Latest Updates
-
మూత్రంలో మంటతో పాటు విపరీతమైన జ్వరం.. నిర్లక్ష్యం చేస్తే ఈ పార్ట్‌కి ముప్పు తప్పదు.! -
'పోషకాల నిధి' పొట్టు మినప్పప్పు ఆవిరి కుడుములు.. ఒక్కటి తిన్నా రోజంతా ఎనర్జీ.! -
విపరీత రాజయోగం: అక్టోబర్ 31 వరకు ఈ రాశుల వారిపై గురు కటాక్షంతో ఎనలేని కీర్తి, సంపద.! -
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్‌కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.! -
రసం, సాంబార్ రుచిని మరిపించే కేరళ స్టైల్ ఉల్లిపాయ పులుసు.. అన్నంలోకి అదరహో.! -
పుస్తక జ్ఞానం ఒక్కటే కాదు.. గురువుల నుంచి నేర్చుకోవాల్సిన జీవిత పాఠాలు ఇవే.! -
గర్భిణీలకు బలాన్ని ఇచ్చే ఫుడ్.. మధ్యాహ్నం హడావుడి లేకుండా ఈజీగా చేసుకునే టేస్టీ డిష్.! -
పూరీ, చపాతీలోకి అదుర్స్ అనిపించే నీలగిరి వెజ్ కుర్మా..అమృతం తిన్న ఫీలింగ్! -
గుండెను పదిలంగా ఉంచడంతో పాటు పొట్ట ఆరోగ్యాన్ని కాపాడే ఫ్రూట్.. మీ భోజనంలో తప్పనిసరి.!
ఆషాడమాసం, ఫస్ట్ మంగళవారం, మెగా ఫ్యామిలీలో మహాలక్ష్మి, చరణ్ నిజంగా లక్కీ
మెగా ఫ్యామిలీతో పాటు మోగా ఫ్యాన్స్ ఆనందంలో మునిగితేలుతున్నారు. మోగా ఫ్యాన్స్ అందరికి స్వీట్లు పంచిపెడుతున్నారు. అయితే మెగా ఫ్యామిలీ హీరోల సినిమాలు మాత్రం విడుదల కాకపోయినా అభిమానులు ఎందుకు స్వీట్లు పంచిపెడుతున్నారంటే ప్రత్యేకంగా చెప్పుకోవాలి. ఆషాడమాసంలో అది మంగళవారం రోజున మోగా ఫ్యామిలీలో మహాలక్ష్మి అడుగుపెట్టింది. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్ భార్య ఉపసాన మంగళవారం వేకువ జామున పండంటి ఆడబిడ్డకు జన్మనిశ్చారు.
ఉపాసన సొంత ఆసుపత్రి అయిన అపోలో ఆమె ఆడబిడ్డకు జన్మనిశ్చారు. తల్లీబిడ్డ క్షేమంగా ఉన్నారని అపోలో ఆసుపత్రి వర్గాలు ఓ ప్రకటన విడుదల చేశారు. మెగా ఫ్యామిలీలో మెగా ఫ్రిన్స్ అడుగుపెట్టిందంటూ మెగా ఫ్యాన్స్ సోషల్ మీడియాను షేక్ చేస్తున్నారు. మరో వైపు మెగా ఫ్యాన్స్ పలు ప్రాంతాల్లో పండుగ చేసుకుంటున్నారు. మొత్తం మీద రామ్ చరణ్ ఆడబిడ్డకు తండ్రి కావడంతో ఆయన ఆనందానికి హద్దులు లేకుండా పోయాయని ఆయన సన్నిహితులు అంటున్నారు.

ముందే రామ్ చరణ్ కు గిఫ్ట్ ఇచ్చిన కాలభైరవ:
మగధీర సినిమాలో రామ్ చరణ్ పేరు కాలభైరవ అని ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. యువ సంగీత దర్శకుడు, సింగర్ అయిన కాలభైవర్ ఓ అద్బుతమైన ట్యూన్ తయారు చేసి రామ్ చరణ్, ఉపాసన దంపతులకు పుట్టబోయే బిడ్డకు ఇంతకు ముందే బహుమతిగా ఇచ్చాడు. రామ్ చరణ్, ఉపాసన దంపతులకు పుట్టబోయే బిడ్డ కోసం తాను ప్రత్యేకమైన ట్యూన్ తయారు చేశానని ఇంతకు ముందే కాలభైరవ చెప్పారు.
కాలభైవర్ ఇచ్చిన ప్రత్యేక ట్యూన్ విన్న రామ్ చరణ్, ఉపాసన దంపతులు సంతోషంలో మునిగిపోయి ఆయనకు థ్యాక్స్ చెప్పారు. మాబిడ్డ కోసం ప్రత్యేకంగా ట్యూన్ తయారు చెయ్యడం మాకు చాలా ఆనందంగా ఉందని రామ్ చరణ్, ఉపాసన దంపతులు కాలభైరవకు థ్యాక్స్ చెప్పారు. నువ్వు మా కోసం తయారు చేసిన ప్రత్యేక ట్యూన్ జీవితంలో మరిచిపోలేమని, ఆ ట్యూన్ వింటున్న లక్షలాది మంది చిన్నారుల సంతోషంతో మునిగిపోతున్నారని రామ్ చరణ్ ట్వీట్ చేశారు.
మెగా ఫ్యామిలీకి ఇప్పుడు తెలుగు సినీ ఇండస్ట్రీకి చెందిన ప్రముఖులు, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, కర్ణాటకతో పాటు ఇతర రాష్ట్రాలకు చెందిన రాజకీయ ప్రముఖులు, సినీ ప్రముఖులు శుభాకాంక్షలు చెబుతున్నారు. రామ్ చరణ్ తండ్రి కావడంతో మెగాస్టార్ చిరంజీవి, సురేఖ దంపతుల ఆనందానికి హద్దులు లేకుండా పోయాయని తెలిసింది.

ఇదే సమయంలో పవర్ స్టార్ పవన్ కల్యాణ్ కూడా రామ్ చరణ్ కు ఫోన్ చేసి శుభాకాంక్షలు చెప్పారని, ఉపాసన ఆరోగ్యం గురించి ఆరా తీశారని మెగా ఫ్యామిలీ సన్నిహితులు అంటున్నారు. మొత్తం మీద మెగా పవర్ స్టార్ రామ చరణ్ ఆడబిడ్డకు తండ్రి అయ్యారు. మామూలుగానే ఆడబిడ్డ పుడితే తండ్రి ఎక్కువగా ఆనందిస్తాడు. అలాంటిది ఆషాడమాసంలోని మొదటి మంగళవారం రామ్ చరణ్ ఆడబిడ్డకు తండ్రి కావడంతో ఆయన నిజంగా చాలా లక్కీ అని కొందరు జ్యోతిష్యులు అంటున్నారు.



Click it and Unblock the Notifications