Latest Updates
-
అమ్మమ్మల నాటి అమృతం.. వేసవిలో ఒంటికి చలువ చేసే తరవాని చారు -
కొంతమంది ప్రతిసారీ రాంగ్ పర్సన్ కే ఎందుకు ఎట్రాక్ట్ అవుతుంటారో తెలుసా? -
పైన మీగడ, లోపల కమ్మటి రుచి.. ఇంట్లోనే పక్కా ధాబా స్టైల్ మలై లస్సీ..ఎలా చేసుకోవాలంటే -
అచ్చం బేకరీ రుచితో కొబ్బరి బర్ఫీ.. తక్కువ సమయం, అదిరిపోయే టేస్ట్! -
కరివేపాకుతో ఈ 5 ఆహారాలు కలిపి తింటే.. మీ ఎముకలు ఉక్కులా మారుతాయి! -
వేడివేడి అన్నం, కాస్త నెయ్యి, గోంగూర కారం..ఆహా ఏమి రుచి! -
ప్రెగ్నెన్సీ ప్లాన్ చేస్తున్నారా? ముందు మహిళలు సరిదిద్దుకోవాల్సిన అతిపెద్ద సమస్య ఇదే! -
స్పైసీ మటన్ లివర్ ఫ్రై..ఈ సీక్రెట్ మసాలాతో చేస్తే ప్లేట్ ఖాళీ చేస్తారు! -
కరలాడే టమాటా మురుకులు.. ఒక్కసారి రుచి చూస్తే అస్సలు వదిలిపెట్టరు! -
రోజు తినే పెరుగన్నమే కదా అని తీసిపారేయకండి.. ఇలా స్పెషల్ గా చేస్తే గిన్నె ఖాళీ అవ్వాల్సిందే!
హైదరాబాద్‌లో షాపింగ్ కోసం బెస్ట్ ప్లేసెస్ ఇవి, రాజధాని కల్చర్ మైమరిపిస్తుంది
హైదరాబాద్ స్ట్రీట్ షాపింగ్ కు చాలా ప్రసిద్ధి. ఇక్కడ అందుబాటు ధరల నుండి అత్యధిక ధరల వరకు అన్నీ దొరుకుతాయి. పర్యాటక ప్రాంతాలతో పాటు ఈ ప్రాంతాల్లో షాపింగ్ కూడా చేయండి. గొప్ప అనుభూతికి లోనవుతారు.
హైదరాబాద్ ను సిటీ ఆఫ్ సుల్తాన్స్ అని కూడా అంటారు. చాలా మందికి హైదరాబాద్ అనగానే హైదరాబాదీ దమ్ బిర్యానీ, చార్మినార్ లాంటివి గుర్తొస్తాయి. అయితే హైదరాబాద్ సంస్కృతి సాంప్రదాయాలకు కూడా చాలా ప్రసిద్ధి. ఇక్కడ ఉండే విభిన్న సంస్కృతి పర్యాటకులను విశేషంగా ఆకట్టుకుంటుంది. హైదరాబాద్ స్ట్రీట్ షాపింగ్ కు చాలా ప్రసిద్ధి. ఇక్కడ అందుబాటు ధరల నుండి అత్యధిక ధరల వరకు అన్నీ దొరుకుతాయి.

మీరు హైదరాబాద్ లో ఉంటున్నా, లేదా హైదరాబాద్ కు రావాలనుకుంటున్నా.. పర్యాటక ప్రాంతాలతో పాటు ఈ ప్రాంతాల్లో షాపింగ్ కూడా చేయండి. గొప్ప అనుభూతికి లోనవుతారు.
1. కోటి మార్కెట్
హైదరాబాద్ గురించి తెలిసిన దాదాపు ప్రతి ఒక్కరికీ కోటి మార్కెట్ గురించి తెలిసే ఉంటుంది. ఇక్కడ కోటి సుల్తాన్ బజార్ మార్కెట్ స్ట్రీట్ షాపింగ్ కు బెస్ట్ ప్లేస్. ఇక్కడ మహిళలకు సంబంధించిన ప్రతి ఒక్క ఐటెం దొరుకుతుంది. నగలు, చెప్పులు, బ్యాగులు, దుస్తులు, ఇన్నర్ వేర్ ఇలా ప్రతి ఒక్కటీ ఉంటుంది.
జనాలు, వాహనాల రద్దీ ఎక్కువగా ఉంటుంది. ఎంత బేరం ఆడుకుంటే అంత తక్కువ ధరలో వచ్చేస్తాయి.
2. నాంపల్లి
ఇక్కడ అన్ని రకాల వస్తువులు దొరుకుతాయి. బ్యాగులు, పర్సులు, ఆభరణాలు, బ్యాంగిల్స్, బట్టలు, పాదరక్షలు ఇలా ప్రతి ఒక్కటీ ఉంటుంది. నాంపల్లి ఫర్నీచర్ కు చాలా ఫేమస్. చాలా తక్కువ ధరలోనే మన్నికైన, మంచి డిజైన్ ఉన్న ఫర్నీచర్ ఉంటుంది.
ఇక్కడి ప్రతి ఏటా జనవరి, ఫిబ్రవరి నెలల్లో నుమాయిష్ ఎగ్జిబిషన్ జరుగుతుంది. హైదరాబాద్ లో ఈ ఎగ్జిబిషన్ చాలా ప్రసిద్ధి. దేశంలోని అన్ని ప్రాంతాలకు చెందిన వస్తువులు ఈ ఎగ్జిబిషన్ లో దొరుకుతాయి.
