Latest Updates
-
అమ్మాయిలూ అలర్ట్.. నెలసరిలో తీవ్రంగా కడుపు నొప్పి, అలసట.. ఈ ఐదు తప్పులే కారణం.! -
సజ్జ రొట్టె చేయడం ఇంత ఈజీనా.. ఈ 3 టిప్స్‌తో చపాతీ కంటే సాఫ్ట్‌గా చేసేయొచ్చు.! -
చికెన్ లెగ్ పీస్‌లతో స్పైసీ కుష్కా.. ఇలా చేశారంటే లొట్టలేసుకుంటూ తినాల్సిందే.! -
ఆఫీస్ బ్యాగ్‌తో ఈ పొరపాట్లు.. మీ జేబును ఖాళీ చేస్తాయంటే నమ్ముతారా.? -
బిర్యానీ రుచిని తలదన్నే కొబ్బరి పాల మటన్ పులావ్.. సండే స్పెషల్ అదిరిపోవాల్సిందే.! -
మూత్రంలో మంటతో పాటు విపరీతమైన జ్వరం.. నిర్లక్ష్యం చేస్తే ఈ పార్ట్‌కి ముప్పు తప్పదు.! -
'పోషకాల నిధి' పొట్టు మినప్పప్పు ఆవిరి కుడుములు.. ఒక్కటి తిన్నా రోజంతా ఎనర్జీ.! -
విపరీత రాజయోగం: అక్టోబర్ 31 వరకు ఈ రాశుల వారిపై గురు కటాక్షంతో ఎనలేని కీర్తి, సంపద.! -
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్‌కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.!
ముఖేష్ నీతా అంబానీ ప్రేమ కథ.. ట్రాఫిక్ మధ్యలో కారు ఆపి పెళ్లి చేసుకుంటావా లేదా..!
ప్రస్తుతం రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ఇంట్లో పెళ్లి సందడి విషయం మనందరికీ తెలిసిందే. అయితే ముఖేష్ అంబానీకి కూడా లవ్ స్టోరీ వుంది. ఆయన భార్య నీతా అంబానీని ఆయన ప్రేమించి మరీ వివాహం చేసుకున్నారు. ట్రాఫిక్ మధ్యలో కారు ఆపి ఆమె అభిప్రాయాన్ని తెలుసుకున్నారు. ముఖేష్ అంబానీ లవ్ స్టోరి గురించిన మరిన్ని విషయాలను మీకు తెలియజేస్తున్నాం. ముఖేష్ అంబానీ నీతా అంబానీల ప్రేమ వ్యవహారం అక్టోబర్ 1984లో ప్రారంభమైంది. అప్పుడు నవరాత్రి రోజుల్లో ముంబైలో మాతా శ్రీ బిర్లా హాల్‌లో నీతా అంబానీ భరతనాట్యాన్ని ప్రదర్శిస్తూ వుంది. ఆ డ్యాన్స్ ప్రొగ్రామ్‌ను ముఖేష్ అంబానీ తండ్రి ధీరుభాయ్ అంబానీ, కోకిలాబెన్ కూడా హాజరయ్యారు. ఆ ప్రోగ్రాంలో నీతా అంబానీ క్లాసికల్ డ్యాన్స్ చూసి కోకిలా బెన్, ధీరుభాయ్ అంబానీ చాలా ఆకర్శితులయ్యారు. తమ కోడలు ఇలాగే వుండాలని వారు అప్పటికప్పుడే నిర్ణయించుకున్నారు.

నీతా అంబానీ వివరాలు తెలుసుకొని ధీరుభాయ్ అంబానీ ఆమె తండ్రి రవీంద్రాభాయ్ దలాల్‌కు ఫోన్ చేశాడు. ఈ విషయాన్ని తెలుసుకొని రవీంద్రభాయ్ షాక్ అయ్యాడు. రవీంద్రభాయ్‌ను తన ఇంటికి పిలిపించుకున్నాడు. నీతా అంబానీని చూసి ముఖేష్ ఎంత ఇష్టాన్ని పెంచుకున్నాడంటే ప్రతీ రోజూ నీతా అంబానీకి గులాబీ పువ్వులను ఇచ్చేవాడు. అలా వారి ప్రేమ వ్యవహారం కొన్ని రోజులు సాగింది. ముంబై వీధుల్లో ముఖేష్ నీతా అంబానీకి పావ్ భాజీ తినిపించాడు. అలా కొద్ది కాలం కలిసి ప్రేమించుకున్న తరువాత. ముఖేష్ అంబానీ నీతా అంబానీని కారులో రోడ్డు మధ్యలో సిగ్నల్ దగ్గర తీసుకొని వెళ్లి. తనను పెళ్లి చేసుకుంటావా లేదా అని అడిగాడు. సమాధానం చెప్పేంతవరకు కారును ముందుకు కదలనివ్వనని ముఖేష్ అంబానీ మొండికేసాడు. దీంతో నీతా అంబానీ పెళ్లికి అంగీకరించింది.

ఈ కారులో ప్రొపోస్ సంఘఠన అంతా ముంబైలోని పెడ్డెర్ రోడ్డు వద్ద జరిగింది. ఆ సంఘటన తరువాత నీతా అంబానీ ముఖేష్ ను ఇలా అడిగింది. తను పెళ్లి చేసుకోనంటే ఏమి చేసేవాడివి, నన్ను కారు కిందకు దిగనిచ్చే వాడివి కాదు కదా అన్ని అన్నది. దానికి ముఖేష్... లేదు, నేను నిన్ను మీ ఇంటి దగ్గర వదిలేసేవాడిని మనం కేవలం ఒక మంచి స్నేహితులుగా వుండిపోయేవాళ్లమని ముఖేస్ సమాధానమిస్తాడు.
ముఖేష్ అంబానీ, నీతా అంబానీ 1985లో వివాహం చేసుకున్నారు. దంపతులకు ముగ్గురు పిల్లలు : వారే ఆకాష్, ఇషా, అనంత. ఆకాష్ అంబానీ, ఇషా అంబానీకి వివాహమైంది. అనంత్ అంబానీకి, రాధికా మర్చంట్‌కు వివాహం ఈ ఈ నెల జులైలో జరుగునున్న విషయం తెలిసిందే. ప్రస్తుతం కొడుకు పెళ్లి మూలంగా ముఖేష్ ప్రేమ చరిత్ర మరోసారి తెరపైకి వచ్చింది.



Click it and Unblock the Notifications