Latest Updates
-
అమ్మాయిలూ అలర్ట్.. నెలసరిలో తీవ్రంగా కడుపు నొప్పి, అలసట.. ఈ ఐదు తప్పులే కారణం.! -
సజ్జ రొట్టె చేయడం ఇంత ఈజీనా.. ఈ 3 టిప్స్‌తో చపాతీ కంటే సాఫ్ట్‌గా చేసేయొచ్చు.! -
చికెన్ లెగ్ పీస్‌లతో స్పైసీ కుష్కా.. ఇలా చేశారంటే లొట్టలేసుకుంటూ తినాల్సిందే.! -
ఆఫీస్ బ్యాగ్‌తో ఈ పొరపాట్లు.. మీ జేబును ఖాళీ చేస్తాయంటే నమ్ముతారా.? -
బిర్యానీ రుచిని తలదన్నే కొబ్బరి పాల మటన్ పులావ్.. సండే స్పెషల్ అదిరిపోవాల్సిందే.! -
మూత్రంలో మంటతో పాటు విపరీతమైన జ్వరం.. నిర్లక్ష్యం చేస్తే ఈ పార్ట్‌కి ముప్పు తప్పదు.! -
'పోషకాల నిధి' పొట్టు మినప్పప్పు ఆవిరి కుడుములు.. ఒక్కటి తిన్నా రోజంతా ఎనర్జీ.! -
విపరీత రాజయోగం: అక్టోబర్ 31 వరకు ఈ రాశుల వారిపై గురు కటాక్షంతో ఎనలేని కీర్తి, సంపద.! -
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్‌కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.!
ఇండియాలో టాప్-10 రిచెస్ట్ యూట్యూబర్స్ వీళ్ళే.. తెలుగు వాళ్ళు ఎంతమంది ఉన్నారంటే?
సోషల్ మీడియా ద్వారా లక్షల్లో సంపాదిస్తున్న వ్యక్తులు చాలా మంది ఉన్నారు. యూట్యూబ్ వీడియోస్ ద్వారా కోట్లలో సంపాదిస్తున్నారు. మన ఇండియాకు చెందిన యూట్యూబర్ల ఆస్తులు కోట్లలో ఉంటుంది. వందల కోట్లకు పడగెత్తిన యూట్యూబర్లు ఎవరు? వారి ఆస్తుల విలువ ఎంత ఉంటుంది? మన తెలుగు వాళ్ళు ఎవరైనా ఉన్నారా అనేది ఈ స్టోరీలో తెలుసుకుందాం.
గౌరవ్ చౌదరి
ఇండియాలో అత్యంత ధనిక యూట్యూబర్ ఎవరంటే అందరూ టక్కున చెప్పే మాట గౌరవ్ చౌదరి. ఆయన హిందీ టెక్ యూట్యూబర్. ఈయనకు యూట్యూబ్‌లో సుమారుగా 25 మిలియన్స్‌కు పైగా సబ్స్‌క్రైబర్లు ఉన్నారు. ఈయన నికర సంపద 356 కోట్లు కావడం విశేషం. ఈయన ఎక్కువగా దుబాయ్‌లో ఉంటారని తెలుస్తోంది.

భువన్ బామ్
ఇండియాలో అత్యంత రిచ్ యూట్యూబర్ల జాబితాలో భువన్ బామ్ కూడా ఒకరు. ఈయన బీబీ కి వైన్స్ అనే పేరుతో యూట్యూబ్ ఛానల్ నడుపుతున్నారు. ఈయన నికర సంపద 122 కోట్లకు పైగానే ఉంటుంది. ప్రస్తుతం పలు వెబ్ సిరీస్‌లలో నటిస్తున్నారు.
