Latest Updates
-
మాంసం కంటే 4 రెట్లు ఎక్కువ బలం..శరీరానికి ఉక్కు లాంటి బలాన్నిచ్చే పచ్చికొబ్బరి లడ్డూ చేసుకోండిలా.. -
అమ్మాయిలూ అలర్ట్.. నెలసరిలో తీవ్రంగా కడుపు నొప్పి, అలసట.. ఈ ఐదు తప్పులే కారణం.! -
సజ్జ రొట్టె చేయడం ఇంత ఈజీనా.. ఈ 3 టిప్స్‌తో చపాతీ కంటే సాఫ్ట్‌గా చేసేయొచ్చు.! -
చికెన్ లెగ్ పీస్‌లతో స్పైసీ కుష్కా.. ఇలా చేశారంటే లొట్టలేసుకుంటూ తినాల్సిందే.! -
ఆఫీస్ బ్యాగ్‌తో ఈ పొరపాట్లు.. మీ జేబును ఖాళీ చేస్తాయంటే నమ్ముతారా.? -
బిర్యానీ రుచిని తలదన్నే కొబ్బరి పాల మటన్ పులావ్.. సండే స్పెషల్ అదిరిపోవాల్సిందే.! -
మూత్రంలో మంటతో పాటు విపరీతమైన జ్వరం.. నిర్లక్ష్యం చేస్తే ఈ పార్ట్‌కి ముప్పు తప్పదు.! -
'పోషకాల నిధి' పొట్టు మినప్పప్పు ఆవిరి కుడుములు.. ఒక్కటి తిన్నా రోజంతా ఎనర్జీ.! -
విపరీత రాజయోగం: అక్టోబర్ 31 వరకు ఈ రాశుల వారిపై గురు కటాక్షంతో ఎనలేని కీర్తి, సంపద.! -
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.!
World Veterinary Day 2022:పశు వైద్య దినోత్సవం ఎందుకు జరుపుకుంటారంటే...
వరల్డ్ వెటర్నరీ డే 2022 సందర్భంగా, దీని చరిత్ర మరియు ప్రాముఖ్యత గురించి ఇప్పుడు తెలుసుకుందాం.
ప్రతి సంవత్సరం ఏప్రిల్ నెలలో చివరి శనివారం రోజున ప్రపంచ పశు వైద్య దినోత్సవాన్ని జరుపుకుంటారు. 2022లో ఏప్రిల్ 30వ తేదీన వరల్డ్ వెటర్నరీ డే వచ్చింది. ఈరోజున జంతువుల ఆరోగ్యం, సంరక్షణ మరియు జంతు హింసను నిరోధించడానికి తీసుకోవాల్సిన ప్రయత్నాల గురించి అవగాహన పెంచడమే లక్ష్యంగా కార్యక్రమాలను నిర్వహిస్తారు. ఈరోజున పెంపుడు జంతువుల సంరక్షణకు సంబంధించిన అనేక అంశాల గురించి చెబుతూ.. పెంపుడు జంతువు యజమానులు ఎలా ఉండాలో తెలియజేస్తారు.

ఈ ఏడాది థీమ్ ఏంటంటే..
'వెటర్నరీ రెసిలెన్స్ ను బలోపేతం చేయడం' అనేది 2022 వరల్డ్ వెటర్నరీ డే థీమ్. పశు వైద్య వైద్యులకు వారి ప్రాక్టీస్ సమయంలో ఏవి అవసరమవుతాయో వారికి అన్ని సహాయ సహకారాలు అందించాలని, వనరులను ఏర్పాటు చేయాలని ఈ థీమ్ యొక్క ముఖ్య ఉద్దేశ్యం. ఇది పశు వైద్యులు, పశు వైద్య సంఘాలు మరియు ఇతరులు పశు వైద్య స్థితిస్థాపకతను పెంపొందించడానికి మరియు ఈ ముఖ్యమైన విషయంపై అందరి ద్రుష్టిని ఆకర్షించడానికి అపారమైన ప్రయత్నాలను కూడా గుర్తిస్తుంది.
వరల్డ్ వెటర్నరీ డే చరిత్ర..
1863 సంవత్సరంలో మొట్టమొదటిసారిగా యూరోపియన్ వెటర్నరీల ఆధ్వర్యంలో ప్రొఫెసర్ జాన్ జామ్జీ వెటర్నరీ కాలేజీలో ఈ వరల్డ్ వెటర్నరీ డేను జరుపుకున్నారు. అప్పటి సమావేశంలో ఇంటర్నేషనల్ వెటర్నరీ కాంగ్రెస్ గా నిర్ణయించారు. 8వ సెషన్ నుండి వరల్డ్ వెటర్నరీ కాంగ్రెస్ సభ్యులు 1906లో శాశ్వత కమిటీని ఏర్పాటు చేశారు.

