Latest Updates
-
'పోషకాల నిధి' పొట్టు మినప్పప్పు ఆవిరి కుడుములు.. ఒక్కటి తిన్నా రోజంతా ఎనర్జీ.! -
విపరీత రాజయోగం: అక్టోబర్ 31 వరకు ఈ రాశుల వారిపై గురు కటాక్షంతో ఎనలేని కీర్తి, సంపద.! -
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.! -
రసం, సాంబార్ రుచిని మరిపించే కేరళ స్టైల్ ఉల్లిపాయ పులుసు.. అన్నంలోకి అదరహో.! -
పుస్తక జ్ఞానం ఒక్కటే కాదు.. గురువుల నుంచి నేర్చుకోవాల్సిన జీవిత పాఠాలు ఇవే.! -
గర్భిణీలకు బలాన్ని ఇచ్చే ఫుడ్.. మధ్యాహ్నం హడావుడి లేకుండా ఈజీగా చేసుకునే టేస్టీ డిష్.! -
పూరీ, చపాతీలోకి అదుర్స్ అనిపించే నీలగిరి వెజ్ కుర్మా..అమృతం తిన్న ఫీలింగ్! -
గుండెను పదిలంగా ఉంచడంతో పాటు పొట్ట ఆరోగ్యాన్ని కాపాడే ఫ్రూట్.. మీ భోజనంలో తప్పనిసరి.! -
తరాలు మారినా ఖ్యాతి మారదు.. పూర్వీకుల బలాన్ని ఇచ్చే ఉలవ చట్నీ.. ఇడ్లీ, దోశలోకి అమృతమే.!
మిస్ యూనివర్శ్ 2024లో బొల్లి మహిళ..చరిత్ర సృష్టించిన లోజినా సలా
అందాల పోటీల్లో పాల్గొనాలంటే అమ్మాయిలకు మంచి స్కిన్ కలర్, అందమైన జుట్టు, శరీర ఆకృతి ఉండాలని అందరూ భావిస్తారు. మొన్నటివరకు ఇవే బ్యూటీ ప్రపంచంలో ప్రధాన నియమాలుగా ఉండేవి. అయితే కాలం మారింది. 2024 కూడా దాటి మరికొన్ని రోజుల్లో 2025లోకి అడుగుపెట్టబోతున్నాం. ఈ అడ్వాన్డ్ ప్రపంచంలో ఇప్పుడు అందాల పోటీలు వైవిధ్యం, సమగ్రతను మెచ్చుకునే దిశగా జరుగుతున్నాయి. 2024 మిస్ యూనివర్శ్ పోటీల్లో ఓ బొల్లి మహిళ పాల్గొనడమే దీనికి నిదర్శనం.
తొలిసారిగా మిస్ యూనివర్స్ 2024 పోటీల్లో బొల్లి వ్యాధితో బాధపడుతున్న లోజినా సలా(34) అనే మహిళ పాల్గొంది. ఈమె ఈజిప్ట్ దేశానికి చెందిన మోడల్. మూడేళ్ల క్రితమే లోజినా తన 10 ఏళ్ల కుమార్తె అమీతో కలిసి దుబాయ్ కి మకాం మార్చింది. బొల్లి ఉండి కూడా మిస్ యూనివర్స్ పోటీలో టాప్ 30కి చేరుకున్న మొదటి వ్యక్తిగా లోజినా ఇప్పుడు చరిత్ర సృష్టించింది. బొల్లి అనేది చర్మం యొక్క పాచెస్ రంగును కోల్పోయే పరిస్థితి. ప్రపంచ జనాభాలో దాదాపు 1% మంది బొల్లితో బాధపడుతున్నారు.

అయితే ఈజిప్ట్ లో జన్మించిన లోజినా తన పరిస్థితి కారణంగా అనేక సవాళ్లు ఎదుర్కొన్నప్పటికీ త్మవిశ్వాసంతో ముందుకు తన ప్రయాణాన్ని కొనసాగించింది. కలలను కనడం ఆపలేదు. ఇప్పడు ఆమె బొల్లితో బాధపడుతూ తమ స్కిన్ ని దాచుకుంటున్నవారికి ఓ ప్రేరణగా మారింది.
పనిప్రదేశాల్లో,మన చుట్టుపక్కల బొల్లితో ఉన్న వ్యక్తులు కనబడితే చాలామంది వారిని చూడగానే అసహ్యించుకుంటారు. అందుకే చాలామంది బొల్లి ఉన్న వ్యక్తులు ఆత్మవిశ్వాసం కూడా కోల్పోయి బాధపడుతుంటారు. ఇటువంటి పరిస్థితుల నేపథ్యంలో ప్రపంచవ్యాప్తంగా అందాల పోటీల్లో ఎంతో ప్రాధాన్యత ఉన్న మిస్ యూనివర్స్ 2024 ఫోటీల్లో లోజినా భాగం అవడం చరిత్ర సృష్టించడమే కాకుండా అందాల పోటీల్లో ప్రాతినిధ్యం, చేరికపై చర్చలకు ఈ పరిణామం దారితీసింది.
మొదటిసారిగా బొల్లి ఉన్న వ్యక్తులు అటువంటి ప్రపంచ వేదికపై తమను తాము చూడగలుగుతున్నారు. తమ స్కిన్ గురించి అహస్యపడే భావనలో వారిలో పోయి కాన్ఫిడెన్స్, ఆశ వారిలో ఇవ్వబడింది. తాజాగా తన ఫాలోవర్స్ కి థ్యాంక్స్ చెబుతూ లోజినా ఇన్ స్టాగ్రామ్ లో వరుస పోస్ట్ లు పెట్టింది." ఈ ప్రయాణంలో నాతో ఉన్నందుకు మీ అందరికీ థన్యవాదాలు. మనం చరిత్ర సృష్టించాం. ద్వేషం, వివక్ష లేని ప్రపంచాన్ని రూపొందిచడాన్ని కొనసాగిద్దాం" అని లోజినా తన పోస్ట్ లో తెలిపింది.
మరోవైపు,మెక్సికోలో నవంబర్ 16,202న జరిగిన 73వ ఎడిషన్ మిస్ యూనివర్శ్ పోటీల్లో డెన్మార్క్ కి చెందిన విక్టోరియా హెల్విగ్ విజేతగా నిలిచింది.మొత్తం 125 మంది మిస్ యూనివర్శ్ 2024 కిరీటానికి పోటీ పడగా..21 ఏళ్ల హెల్విగ్ విశ్వసుందరి కిరీటాన్ని దక్కించుకుంది.



Click it and Unblock the Notifications