అనిల్ బదానా
అనిల్ బాదానా అనే ఈ యూట్యూబర్ తన పేరుతోనే ఓ యూట్యూబ్ ఛానెల్ నిర్వహిస్తున్నారు. ఈ ఛానల్‌లో ఆయన వ్లాగ్స్ చేస్తుంటారు. ఆ వీడియోల ద్వారా వచ్చే రెవిన్యూలతో పాటు పలు ప్రమోషన్స్ కూడా చేస్తుంటారు. ఈయన నికర సంపద 80 కోట్లకు పైగానే ఉంటుందని తెలుస్తోంది.
అజయ్ నాగర్
క్యారీ మినాటి అనే పేరు తెలియని వారుండరంటే అతిశయోక్తి కాదు. ఇండియాలోనే అత్యంత పాపులారిటీ కలిగిన యూట్యూబర్లలో ఒకరు. ఈయన గేమింగ్, కామెడీ వీడియోలను తీస్తుంటారు. ఈయన అసలు పేరు అజయ్ నాగర్. యూట్యూబ్ ద్వారా ఈయన 50 కోట్లు సంపాదించారు.
నిషా మధులిక
ఆరు పదుల వయసులోనూ నిషా మధులిక యూట్యూబ్ వీడియోస్ చేయడం గమనార్హం. ఆమె తన పేరుతోనే ఓ యూట్యూబ్ ఛానెల్ పెట్టారు. అందులో ఆమె కుకింగ్ వీడియోలను అప్లోడ్ చేస్తుంటారు. ఆమె యూట్యూబ్ ద్వారా 43 కోట్ల రూపాయలు సంపాదించారు.
సందీప్ మహేశ్వరి
ఇండియాలో అత్యంత ధనిక యూట్యూబర్లలో ఈ సందీప్ మహేశ్వరి కూడా ఒకరు. ఈయన కూడా తన పేరు మీదే ఛానల్ పెట్టుకున్నారు. ఈయన ఆస్తులు 41 కోట్లకు పైగానే ఉంటుంది.
ఫైజల్ ఖాన్
ఖాన్ సార్ అనే పేరుతో యూట్యూబ్ ఛానెల్ నిర్వహిస్తున్న ఫైజల్ ఖాన్ అనే వ్యక్తి కూడా యూట్యూబ్ ద్వారా భారీగానే డబ్బులు సంపాదించారు. యూట్యూబ్ డబ్బులతో పాటు పలు ప్రమోషన్లతో ఆయన సుమారు 41 కోట్లకు పైగానే వెనకేసుకున్నారు.
ఆశిష్ చంచలాని
ఆశిష్ చంచలాని అనే ఈ వ్యక్తి తన పేరుతోనే ఓ యూట్యూబ్ ఛానల్ నిర్వహిస్తున్నారు. ఈ ఛానల్ ద్వారా ఈయన భారీగానే డబ్బులు సంపాదిస్తున్నారు. ఈయన నికర సంపద 40 కోట్లకు పైగానే ఉంటుంది.
హర్ష్ బేనివాల్
హర్ష్ బేనివాల్ అనే వ్యక్తి తన పేరుతోనే ఓ యూట్యూబ్ ఛానెల్ నిర్వహిస్తున్నారు. ఈ ఛానల్‌లో ఆయన కామెడీ వీడియోలను అప్లోడ్ చేస్తుంటారు. ఆ వీడియోల ద్వారా ఆయన సుమారు 30 కోట్లకు పైగానే సంపాదించారు.
ధృవ్ రాఠీ
ఇటీవల కాలంలో ధృవ్ రాఠీ చాలా పాపులర్ అయ్యారు. మోదీ ప్రభుత్వం, ఆయన ప్రభుత్వం విఫలమైన విధానం గురించి వివరిస్తూ ఆయన చాలా పాపులర్ అయ్యారు. యూట్యూబ్‌లో ఈయనకు 10 మిలియన్స్‌కు పైగా ఫాలోవర్స్ ఉన్నారు. ఈయన నికర సంపద 26 కోట్లకు పైగానే ఉంటుంది.



Click it and Unblock the Notifications