Latest Updates
-
అమ్మాయిలూ అలర్ట్.. నెలసరిలో తీవ్రంగా కడుపు నొప్పి, అలసట.. ఈ ఐదు తప్పులే కారణం.! -
సజ్జ రొట్టె చేయడం ఇంత ఈజీనా.. ఈ 3 టిప్స్‌తో చపాతీ కంటే సాఫ్ట్‌గా చేసేయొచ్చు.! -
చికెన్ లెగ్ పీస్‌లతో స్పైసీ కుష్కా.. ఇలా చేశారంటే లొట్టలేసుకుంటూ తినాల్సిందే.! -
ఆఫీస్ బ్యాగ్‌తో ఈ పొరపాట్లు.. మీ జేబును ఖాళీ చేస్తాయంటే నమ్ముతారా.? -
బిర్యానీ రుచిని తలదన్నే కొబ్బరి పాల మటన్ పులావ్.. సండే స్పెషల్ అదిరిపోవాల్సిందే.! -
మూత్రంలో మంటతో పాటు విపరీతమైన జ్వరం.. నిర్లక్ష్యం చేస్తే ఈ పార్ట్‌కి ముప్పు తప్పదు.! -
'పోషకాల నిధి' పొట్టు మినప్పప్పు ఆవిరి కుడుములు.. ఒక్కటి తిన్నా రోజంతా ఎనర్జీ.! -
విపరీత రాజయోగం: అక్టోబర్ 31 వరకు ఈ రాశుల వారిపై గురు కటాక్షంతో ఎనలేని కీర్తి, సంపద.! -
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్‌కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.!
కేజీబీ ఏజెంట్ నుంచి ప్రెసిడెంట్ దాకా..పుతిన్ గురించి ఎవ్వరికీ తెలియని రహస్యాలు..పెళ్లి, పిల్లల పూర్తి వివరాలు
గత వారం అమెరికాకు చెందిన ప్రత్యేక బలగాలు వెనిజులా దేశంలో స్పెషల్ ఆపరేషన్ చేపట్టి ఆ దేశ అధక్ష్క్షుడైన నికోలస్ మదురోని బంధించి అమెరికాకు తీసుకెళ్లిన విషయం తెలిసిందే. మదురోతో పాటు ఆయన భార్యను కూడా బంధించి అమెరికాకు తీసుకుపోయారు. అమెరికాలోకి అక్రమంగా డ్రగ్స్ పంపిస్తున్నారని మదురోపై కొంతకాలంగా ట్రంప్ తీవ్ విమర్శలు చేస్తున్న సమయంలో ఈ పరిణామం చోటు చేసుకుంది.
అయితే మదురో..చైనాతో పాటు సైనికపరంగా ప్రపంచంలో మోస్ట్ పవర్ ఫుల్ కంట్రీగా పేరుపొందిన రష్యాతో కూడా చాలా సన్నిహితంగా మెలగడంతో పాటు పుతిన్ తో ఆయనకు మంచి అనుబంధం ఉండేది. అయితే మదురోని అమెరికా నిర్భందించి పట్టుకుపోతుంటే పుతిన్ ఎందుకు సైలెంట్ గా ఉన్నారంటూ సోషల్ మీడియాలో కూడా పెద్ద ఎత్తున చర్చ నడుస్తోంది. దీంతో పుతిన్ పేరు ప్రస్తుతం హాట్ టాపిక్ గా మారింది.
ప్రపంచ రాజకీయాల్లో రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ ఒక బలమైన శక్తి. ఆయన రాజకీయ వ్యూహాలు, యుద్ధ తంత్రాలు ప్రపంచానికి సుపరిచితమే. కానీ క్రెమ్లిన్ ఎత్తైన గోడల వెనుక దాగి ఉన్న ఆయన వ్యక్తిగత జీవితం మాత్రం ఒక హాలీవుడ్ గూఢచారి సినిమాను తలపిస్తుంది.
డోనాల్డ్ ట్రంప్ వంటి నాయకుల వ్యక్తిగత జీవితాలు తెరిచిన పుస్తకాల్లా ఉంటే, పుతిన్ కుటుంబం మాత్రం ఎప్పుడూ టాప్ సీక్రెట్ గానే ఉంటుంది. అయితే దశాబ్దాలుగా వినిపిస్తున్న పుకార్లు, లీక్ అయిన ఫోటోలు, వెస్ట్రన్ మీడియా రిపోర్ట్ లు పుతిన్ రహస్య ప్రపంచంపై ఆసక్తికరమైన ప్రశ్నలను రేకెత్తిస్తున్నాయి.