3. బేగం బజార్
ఆభరణాలు, గృహోపకరణాలు, వంటపాత్రలు, ఫర్నీచర్ ఒక్కటని కాదు ఇక్కడ దొరకని వస్తువంటూ ఉండదు. బేగం బజార్ గల్లీల్లో తిరిగే ఓపిక ఉండాలంతే. రాష్ట్రంలోని అతిపెద్ద పొగాకు మార్కెట్ ఇక్కడ ఉంటుంది.
బేగం బజార్ లో శానిటరీ వస్తువులు, సెంట్లు, పెర్ఫ్యూమ్స్, సౌందర్య ఉత్పత్తులు ఇలా చాలా ఐటెమ్స్ ఉంటాయి. బేగం బజార్ కు గణనీయమైన చరిత్ర ఉంది.
4. లాడ్ బజార్
చార్మినార్ కు సమీపంలో ఉంటుంది లాడ్ బజార్. ఇది హైదరాబాద్ లోని పురాతనమైన, అత్యంత ప్రసిద్ధ మార్కెట్లలో ఒకటి. ఈ లాడ్ బజార్ రాత్రి పూట మిరుమిట్లు గొలిపే లైటింగ్ తో ఆకట్టుకుంటుంది.
ఇక్కడ దొరికే గాజులు, ఆభరణాలను చాలా మంది ఇష్టపడతారు. గాజులతో పాటు చీరలు, ఖారా దుపట్టాలు, వెండి వస్తువులు, పురాతన వస్తువులు ఇలా చాలా దొరుకుతాయి.
5. జుమ్మెరాత్ బజార్
జుమ్మెరాత్ బజార్ హైదరాబాద్ ప్రసిద్ధ మార్కెట్. దీనినే చోర్ బజార్ అని కూడా పిలుస్తుంటారు. ఇక్కడ A-Z అన్ని రకాల వస్తువులు దొరుకుతాయి. జుమ్మెరాత్ అంటే ఫ్రైడే ఈవ్ అని అర్థం. ఈ మార్కెట్ ప్రతి గురువారం ముస్లిం జంగ్ బ్రిడ్జికి సమీపంలో జరుగుతుంది అలా దీనికి జుమ్మెరాత్ బజార్ అనే పేరు వచ్చింది.
దొంగలించిన వస్తువులు ఇక్కడ లభిస్తుంటాయి. అలా దీనిని చోర్ బజార్ అని కూడా పిలుస్తుంటారు. గుండు పిన్నుల నుండి బైక్ ల వరకు ప్రతి ఒక్కటీ ఇక్కడ దొరుకుతుంది.
6. ఆంటిక్ మార్కెట్:
ఇక్కడ పురాతన వస్తువులు దొరుకుతుంటాయి. అందమైన, కళాత్మక వస్తువులు మనసు దోచేస్తుంటాయి. ఆనాటి కాలంలో ఎలాంటి వస్తువులు వాడేవారు, అవి ఎంత కళాత్మకంగా ఉండేవో ఇక్కడికి వెళ్తే తెలుసుకోవచ్చు.
మట్టిపాత్రలు, షాన్డ్లియర్లు, ఫర్నిచర్, అలంకార వస్తువులు ఇంకా చాలా రకాల వస్తువులు ఇక్కడ లభిస్తాయి. పురాతన వస్తువులపై ఆసక్తి ఉన్న వారికి ఇది గొప్ప షాపింగ్ అనుభవాన్ని అందిస్తుంది. ఓల్డ్ సిటీలోని ముర్గీ చౌక్ వద్ద ఉంటుంది.
7. అమీర్ పేట్ జంక్షన్:
అమీర్ పేట్ జంక్షన్ కూడా మంచి స్ట్రీట్ షాపింగ్ అనుభూతిని అందిస్తుంది. సరసమైన ధరల్లో ఇక్కడ దుస్తులు సహా ఇతర వస్తువులు లభిస్తాయి. మహిళలు, పురుషులకు చెందిన దుస్తులు ఎక్కువగా దొరుకుతాయి.
8. చార్మినార్ బజార్:
చార్మినార్ చెంతనే ప్రతి రోజూ జరిగే మార్కెట్ ఇది. సాయంత్రం వేళ చూడటానికి చాలా అందంగా ఉంటుంది. హైదరాబాద్ స్ట్రీట్ షాపింగ్ ఎంజాయ్ చేయాలనుకుంటే తప్పకుండా చార్మినార్ బజార్ కు వెళ్లాల్సిందే.
ముత్యాలు, బట్టలు, బ్యాగులు, చెప్పులు ఇలా చాలా రకాల వస్తువులు ఇక్కడ దొరుకుతాయి. హైదరాబాదీ సాంప్రదాయ ఖాదా దుపట్టా, షేర్వాణీలు ఇక్కడ లభిస్తాయి.
ఇంకా.. పాట్ మార్కెట్, అబిడ్స్ స్ట్రీట్, హైదరాబాద్ పెర్‌ఫ్యూమ్స్, శిల్పారామం, మోజం జాహీ మార్కెట్, టొబాకో బజార్ లాంటివి కూడా తప్పకుండా ఆస్వాదించాల్సిన హైదరాబాదీ స్ట్రీట్ మార్కెట్లు.



Click it and Unblock the Notifications