స్టాక్ హోమ్(స్వీడన్ రాజధాని)లో నిర్వహించిన 15వ సెషన్లో శాశ్వత కమిటీ సభ్యులు మరియు ఇతర వెటర్నరీ కాంగ్రెస్ సభ్యులు ఒక పెద్ద సంస్థ అవసరమని భావించారు. దీంతో 1959లో మాడ్రిడ్ లో వరల్డ్ వెటర్నరీ అసొసియేషన్ స్థాపించబడింది. అనంతరం 1997లో కొత్త రాజ్యాంగం ఏర్పడింది. ఇది సంస్థ యొక్క నిర్మాణం కూడా పూర్తిగా పునర్నిర్వచించింది. ప్రస్తుతం 70 కంటే ఎక్కువ ప్రపంచ దేశాలు వెటర్నరీ అసొసియేషన్లో ప్రాతినిథ్యం వహిస్తున్నాయి.
ఈ అసొసియేషన్లో ఉండే ప్రతి సభ్యుడు వార్షిక సభ్యత్వ రుసుమును చెల్లించాలి. అనంతరం 2001 సంవత్సరంలో, వరల్డ్ వెటర్నరీ అసొసియేషన్ ఏప్రిల్ చివరి శనివారం రోజున ఈ పశు వైద్య దినోత్సవాన్ని జరుపుకోవాలని నిర్ణయించింది.
ఈ వరల్డ్ వెటర్నరీ అసొసియేషన్ అనేక ప్రయోజనకరమైన ప్రాజెక్టులపై పని చేస్తుంది. 2008లో వరల్డ్ వెటర్నరీ అవార్డును కూడా ఇవ్వాలనే నిర్ణయం తీసుకున్నారు. దీని వల్ల పశువైద్య ప్రొఫెషన్ ను ప్రోత్సహించడంలో ప్రయోజనకరంగా ఉంటుందని భావించారు. ఇందులో భాగంగా కెన్యా వెటర్నరీ అసొసియేషన్ తొలిసారిగా ఈ గౌరవ అవార్డును పొందింది.
వరల్డ్ వెటర్నరీ డే ప్రాముఖ్యత..
* ప్రపంచ పశు వైద్య దినోత్సవం యొక్క కొన్ని లక్ష్యాలు ఇలా ఉన్నాయి.
* వెటర్నరీ సైన్స్ లో యువత చురుగ్గా పాల్గొనేలా ప్రోత్సహించాలి. ఈ పరిశ్రమను ప్రాచుర్యంలోని తీసుకురావడంలో సహాయపడాలి.
* మంచి ఆహార పద్ధతులు మరియు భద్రతా విధానాల ద్వారా జంతు భద్రతకు ప్రాధాన్యత ఇవ్వడం
* జంతువులకు జీవన పరిస్థితుల కల్పించడం. వాటి ఎదుగుదలను మెరుగుపరచడం, ముఖ్యంగా ఎవరూ పట్టించుకోని వాటికి
* జంతువుల ద్వారా సంక్రమించే వ్యాధుల గురించి మరియు పెంపుడు జంతువులకు రోగ నిరోధక శక్తిని ఎలా అందించాల తెలుసుకోవడానికి ఇతరులను ప్రేరేపించడం.
* ఈ అద్భుతమైన ప్రపంచంలో ప్రపంచవ్యాప్తంగా ఉన్న పశువైద్యులకు దన్యవాదాలు తెలపాలి.
ప్రతి సంవత్సరం ఏప్రిల్ నెలలో చివరి శనివారం రోజున ప్రపంచ పశు వైద్య దినోత్సవాన్ని జరుపుకుంటారు. 2022లో ఏప్రిల్ 30వ తేదీన వరల్డ్ వెటర్నరీ డే వచ్చింది. ఈరోజున జంతువుల ఆరోగ్యం, సంరక్షణ మరియు జంతు హింసను నిరోధించడానికి తీసుకోవాల్సిన ప్రయత్నాల గురించి అవగాహన పెంచడమే లక్ష్యంగా కార్యక్రమాలను నిర్వహిస్తారు.2008లో వరల్డ్ వెటర్నరీ అవార్డును కూడా ఇవ్వాలనే నిర్ణయం తీసుకున్నారు. దీని వల్ల పశువైద్య ప్రొఫెషన్ ను ప్రోత్సహించడంలో ప్



Click it and Unblock the Notifications