా రిఫ్రెష్ అవుతారు. ఈ నేపథ్యంలో ప్రపంచ పర్యాటక దినోత్సవం కూడా వచ్చేసింది. ఈ ప్రత్యేకమైన రోజున ఏదైనా కొత్త ప్రదేశానికి వెళ్తే.. అక్కడి చారిత్రాత్మక అందాలను చూసి మీరు మంచి మానసిక ఉల్లాసాన్ని పొందడమే కాదు అనేక విషయాలు తెలుసుకోవచ్చు. ఈ సందర్భంగా వరల్డ్ టూరిజం గురించి కొన్ని ఆసక్తికరమైన విషయాలను తెలుసుకుందాం...

పర్యాటక దినోత్సవం

పర్యాటక దినోత్సవం

ప్రపంచ వ్యాప్తంగా సెప్టెంబర్ 27వ తేదీన ప్రపంచ పర్యాటక దినోత్సవం(World Tourism Day) జరుపుకుంటారు. పర్యాటక రంగాన్ని మరింతగా అభివ్రుద్ధి చేసేందుకు, స్థానిక సంఘాల నైపుణ్యాలు సాధించడంతో పాటు వాటి వల్ల కలిగే ఉపయోగాల గురించి అందరికీ తెలియజేసేందుకు 2014 సంవత్సరంలో ప్రపంచ పర్యాటక దినోత్సవం థీమ్ ‘టూరిజం అండ్ కమ్యూనిటీ డెవలప్ మెంట్'గా ప్రారంభించారు.

2021లో టూరిజం థీమ్

2021లో టూరిజం థీమ్

2015 సంవత్సరంలో ప్రపంచంలో అనేక మార్పులు తీసుకురాలనే ఉద్దేశంతో 2015లో యునైటెడ్ నేషన్స్ సస్టైనబుల్ డెవలప్ మెంట్ గోల్స్ పై ఫోకస్ పెట్టారు. ఇక 2021లో టూరిజం థీమ్ ఏంటంటే ‘Tourism for Inclusive Growth పర్యాటక రంగ వ్రుద్ధి కోసం అందరినీ కలుపుకుపోవడం'. అందుకే ఈ ప్రత్యేకమైన రోజున అనేక టూరిజం ఆర్గనైజేషన్స్ ప్రజలను ఆకర్షించేందుకు విభిన్నమైన పోటీలను నిర్వహిస్తారు. ఉచిత ప్రవేశాలు, ప్రత్యేక ఆఫర్లు.. స్పెషల్ డిస్కౌంట్లతో ప్రజలందరినీ పర్యాటక రంగం అంటే పరవశించిపోయేలా.. ఈ రంగం వైపు ప్రతి ఒక్కరూ ఆసక్తి పెంచుకునేలా వివిధ కార్యక్రమాలు నిర్వహిస్తారు.

పర్యాటకులను విపరీతంగా ఆకట్టుకోవడం

పర్యాటకులను విపరీతంగా ఆకట్టుకోవడం

ప్రస్తుతం కరోనా మహమ్మారి తగ్గుముఖం పట్టడంతో ప్రపంచవ్యాప్తంగా పర్యాటక రంగం నెమ్మదిగా పుంజుకుంటోంది. ఎన్నో అపురూపమైన, అందమైన, చారిత్రాత్మకమైన ప్రదేశాలను చూసి ఆనందించేందుకు ప్రజలంతా ఇప్పుడిప్పుడే బయటకు వస్తున్నారు. ఈ నేపథ్యంలో ప్రపంచంలోని పర్యాటక ప్రదేశాలన్నీ పర్యాటకులను విపరీతంగా ఆకట్టుకోవడం ప్రారంభించాయి. అందుకే డెవలప్ అవుతున్న చాలా దేశాలకు టూరిజం వల్ల ఎక్కువ ఆదాయం వస్తోంది.

వరల్డ్ టూరిజం ఎప్పటి నుంచి

వరల్డ్ టూరిజం ఎప్పటి నుంచి

ప్రపంచ పర్యాటక దినోత్సవాన్ని మొట్టమొదటిగా 1980వ సంవత్సరంలో యునైటెడ్ నేషన్స్ వరల్డ్ టూరిజం ఆర్గనైజేషన్ ప్రతినిధులు ప్రారంభించారు. అయితే 1970వ సంవత్సరంలోనే ఈ కాన్సెప్ట్ ను నిర్వహించారు. అప్పటి నుండి ప్రతి సంవత్సరం ఒక్కో థీమ్ మరియు ఒక్కో కాన్సెప్ట్ తో ఈ దినోత్సవాన్ని నిర్వహిస్తున్నారు. పర్యాటకం యొక్క ప్రాముఖ్యత, సామాజిక, సాంస్క్రుతిక, రాజకీయ, ఆర్థిక విలువల గురించి అంతర్జాతీయంగా ప్రజలకు అవగాహన కల్పించేలా ఈ పర్యాటక దినోత్సవాన్ని నిర్వహిస్తారు.

టూరిజం ప్రాముఖ్యత..

టూరిజం ప్రాముఖ్యత..

ప్రపంచ పర్యాటక దినోత్సవం యొక్క ప్రాముఖ్యత ఏంటంటే.. ప్రతి ఒక్కరికీ పర్యాటకం, సామాజిక, కల్చరల్, రాజకీయ మరియు ఆర్థిక విలువల గురించి అవగాహన కల్పించేందుకు ఆ ఆర్గనైజేషన్ ప్రతినిధులు ఈ దినోత్సవాన్ని ప్రారంభించారు. ‘టూరిజం కంట్రిబ్యూషన్ అండ్ టు పీస్ అండ్ మ్యూచువల్ అండర్ స్టాండింగ్' అనే పేరుతో దీన్ని స్టార్ట్ చేశారు. ఇలా ప్రతి సంవత్సరం ఒక్కో అంశాన్ని తీసుకుని పర్యాటకం పట్ల ప్రతి ఒక్కరిలోనూ ఆసక్తి కలిగించడంతో పాటు చారిత్రక విషయాలను గుర్తు చేసుకునేందుకు ఒక అవకాశంగా తీసుకుంటున్నారు.

కొత్త విషయాలు..

కొత్త విషయాలు..

మీరు కొత్త ప్రదేశాలకు వెళ్లినప్పుడు.. అక్కడ నివసించే ప్రజలు.. వారి సంప్రదాయాలు, కట్టుబాట్లు, ఆచార వ్యవహారాలు.. వారి జీవనోపాధి ఏంటనే విషయాలు మనల్ని ఆలోచింపజేస్తాయి. కొన్ని ప్రయాణాలు అయితే మనకు మంచి అనుభూతిని ఇస్తాయి. మళ్లీ మళ్లీ వెళ్లాలని మనసు ఊగిసలాడిపోతుంది. కాబట్టి మీరు వీలైనంత త్వరగా ఏదైనా టూర్ ప్లాన్ చేసేయ్యండి.. హ్యాపీగా గడిపేయండి.

English summary

World Tourism Day 2021, Date, History and Significance in Telugu

Here we are talking about the World Tourism Day 2021, date, history and significance in Telugu. Read on
Story first published: Monday, September 27, 2021, 8:00 [IST]