సామాన్యుడి నుండి జార్ వరకు..
నేడు ప్రపంచాన్ని శాసించే స్థాయిలో ఉన్న పుతిన్..1952లో లెనిన్ గ్రాడ్(సెయింట్ పీటర్స్ బర్గ్)లోని ఒక సామాన్య కార్మిక కుటుంబంలో జన్మించారు. యుద్ధంలో గాయపడిన తండ్రి, ఫ్యాక్టరీలో పనిచేసే తల్లి.. ఇలా పేదరికం,బాల్యంలోనే తోబుట్టువుల మరణం పుతిన్ ను కఠినంగా మార్చాయి.
రాజకీయాల్లోకి రాకముందు ఆయన గూఢచారి సంస్థ KGBలో ఏజెంట్ గా పనిచేశారు. బహుశా అందుకేనేమో, తన వ్యక్తిగత విషయాలను ప్రపంచానికి తెలియనివ్వకుండా దాచడంలో ఆయన సిద్ధహస్తులయ్యారు.
పెళ్లి,డివోర్స్
పుతిన్ జీవితంలో అధికారికంగా ప్రపంచానికి తెలిసిన మహిళ ఆయన భార్య లియుడ్మిలా ష్క్రెబ్నెవా. ఎయిర్ హోస్టెస్ గా పనిచేస్తున్న ఆమెను 1983లో పుతిన్ వివాహం చేసుకున్నారు. ఈ దంపతులకు మరియా వొరోంట్సోవా, కాటెరినా టిఖోనోవా అనే ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. వారిద్దరూ మారుపేర్లతో చదువుకుని, ప్రస్తుతం సైన్స్, పరిశోధనా రంగాల్లో స్థిరపడ్డారు.
అయితే 30 ఏళ్ల వైవాహిక జీవితం తర్వాత 2013లో ఒక బ్యాలెట్ ప్రదర్శన అనంతరం టీవీ సాక్షిగా తాము విడిపోతున్నట్లు ప్రకటించి ఈ జంట ప్రపంచాన్ని ఆశ్చర్యపరిచారు.

అలీనా కబేవాతో పుతిన్ ప్రేమలో పడ్డారా?
పుతిన్ విడాకుల తర్వాత ఎక్కువగా వినిపించిన పేరు అలీనా కబేవా. ఒలింపిక్ స్వర్ణ పతక విజేత, రష్యాలో అత్యంత అందమైన మహిళగా గుర్తింపు పొందిన అలీనాతో పుతిన్ కు గాఢమైన బంధం ఉందని వార్తలు వచ్చాయి.
2022లో అమెరికా, బ్రిటన్ ఆమెపై ఆంక్షలు విధించడంతో ఆమెను పుతిన్ సన్నిహితురాలుగా ప్రపంచం గుర్తించింది. ఈ జంటకు ఇవాన్, వ్లాదిమిర్ జూనియర్ అనే ఇద్దరు కుమారులు స్విట్జర్లాండ్, మాస్కోలలో జన్మించారని వార్తలు వచ్చాయి. పుతిన్ ఈ వార్తలను ఎప్పుడూ ఖండిస్తూనే వచ్చారు.

రహస్య ప్రేయసి, కోటీశ్వరురాలు
ఇవే కాకుండా 90వ దశకంలో స్వెత్లానా క్రివోనోగిఖ్ అనే మహిళతోనూ పుతిన్‌కు సంబంధం ఉన్నట్లు ఆరోపణలు ఉన్నాయి. ఒకప్పుడు సాధారణ క్లీనర్ గా పనిచేసిన ఆమె..ఇప్పుడు రష్యాలో మీడియా, బ్యాంకింగ్ రంగాలలో వాటాలతో అత్యంత సంపన్న మహిళగా ఎదిగారు. వీరికి ఎలిజవేటా (లూయిజా) అనే కుమార్తె ఉందని, ఆమె అచ్చం పుతిన్ పోలికలతో ఉంటుందని సోషల్ మీడియాలో చర్చ జరుగుతుంటుంది.



Click it and Unblock the Notifications